ఉత్తరాయణం

హైదరాబాద్‌ను యుటీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగర ఉనికి ప్రశ్నార్థకమైందంటే అతిశయోక్తి కాదు. తెరాస నాయకులు, తెలంగాణ ప్రజలు ఈ నగరం తమ వారసత్వపు హక్కు అని, ఆంధ్రావారు కేవలం కిరాయిదారులు అనే ధోరణిలో పెత్తనం చెలాయిస్తూ, సీమాంధ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి సీమాంధ్రుల వల్లనే జరిగింది. హైదరాబాద్‌కు 400 ఏళ్ల చరిత్ర ఉన్నదంటూ చెప్పే తెరాస నాయకులు, అంతకన్నా రెండింతలు చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లు, నాసిక్ వంటి నగరాలు ఎందుకు అభివృద్ధి చెందలేదో జవాబు ఇవ్వగలగాలి. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ఒక్కటే మార్గం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేదానికన్నా కూడా ఇది ఎక్కువ అవసరం. హైదరాబాద్‌ను ఏ ఒక్కరి సొత్తుగానో కాకుండా ప్రజానగరంగా మార్చుకోవాలి. ఇం దుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి, ఉమ్మడి రాజధానిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి అందరికి సమాన అధికారం కల్పించాలి. ఇది భావితరాలకు ఎంతో అవసరం.
- బి. వెంకటేశ్వర్లు, కర్నూలు
విశాఖ వాసులకు నిరాశ
జన్మకోశివరాత్రి మాదిరిగా తొలిసారి విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఐ.ఎఫ్.ఆర్‌ను చూద్దామన్న విశాఖ వాసులకు తీవ్ర నిరాశే మిగిలింది. నగరంలో ఉండి ఇక్కడ జరుగుతున్న అరుదైన కార్యక్రమాన్ని వీక్షించలేకపోయామన్న ఆవేదనను నగరవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకోసం నిర్దేశించిన పాసులలో అధికశాతం పక్కదారి పట్టాయి. నగరంలో 40 థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయమన్న ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి కౌంటరు తెరచిన కొద్ది సేపటికే హౌజ్‌ఫుల్ బోర్టులు పెట్టి, టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయించారు. ఇటువంటి అరుదైన ప్రదర్శనలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా ప్రభు త్వ యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది.
- సి. ప్రతాప్, శ్రీకాకుళం
ఇలా చేసి చూడండి..!
వచ్చే మార్చి 21నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, రాష్ట్ర పరిశీలకులుగా 2015, 2016 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసిన వారికి అవకాశం కల్పిస్తే పరీక్షలు బాగా నిర్వహించవచ్చు. వీరు పదవీ విరమణ పొందిన వారు కనుక ఎటువంటి ప్రలోభాలకు తలవంచరు. ప్రతి జిల్లాలో రెండు సంవత్సరాల నుండి రిటైర్‌మెంట్ జాబితా తీసుకుంటే చాలామందే ఉంటారు. ఇలా చేసి చూడండి. కచ్చితంగా సానుకూల స్పందనే ఉంటుంది. అంతే కాకుండా ఏ స్కూలు డిస్టర్బ్ కాకుండా రిటైరయిన వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు కూడా అవుతుంది. పదవీ విరమణ చేసిన వారిలో ఎంతో నేర్పు, చాకచక్యం కలిగిన వారున్నారన్న సంగతి మరవొద్దు.
- పువ్వాడ హనుమాన్ ప్రసాద్, హైదరాబాద్
నష్టాన్ని వసూలు చేయాలి
తునిలో చేపట్టిన కాపు గర్జన సభ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకొని హింసాత్మకంగా మారడం మిక్కిలి శోచనీయం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వానిది. ముఖ్యంగా ఆ వర్గానికి చెందిన పాలకులనేకమంది ఉండి కూడ ఎన్నికల వాగ్దానాన్ని జాప్యం చేయకుండా చర్యలు చేపట్టి వారి సమస్యలు తీర్చేందుకు, తగిన చర్చలు జరపాల్సి ఉండింది. కాని అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని విధ్వంసానికి పాల్పడకుండా ఉండేందుకు తగినంత మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేయనందువల్ల ఆ సమయంలో అక్కడ ప్రభుత్వం ఉన్నట్లు కనిపించలేదు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును, ఇరవైకి పైగా పోలీసు వాహనాలను, రెండు పోలీసు స్టేషన్లను, దుకాణాలను తగుల పెడుతుంటే వారించేవారే లేరు. అంత నింపాదిగా విధ్వం సానికి పాల్పడుతుంటే, టీవీ వీక్షకులకు కడుపు మం డిపోయంది. కోట్లాది ప్రజాధనాన్ని తగులపెట్టిన వారిపై కేసులు పెట్టి, నష్టపోయిన ఆస్తుల విలువ మొత్తాన్ని వారినుంచి వసూలు చేయాలి.
- జి.వి. రత్నాకర్ రావు, హనుమకొండ
పార్టీ ఫిరాయింపులు అతిహేయం
ఇటీవల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు అధికంగా జరుగుతుండడం విశేషం. ఫిరాయింపుల చట్టం కూడ వీటిని అరికట్టలేకపోతున్నది. కేవలం అధికారం కోసం అవినీతి చర్యలకు పాల్పడి, కొందరు ప్రబుద్ధులు గతంలో తాము కొనసాగిన పార్టీలో అనేక పదవులు అనుభవించి, తీరా అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలోకి ఫిరాయించడాన్ని మనం నిత్యం చూస్తున్నాం. అట్టి స్థిమితం లేని ఈ నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని, కండువా కప్పేది కూడా దిక్కుమాలిన చర్యే అవుతుంది. ప్రజలకు మార్గదర్శకులుగా కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉండవలసిన వారు తరచూ పార్టీలు ఫిరాయించడం దారుణం. వీరికి ప్రజలు ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణా జిల్లా
కులచిచ్చు రూపుమాసేది ఎన్నడో?
సంపన్న వర్గానికి చెందిన ఒక కుల నాయకుడు తమ కులాన్ని బీసీల్లో చేర్చమని ఉద్యమం చేయడం ఒక ఎత్తయితే, తన లక్ష్యం కోసం వంటింట్లో కూర్చుని నిరాహార దీక్ష చేయడం మరొక ఎత్తు. దీనికి ప్రభుత్వం కంగారు పడి అధికారులను ఆ ఇంటి చుట్టూ కాపలా పెట్టి తలుపులేసుకొని ఇంట్లో కూర్చున్న వారికి రక్షణ కల్పించడం హాస్యాస్పదంగా లేదూ! ఈ కులచిచ్చు పోయి దేశం బాగుపడేదెన్నడో?
- డి. రామకృష్ణ, పొలమూరు, ప.గో. జిల్లా