ధనం మూలం
ఈస్ట్ ఇండియా కంపెనీని కొనేశాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి, ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనేది చాలా మంది ఆశ, జీవిత లక్ష్యం. కొందరు మరింత ముందుకు వెళ్లి ఉద్యోగం చేస్తే ఎంత కాలానికైనా ఆస్తి సంపాదించేది లేదు. వ్యాపారంలో బోలెడు సంపాదించాలి, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని కోరుకుంటారు. ఇవేమీ అసాధ్యమైన లక్ష్యాలేమీ కావు. ప్రయత్నిస్తే సాధ్యం కానివేమీ కాదు.
మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం పెద్ద కలలు కనమన్నాడు. ఆ మాటను విన్నాడో లేదో కానీ ముంభైకి చెందిన సంజీవ్ చాలా పెద్ద కలలను కన్నాడు. ఒక సొంత ఇల్లు, సొంత వ్యాపారం, సొంత కంపెనీ లాంటి కలలు కాదు. మన దేశాన్ని దాదాపు వందేళ్ల పాటు నేరుగా పాలించి, ఆ తరువాత రెండు వందల ఏళ్లపాటు బ్రిటీష్ పాలన కింద మగ్గేట్టు చేసిన కంపెనీని కొనేయాలనుకున్నాడు. అనుకోవడమే కాదు ఏకంగా కొనేశాడు.
చరిత్ర పాఠాలు చదువుకున్న వారికి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి బాగా తెలుసు. తొలుత బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారానే పాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 16వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. మన దేశంతో అప్పటి రాజుల అనుమతితో వ్యాపారం సాగించేది. మొఘలాయిల కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారానికి అనుమతి ఇచ్చారు. వ్యాపారం పేరుతో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మాయోపాయాలతో ఏకంగా దేశం మొత్తాన్ని తన అదుపులోకి తెచ్చుకుని పాలించింది. కంపెనీ పాలన అనంతరం బ్రిటీష్ రాణి నేత్వత్వంలో మన దేశాన్ని పాలించారు. అలాంటి కంపెనీ చివరకు ఏమైంది అనే ఆసక్తి ఉండడం సహజం. దాదాపు 18 శతాబ్దం మధ్యలో ఆ కంపెనీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపార కార్యకలాపాలు జరిగేవి. వందేళ్ల పాటు మన దేశాన్ని పాలించిన ఆ కంపెనీని కొనేయాలనిపించింది. వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందిన సంజీవ్ మెహతాకు.
కోట్ల రూపాయలు పెట్టి పేయింటింగ్‌లను కొనేవాళ్లు చాలా మందే ఉంటారు. సంజీవ్ మెహతాది అలాంటి అభిరుచి కాదు. ఏదో పేరు కోసం ఈస్ట్ ఇండియాను కొనడం కాదు. మనల్ని వందేళ్లపాటు పాలించిన కంపెనీకి భారతీయుడు యజమానిగా ఉండాలి అనే కోరిక. అలా అని ఈ మురిపెం తీర్చుకోవడానికి పెద్ద మొత్తంలో వృధాగా ఖర్చు చేయాలని కాదు. ఈ బ్రాండ్‌తో వ్యాపారం నిర్వహించాలని, తన పెట్టుబడికి ప్రయోజనం ఉండాలని కోరుకున్నారు. దీనిని కేవలం ఒక బిజినెస్ వ్యవహారంగా భావించలేదు, ఏదో లాభసాటి ఒప్పందం అని కాకుండా ఎమోషనల్‌గా కంపెనీని హస్తగతం చేసుకోవాలి అని భావించినట్టు సంజీవ్ మెహతా కంపెనీని కొన్నాక చెప్పారు. పదిహేను మిలియన్ డాలర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీని కొనేశారు. సువిశాల భారత దేశాన్ని వందేళ్లపాటు పాలించిన కంపెనీనిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అవసరం అయిన సంపద సమకూర్చుకోవడానికి చాలా తపించారు. అనుకున్నది సాధించారు. ఈ కంపెనని కొనడానికి చాలా కాలం పాటు కష్టపడ్డారు. చివరకు 2010లో అవసరం అయిన సంపద సమకూర్చుకని కొనేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రాండ్ పేరుతో పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ కామర్స్‌లో సైతం ప్రవేశించారు. లండన్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో సంజీవ్ మెహతా స్టోర్‌ను ప్రారంభించారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చును అని ఇది నిరూపిస్తుంది. ఏదీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని బోధిస్తుంది.
మంచి మార్కులు సాధించాలన్నా, ఉద్యోగం, సంపద, ఆనందం మీ లక్ష్యం ఏదైనా కావచ్చు దాని కోసం తీక్షణంగా ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది.
కోట్లాది మంది ప్రజలున్న భారత దేశాన్ని కొద్ది మంది ఉద్యోగులు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వందేళ్లు పాలించడం అంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. కోట్ల మంది ఉన్నా ఈ దేశాన్ని ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు అని మొదటి ఎవరు గ్రహించారో వాడు గొప్పోడు అంటాడు ఓషో. చిన్న చిన్న సవాళ్లకే ఇది సాధ్యమా? అని మనల్ని మనం నిరుత్సాహ పరుచుకుంటాం. కానీ కోట్ల మంది భారతీయులను పాలించడం ఈజీనే అని వ్యాపారం చేసే ఒక కంపెనీ భావించడం విశేషం. అనుకుంటే సాధ్యం కానిదేదే లేదని ఈస్ట్ ఇండియా కంపెనీ నిరూపిస్తే. ఆ కంపెనీనే కొనుగోలు చేయాలని ఒక వ్యక్తి తలుచుకుంటే సాధ్యం అవుతుంది అని సంజీవ్ మెహతా నిరూపించారు.
ఎంత గొప్ప కంపెనీలో పని చేస్తున్నా అది శాశ్వతం అని భావించవదు. బిఎస్‌ఎన్‌లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంటుందా? ఉండదే అనే సందేహంలో పడిపోయింది. లక్ష మంది ఉద్యోగులు విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడైనా దీన్ని ఎవరైనా కలలోనైనా ఊహించారా? ఇంటికి ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కావాలి అంటే దాదాపు పదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. ఆ సమయంలో బిఎస్‌ఎన్ ఉద్యోగులు తమను తాము ప్రభువులుగా భావించేవారు. ఇప్పుడు అంత పెద్ద సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. అలానే వందేళ్ల పాటు ఒక దేశానే్న పాలించిన కంపెనీ ఇప్పుడు ఒక సామాన్యుడి చేతిలో ఇమిడి పోయింది.
ప్రయత్నిస్తే సాధ్యం కానిదేమీ లేదు. మీరు సంపన్నులు కావాలి అంటే సంపన్నుల కుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదు. సంపద కోసం ప్రయత్నించండి సాధ్యం అయి తీరుతుంది. మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. దాన్ని సాధించుకునే మార్గాలపై దృష్టి సారించాలి. నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు సాధ్యం కానిదేమీ లేదు.