ధనం మూలం
ఇష్టం లేని ఉద్యోగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మీ ఉద్యోగాన్ని మీరు ప్రేమిస్తున్నారా?
చెప్పడానికి మోహమాట పడుతున్నారా?
పోనీ మేం చేసే ఉద్యోగాన్ని మేం ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం అని మీ సహచరులు, మిత్రులు ఎవరైనా చెప్పారా?
ఆలోచిస్తున్నారా? బహుశా అలా చెప్పిన వారు ఒక్కరు కూడా గుర్తుకు రావడం లేదు కదూ?
ఇది మీ ఒక్కరి పరిస్థితే కాదు. దాదాపు అందరి పరిస్థితి ఇదే.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. గాల్ అప్ అనే ఒక సంస్థ ఒక పోల్ నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వారు తమ ఉద్యోగంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 85శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల అయిష్టత వ్యక్తం చేశారు. సర్వేలో ఎన్ని కోట్ల మంది ఉద్యోగులు పాల్గొన్నారు, ఎన్ని దేశాల ఉద్యోగులు పాల్గొన్నారు అనే సందేహాలు అవసరం లేదు కానీ మన చుట్టూ ఉన్న ఉద్యోగ ప్రపంచంలో దాదాపు ఇదే అభిప్రాయం కదా? అంటే పది మందిని ప్రశ్నిస్తే అందులో తొమ్మిది మంది తమ ఉద్యోగం పట్ల తమక సంతృప్తి లేదు అనే సమాధానం చెబుతున్నారు.
ఈ తరం యువత చిన్న వయసులోనే ఐటి కంపెనీల్లో మంచి జీతంతోనే చేరుతున్నారు. చివరకు వారిలో సైతం ఉద్యోగం పట్ల పెద్దగా సంతృప్తి కనిపించడం లేదు. మరో సంస్థలో బాగుండొచ్చు అని అలా పరుగులు తీస్తున్నా ఎక్కడ చూసినా ఇదే అసంతృప్తి.
మరి 85శాతం మంది తాము చేస్తున్న ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉండి, ఉద్యోగంలో కొనసాగడం ఎందుకు? అంటే?
*జీతం మొదటి కారణం జీతం. చేసే ఉద్యోగంలో సంతృప్తి ఉన్నా లేకున్నా జీతం కోసం పని చేస్తున్నారు. అంతే కాదు ఎక్కువ మంది తాము చేసే పనికి తక్కువ జీతం పొందుతున్నామని భావిస్తున్నారు. మరి కొంత మంది జీతం బాగానే వస్తోంది కానీ ఉద్యోగంలో సంతృప్తి లేదు. కానీ జీతం కోసం పని చేస్తున్నామని చెప్పారు.
ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేసే ఉద్యోగం వల్ల ఉత్సాహం లేకుండా పోతోందని, స్నేహితులు, భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశాం, ఇంకెన్ని గంటలు మిగిలి ఉందని రోజూ గడియారం చూడడం ఒక అలవాటుగా మారింది. చాలా మంది తమ సహచర ఉద్యోగులు సరైన వారు కాదు అని భావిస్తున్నారు. సహచరుల వల్లనే తాము ఉద్యోగాన్ని వదిలేశామని, వదిలేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఒక్క బాస్ మాత్రమే కాదు సహచర ఉద్యోగులు సైతం మీకు చికాకు కలిగించవచ్చు, మీ ఆరోగ్యంపై సైతం ప్రభావం చూపవచ్చు. కొందరు ఉద్యోగుల విషయంలో కంపెనీ కల్చర్ ఇబ్బంది కరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పొజీషన్ కొనసాగించడానికి, ప్రమోషన్ కోసం కొందరు ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు చెప్పారు. కంపెనీ వదిలి వెళితే మరింత ఇబ్బంది అని భావిస్తూ కొనసాగుతున్నారు. దీని వల్ల మీరు నష్టపోవడమే కాకుండా కంపెనీకి సైతం నష్టం. ఇలాంటి వారిలో సహజంగా ఉత్సాహం చచ్చిపోయి ఉంటుంది.
85శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నప్పుడు అలానే ఉత్సాహం లేకుండా కొనసాగాలా?
ఉన్నది ఒకటే జీవితం దీన్ని ఉత్సాహంగా జీవించ లేమా? దానికి మార్గం లేదా? కొంచం ఆలోచిస్తే మార్గం కనిపించ్చు. ఐతే దానికి మీకు కొంత ఓపిక ఉండాలి.
మీ బాస్‌ను మీరు మార్చలేరు, మార్చాలని ప్రయత్నం కూడా చేయవద్దు ఎందుకంటే ఎప్పుడూ బాస్ కరెక్ట్. మీ సహచర ఉద్యోగులను మార్చలేరు. వారు కూడా మీలాంటి ఉద్యోగులే. వారిమీద మీ పెత్తనం కుదరదు.
మీ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అది మీ చేతిలో పని కాబట్టి అసాధ్యమేమీ కాదు.
ఉద్యోగం చేస్తున్న జీవిత కాలం అంతా నిస్సారంగా బతికే బదులు. భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక తయారు చేసుకుని ఉద్యోగంలో కొనసాగడం మంచింది.
ఉద్యోగంలో ఆసక్తి లేదు అనేది మీకు తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు మీకు దేనిలో ఆసక్తి ఉందో ఆలోచించుకోవాలి.
ఉద్యోగం చేయకపోయినా జీవితం గడిచే మార్గాలు చూడాలి. జీతంలో పెద్ద మొత్తం భవిష్యత్తులో కోరిన విధంగా బతకడానికి అవసరం ఐన పెట్టుబడులు పెట్టాలి. పొదుపు చేయాలి, సరైన పెట్టుబడులు పెట్టాలి. దీని వల్ల మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్టు బతికే అవకాశం ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకున్నా మీరూ 85శాతంలోనే ఉన్నా ఉద్యోగాన్ని చేయాల్సిందే. జీవితం గడవాలి అంటే ఉద్యోగం చేయాల్సిందే ఐతే అది జీవితాంతం అలానే నిస్సారంగా కొనసాగించాలా? లేక ఆర్థిక స్వాతంత్య్రం సాధించిన తరువాత ఇష్టం వచ్చినట్టు బతకాలా? అనేది మీ చేతిలో ఉంది. మీ పొదుపు శాతంలో ఉంది. మీ ఇనె్వస్ట్‌మెంట్ వ్యూహాల్లో ఉంటుంది. ఒక్క ఉద్యోగం ద్వారానే కాదు అనేక పనుల్లో ఆదాయం ఉంది. అసలు పని చేయకపోయినా ఆదాయం వచ్చే మార్చాలు ఉన్నాయి. అంటే బల్లకింద చేతులు పెట్టి సంపాదించడం కాదు. మీరు సంపాదించింది సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే, ఆ ఇనె్వస్ట్ మెంట్ కొంత కాలానికి మీకు జీతం ఇచ్చే స్థాయికి చేరుకుంటుంది. దీనికి కొంత ఓపిక కావాలి. వ్యూహం కావాలి. ఆలోచన కావాలి. బాస్ ఇచ్చే జీతం కాదు. మీ పొదుపే మీ బాస్ అవుతుంది. ఒక్కసారి దృష్టి పెట్టండి. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో వెతకండి. ఈ లోపు పొదుపును ఒక ఉద్యమంగా చేపట్టండి. రేపటి స్వేచ్ఛ కోసం.