ధనం మూలం

ఉద్యోగంలో చేరినపుడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగంలో చేరిన రోజే రిటైర్‌మెంట్ తేదీ కూడా ఖరారై ఉంటుంది. ఐతే మన మనసు దాన్ని అంత ఈజీగా అంగీకరించదు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే భవిష్యత్తు జీవితంపై దృష్టి సారించి దానికి తగ్గట్టు పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనేది అనివార్యం. పిల్లల చదువులు, సొంత ఇళ్లు, రిటైర్‌మెంట్ తరువాత జీవితంపై ముందు నుంచే ఒక అవగాహనతో ఉంటారు. ఐతే ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలా మంది దీనిపై అంతగా దృష్టిసారించరు. క్రమంగా వయసు పెరుగుతున్నా కొద్ది దీనిపై దృష్టి పెంచుతారు.
ఉద్యోగంలో చేరినప్పుడే రిటైర్‌మెంట్ అనేది ఉంటుంది అని గ్రహించి మసలు కోవాలి. ఇక రిటైర్‌మెంట్‌కు ఇంకో రెండు మూడు ఏళ్ల సమయం ఉంది అనగానే ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక నిపుణులు ఒక పది అంశాల జాబితాను రూపొందించి. రిటైర్ కావడానికి రెండు మూడేళ్ల ముందే ఈ చెక్‌లిస్ట్‌ను చూసుకోవాలని సూచిస్తున్నారు.
రిటైర్‌మెంట్ అనేది రెండవ జీవితం. చదువులో పోటీ, ఉద్యోగం కోసం తంటాలు. జీవితంలో అనేక సమస్యలు అన్నీ దాటుకుని వచ్చిన తరువాత రిటైర్‌మెంట్ అనేది రెండవ జీవితం. ఈ రెండవ జీవితంలోకి ప్రవేశించే ముందు పది అంశాలపై దృష్టిసారిస్తే, రిటైర్‌మెంట్ జీవితం హాయిగా గడిచిపోతుంది. బతుకు భారంగా మారకుండా ఒక ఉత్సవంగా మారాలంటే ఈ పది అంశాలపై దృష్టిసారించాలి.
1:రుణ రహిత పదవీ విరమణ: ఎలాంటి అప్పులు లేకుండా పదవీ విరమణ చేయాలి. అప్పులు లేని జీవితానికి మించిన ఆనందం ఉండదు. అలానే అప్పులతో రిటైర్ అయితే అంతకు మించిన నరకం కనిపించదు. సత్యహరిశ్చంద్రుడు అంతటి వాడు అప్పు తీర్చడానికి నక్షత్రకుడితో పడిన తంటాలు మనకు తెలిసినవే. పదవీ విరమణకు కొంత ముందుగానే ఎలాంటి అప్పులు లేకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. గృహ రుణం ఇఎంఐ, పిల్లల విద్యారుణాలు, వ్యక్తిగత రుణాలు, తెలిసిన వారి వద్ద చేసే అప్పులు కావచ్చు. ఎలాంటి రుణాలైనా పదవీ విరమణ తరువాత తలనొప్పులు తెచ్చిపెడతాయి. పదవీ విరమణ తరువాత వచ్చే ఆదాయం సంగతి ఎలా ఉన్నా ముందుగా అప్పులు లేకుండా చూసుకోవాలి. రుణవిముక్తికి మించిన ఆనందకరమైన జీవితం ఉండదని గ్రహించాలి.
2.అత్యవసర నిధి:ఉద్యోగం చేస్తున్న వారైనా, పదవీ విరమణ చేసిన వారైనా ఎవరైనా కావచ్చు అత్యవసర నిధి తప్పని సరి. పదవీ విరమణ చేసిన వారికి మరింత ఎక్కువ అవసరం ఉంది. మీరు రిటైర్ కాగానే అదే నెల నుంచి పెన్షన్ రాకపోవచ్చు. దానికి కొంత సమయం పట్టవచ్చు. ఇంటి అవసరాలు తీరేందుకు, ఏదేమైనా కనీసం ఆరునెలల జీతం మీ చేతిలో అత్యవసర నిధి ఉండాలి. ఒకవేళ పెన్షన్ వెంటనే వచ్చినా ఆ ఆరునెలల అత్యవసర నిధి మెడికల్ అవసరాలకు ఉపయోగపడుతుంది. లేదా అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చే అవసరం కోసం కావచ్చు. ఏదీ మనం అనుకున్నట్టు జరగదు. ఎప్పుడేం అవసరం ఏర్పడుతుందో తెలియదు కాబట్టి ఉద్యోగంలో ఉన్నప్పటి మాదిరిగానే రిటైర్‌మెంట్ తరువాత కూడా ఆరునెలల జీతం అత్యవసర నిధిగా ఉండాలి.
3.పెట్టుబడిపై స్పష్టత: చాలా మంది భవిష్యత్తు కోసం ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఇనె్వస్ట్‌మెంట్ చేస్తుంటారు. రిటైర్‌మెంట్‌కు కొద్దిగా ముందుగానే ఇనె్వస్ట్‌మెంట్స్‌ను సమీక్షించుకోవాలి. ఎక్కడెక్కడ ఇనె్వస్ట్ చేశారు. సరైన ఆదాయం వస్తుందా? ఇనె్వస్ట్‌మెంట్ వ్యూహంలో మార్పు అవసరమా? అనే సమీక్ష రిటైర్‌మెంట్‌కు ముందే చేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇనె్వస్ట్‌మెంట్‌లో రిస్క్‌ను భరించేందుకు సిద్ధంగా ఉంటాం. కానీ రిటైర్ తరువాత రిస్క్ తీసుకునే అవకాశాలు తగ్గుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇనె్వస్ట్‌మెంట్‌పై రిటైర్‌మెంట్‌కు కొద్దిగా ముందుగానే సమీక్ష అవసరం.
4.కొత్త బాధ్యతలు! రిటైన్‌మెంట్ తరువాత కూడా మీరు తీర్చాల్సిన బాధ్యతలు ఏమైనా ఉంటాయా? అనే అంచనా మీకు ముందే ఉండాలి. అంటే పిల్లల చదువు వ్యయం కావచ్చు, వారి పెళ్లి కావచ్చు, వైద్య చికిత్స, ఇతర ఖర్చులు కావచ్చు. మీరు రిటైర్ అయిన తరువాత కూడా ఇలాంటి బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంటే దానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.

-బి.మురళి