ధనం మూలం
మిత్రులూ సంపదే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గార్డెన్ హోటల్‌లో టీ తాగుతున్న మిత్రులు తమ పక్కన నిలబడి టీ రుచిని ఆస్వాదిస్తూ మురిపెంగా తాగుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అతను అల్లా టప్పా వ్యక్తి కాదు. అతను గీసిన బొమ్మలు చాలా ఖరీదైనవి. స్టార్ హోటల్స్‌లో ఆ బొమ్మలు స్టేటస్ సింబల్‌గా నిలుస్తాయి. అలాంటి వ్యక్తి సికిందరాబాద్‌లో రోడ్డు పక్కన ఉండే గార్డెన్ రెస్టారెంట్‌లో అంత తన్మయంగా టీ తాగడం చూసేవారికి వింతే మరి.. ఆ వ్యక్తి ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్. ఆతను గీసిన బొమ్మలు అత్యంత ఖరీదైనవి కానీ ఆయన మాత్రం చిన్న చిన్న వాటితో ఆనందాన్ని పొందేవారు.
***
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఎఎస్ అధికారి ఒకరు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉన్నతాధికారిగా బిజీ జీవితం గడిపి, ఎన్నో కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి రిటైర్‌మెంట్ తరువాత కొంత కాలానికి అల్జీమర్‌తో తన పేరు కూడా మరిచిపోయి పసిబిడ్డలా జీవించడం చూసిన వారికి కళ్లు చెమర్చాయి.
జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన ఒకరు డిప్రెషన్‌లో ఉన్నాను. ఇక పని చేయలేనని దీనంగా చెప్పడం విన్నవారికి బాధ కలిగించింది.
***
తన పోస్టర్‌తో 40 అడుగుల కటౌట్‌ను చూసిన హీరో కొన్ని రోజులకే తాను నటించిన సినిమా పోస్టర్‌లో తన చిన్న బొమ్మ కూడా లేకపోవడం ఎలా ఉంటుంది? ఆ స్థితిని తట్టుకోవడం సాధ్యమా? అలాంటి స్థితిని తట్టుకోవాలంటే స్థితప్రజ్ఞత కావాలి. అలా తట్టుకుని నిలిచి నలుగురికి ధైర్యం చెప్పిన అలనాటి హీరో రంగనాథ్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. యువ హీరోగా ఒక వెలుగు వెలిగిన యువత కలల రాజకుమారుడిగా నిలిచిన ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన ఉదయకిరణ్‌ను చూడడమే జీవితం ధన్యం అయిందని భావించే వారు అతని అభిమానులు. మెగాస్టార్ అల్లుడిగా మరో మెగాస్టార్ అవుతాడనుకున్నారు. చివరకు అవకాశాలు లేక జీవితంపై విరక్తి కలిగి ఉదయకిరణ్ అర్థంతరంగా తనువు చాలించాడు.
***
ఇక్కడ పేర్కొన్న ఎంఎఫ్ హుసేన్, రిటైర్డ్ ఐఎఎస్, రిటైర్డ్ జడ్జి, రంగనాథ్, ఉదయ్‌కిరణ్ ఐదుగురు వ్యక్తుల ఉదంతాలు ఒకదానికి ఒకటి సంబంధం ఏమిటి అనిపించవచ్చు. కానీ వీరి జీవితాలను చూస్తే సంబంధం తెలుస్తుంది.
ధనం అంటే కేవలం ద్రవ్యరూపంలో ఉండే డబ్బు మాత్రమే కాదు. మానవ సంబంధాలు, మన ఆలోచనలు కూడా ధనమే. మన మేలు కోరే నలుగురు ఉండడం, మంచి చెడు ఏదైనా మనం పంచుకోగల నలుగురు స్నేహితులు, సన్నిహితులు ఉండడం కూడా ధనమే.
తన ఆలోచనలు పంచుకోవడానికి నలుగురు మిత్రులు ఉండి ఉంటే ఉదయకిరణ్, రంగనాథ్ లాంటి వారు ఆత్మహత్య చేసుకునే వారు. కాదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉన్నతాధికారిగా పని చేసి, పని తప్ప మానవ సంబంధాలు అనేవి లేకపోవడం, ఆలోచనలు పంచుకునే స్నేహితులు లేకపోవడం వల్లనే రిటైర్డ్ జడ్జి డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఉన్నతాధికారి అల్జీమర్ బారిన పడ్డారు.
ఒక జడ్జిగా జిల్లాల్లో పని చేసేప్పుడు మార్నింగ్ వాక్ సైతం జడ్జీల క్వార్టర్ ఆవరణలోనే చేయడం ఇక మనుషులతో సంబంధాలు ఎలా ఏర్పడతాయి. బంధువులు లేరు, స్నేహితులు లేరు. నేనేం కోల్పోయానో ఇప్పుడు తెలిసింది, కానీ అంతా అయిపోయిన తరువాత తెలుసుకుని చేసేది కూడా ఏమీ లేదని నిరాశగా ఆ జడ్జి వాపోతున్నారు.
ఉదయ్‌కిరణ్ వరుస హిట్లతో అభిమానుల్లో మంచి క్రేజ్ సాధించారు. అదే తరుణంలో మెగాస్టార్ అల్లుడిగా ఇక అతనికి తిరుగులేదనుకున్నారు. అల్లు రామలింగయ్య రూపంలో చిరంజీవికి అదృష్టం కలిసి వచ్చినట్టు చిరంజీవితో ఉదయకిరణ్ దశ తిరుగుతుంది అనుకున్నారు. ఏం జరిగిందో కానీ వివాహం కాలేదు. తరువాత సినిమాల్లో అవకాశాలూ లేకుండా పోయాయి. వృత్తిలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తాడు అనుకున్న హీరో కాస్తా అవకాశాలు లేక దిగులు పడిపోయాడు. డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ధైర్యం చెప్పే మంచి మిత్రులు ఉంటే ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకునే వారు కాదని ఒక ఇంటర్యూలో రంగనాథ్ చెప్పారు. కానీ చివరకు రంగనాథ్ సైతం ఒంటరితనంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగనాథ్ దాదాపు 300 సినిమాల్లో నటించారు. హీరోగా వెలుగుతున్న కాలంలో దురదృష్టం వెంటాడింది. భార్య ప్రమాదం బారిన పడితే సినిమా అవకాశాలను సైతం పట్టించుకోకుండా భార్యకు సేవ చేశాడు. భార్య మరణం తరువాత ఒంటరి తనం అనుభవించాడు.
ఒక ఉన్నతాధికారి కావచ్చు, వ్యాపారి, సినిమా నటులు ఎవరైనా కావచ్చు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు జీవితంలో బిజీగా ఉంటారు. వ్యక్తిగత జీవితం ఉంటుంది అనే ధ్యాస లేకుండా బతుకుతారు. బంధువుల ఇళ్లలో శుభకార్యాలు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఏమీ ఉండదు. సమయం అంతా వృత్తికి, ఉద్యోగానికే కేటాయిస్తారు. దీని వల్ల వారు చేసే వృత్తిలో, ఉద్యోగంలో ఉన్నత స్థానంలోకి చేరవచ్చు. కానీ ఉద్యోగంలో అయితే రిటైర్‌మెంట్, సినిమా నటులకైతే క్రమంగా అవకాశాలు తగ్గడం అంటూ ఏదో ఒక దశలో అనివార్యం. దీన్ని గ్రహిస్తే బిజీగా ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది అనే ఆలోచనలో ఉంటే చివరి దశలో ఒంటరితనం అనే శాపం ఉండదు.
హీరోగా బతికితేనే జీవితమా? బాగా అవకాశాలు వచ్చినప్పుడే ఉదయకిరణ్ భవిష్యత్తు అవసరాలకు ఏర్పాటు చేసుకోవలసింది. అదే సమయంలో హీరోగా అవకాశాలు తగ్గితే ఇతర పాత్రలకు మనసును సిద్ధం చేసుకోవాల్సింది. కనీసం మంచి స్నేహితులు ఉన్నా ఉదయకిరణ్ డిప్రెషన్‌లో ఆత్మహత్యకు పాల్పడేవారు కాదు. సినిమా, ఇళ్లు మాత్రమే ప్రపంచం అన్నట్టుగా బతికిన రంగనాథ్‌కు రెండూ తన నుంచి దూరం కావడంతో జీవితంపై విరక్తి కలిగింది.
ఇలాంటి పరిస్థితి ముందుగానే ఊహించి మన పరిధి విస్తృతం చేసుకోవాలి. మన పదవి, ఉద్యోగం, వృత్తి శాశ్వతం కాదు అని గ్రహించాలి. మార్పును అర్థం చేసుకోవాలి వీటితో పాటు మనసెరిగిన నలుగురు మిత్రలను సంపాదించుకోవాలి. కేవలం డబ్బు మాత్రమే జీవితాన్ని ఇవ్వదు. నలుగురు మిత్రులుంటే వారు జీవితంపై ఆశ కలిగిస్తారు.
చిత్రం..రంగనాథ్