ధనం మూలం

ఖర్చులకు కళ్లెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు సంపాదించడం కన్నా ఖర్చు చేసే విధానం కూడా కీలకమే. ఎంత సంపాదిస్తేనేం ఖర్చుపై అదుపు లేకపోతే పొదుపు ఉండదు. పొదుపు లేనప్పుడు మీ వద్ద సంపదా ఉండదు. సంపాదించడం ఒక కళ అంటారు. సంపాదించడమే కాదు ఖర్చు చేయడం కూడా కలే.
మాట్లాడ కూడని సమయంలో మాట్లాడడం ఎంత తప్పో, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడక పోవడం కూడా అంతే తప్పు. మాటలకు సంబంధించిన నియమమే ఖర్చుకు సంబంధించి కూడా వర్తిస్తుంది. ఖర్చు చేయాల్సిన సమయంలో, చేయాల్సిన సందర్భంలో ఖర్చు చేయాల్సిందే. అదే సమయంలో అవసరం లేని ఖర్చు తలకు మించిన భారం అవుతుంది. ఏది అవసరం ఐన ఖర్చు? ఏది అనవసర ఖర్చు అనే దానిపై మొదటి నుంచి అవగాహన ఉంటే ఆర్థిక శాస్త్రం అబ్బినట్టే ఇలాంటి వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభించకుండా ఎవరూ ఆపలేరు.
ఈకాలంలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారే కాదు సాధారణ చదువులు చదివిన వారు సైతం ఆన్ లైన్‌లో కొనేస్తున్నారు. ఓ రెండు దశాబ్దాల క్రితం ఆన్‌లైన్ మార్కెట్ మొదలైనప్పుడు బుడగలా పడిపోయింది. అప్పుడు అందరూ అనుకున్నట్టే జరిగింది. చీపురు కట్టను సైతం పట్టుకుని చూసి సంతృప్తి చెందిన తరువాతనే కొనడం భారతీయుల అలవాటు ఆన్‌లైన్‌లో చూసి కొనడానికి అసాధ్యం ఆన్‌లైన్ మార్కెట్ నిలబడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు చదువుకున్న వారు పెద్దగా చదువు లేని వారు అనే తేడా లేదు. పిల్లలు పెద్దలు అనే తేడా లేదు. వస్తువులే కాదు చివరకు ఇంట్లో ఉదయం టిఫిన్ కోసం సైతం ఆన్‌లైన్‌లో స్విగ్గీని ఆశ్రయించేస్తున్నాం.
సాధారణంగా మన అందరం చేసే ఖర్చులను గమనించిన తరువాత ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నిపుణులు కొన్ని సూచనలు చేశారు. కొన్నిసార్లు మనం ఈ వస్తువు కొని తీరాలి అనుకుంటాం. ఎంత ధర ఐనా సరే ఇప్పుడే ఇక్కడే కొనేస్తాను అనుకుంటారు. నచ్చిన దుస్తులు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ కావచ్చు. మొదటి రోజు మొదటి ఆట టికెట్ కావచ్చు. ఎంత డబ్బయినా సరే బ్లాక్‌లో కొని మొదటి రోజు మొదటి ఆట చూడడం కొందరికి ఓ అలవాటు. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వాటికి అలవాటు కావద్దు. రెండు రోజులు ఆగితే ఆ సినిమా సగం ధరతో చూడవచ్చు. మార్కెట్‌లో రోజుకు డజను సెల్‌ఫోన్ మోడల్స్ వస్తున్నాయి. ఇప్పుడున్నది సరిపోదా? అని మీకు మీరు ప్రశ్నించుకోవాలి.
ఆన్‌లైన్ కొనుగోలు వల్ల ఎంత ఖర్చు చేస్తున్నామనే ఆలోచన ఉండదు. ఆన్‌లైన్‌లో ఏం కావాలో టిక్ పెడితే చాలు. క్రెడిట్ కార్డు పిన్ నంబర్ నొక్కితే చాలు. చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఈ వస్తువు ధర ఇంత ఉంటుందా? అవసరమా? అనే ఆలోచన రాదు.
ఖర్చు మీద అదుపు ఉండాలి అంటే ఒక వస్తువు కొనేప్పుడు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఒక షాప్‌లో కొనే వస్తువు కావచ్చు. ఆన్‌లైన్‌లో కొనడం కావచ్చు. ఒక వస్తువు ఖరీదు ఐదు వేల రూపాయలు అనుకుందాం. అది కొనేప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నెలకు కనీసం 26 రోజులు ఉద్యోగం చేస్తారు. రోజుకు ఎనిమిది గంటలు కష్టపడతారు. మీ జీతం గంటకు ఎంతో లెక్క తేల్చండి. మీరు కొనే వస్తువు మీ ఎన్నిగంటల శ్రమనో ప్రశ్నించుకోండి. అన్ని గంటల శ్రమతో ఆ వస్తువును కొనడం అవసరమా? ఆ మేరకు ఆ వస్తువు వల్ల నువ్వు ప్రయోజనం పొందగలవా? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి. ఈ రోజు ఐదువేల రూపాయలతో వస్తువు కొనుగోలు చేశారు బాగానే ఉంది. ఇదే ఐదువేల రూపాయలను భవిష్యత్తు కోసం ఇనె్వస్ట్ చేస్తే 10-20 ఏళ్లలో ఆ మొత్తం ఎంత అవుతుంది అని కూడా అంచనా వేయాలి. ఇదేం లెక్క అనిపించవచ్చు. వృధా ఖర్చులను ఇలాంటి ఆలోచనే అదుపు చేస్తుంది. ఓ 10-15 ఏళ్ల క్రితం యాదగిరిగుట్టలో పదివేలకు ఎకరం లభించేది. ఇప్పుడు ఐదారు కోట్ల రూపాయలు పెడితే కానీ ఎకరం లభించదు. కనీసం తొమ్మిది శాతం వడ్డీ లెక్కలతో చూసుకున్నా ఈ రోజు వృధాగా చేసిన ఐదువేల రూపాయలు ఇరవై ఏళ్ళలో భారీ మొత్తం అవుతుంది.
ఈ రోజు వృధా ఖర్చు ఐదువేలే లే పోతే పోయింది అనిపించవచ్చు. కానీ ఈ రోజు విలువతోనే చూడవద్దు అదే మొత్తాన్ని ఇనె్వస్ట్ చేస్తే పది ఇరవై సంవత్సరాల్లో దాని విలువ ఎంత ఉంటుంది అని కూడా ఆలోచించాలి. ఇదే మొత్తాన్ని మీ రిటైర్‌మెంట్ కోసం ఇనె్వస్ట్ చేస్తే పెద్ద వయసులో పిల్లల కన్నా పెద్ద అండగా నిలుస్తుంది. ఏ ఖర్చు చేయాలన్నా దాని వస్తవ విలువ ఎంత ఉంటుంది అని చూడాలి. నచ్చింది కదా ఎంతైనా ఓకే అనే తత్వం వద్దు .
అసలు ఖర్చే చేయకూడదు అని కాదు. దేనికి ఖర్చు చేయాలి ఎంత వరకు ఖర్చు చేయాలి. మనం కష్టపడి సంపాదించిన దానికి తగిన విలువ పొందుతున్నామా? అనే ఆలోచనతో ఖర్చు చేయాలి. అనివార్యంగా చేయాల్సిన ఖర్చులు ఉంటాయి. దానిని ఆపలేం. అపాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏది అవసరం? ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి.
పెద్దగా అవసరం లేని దానికి ఇప్పుడో పది వేల రూపాయలు ఖర్చు చేద్దామా? అలా చేస్తే కలిగే ప్రయోజనం? లేకుండా ఆ పదివేలు రేపటి కోసం ఇనె్వస్ట్ చేస్తేకలిగే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి? అని మీకు మీరు ప్రశ్నించుకుని మీ మనసు చెప్పిన సమాధానాన్ని విని, ఆచరిస్తే మీ భవిష్యత్తుకు ఢోకా లేదు.

-బి.మురళి