డైలీ సీరియల్

యాజ్ఞసేని-121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా! యుధిష్ఠిరుడు సంధిని కోరుచుండగా అతని మాట విని దుర్యోధనుడు సంధికి అంగీకరించునా? అందువల్ల నీవే, పాండవులు, సృంజయులు కలిసి వెనువెంటనే వారియందు దండమును ప్రయోగింపవలయును. ఇట్లు చేయడమే పాండవులకు తగిన పని. దీనివలన నీకు కీర్తి కలుగును. క్షత్రియ జాతికి శాంతి లభిస్తుంది.
జనార్థనా! చంపరాని వానిని చంపినపుడు యే పాపము వాటిల్లునో, చంపదగిన వానిని చంపకున్నను ఆ పాపపే కలుగునని ధర్మవేత్తలు చెప్పుదురు.
(000) కృష్ణా! నేను దేవతా వరప్రసాదం వలన జన్మించిన దానను. ద్రుపదరాజు దుహితను. ధృష్టద్యుమ్నునికి సోదరిని. అన్నిటికన్నా మిన్న ‘‘నీకు ప్రియసోదరిని’’. అజమీఢ వంశములో అడుగుపెట్టిన దానను. (్భరతవంశములో) పాండు మహీపతికి కోడలినైనాను. ఇంద్ర సమానులైన అయిదుగురు పాండవులకు పట్ట మహిషినయ్యాను. అయిదుగురు భర్తల యందు రాజనీతిలోనూ, శౌర్యంలోనూ, చలించని పుత్రులను కన్నాను. అభిమన్యుడు నీకు మేనల్లుడైనట్లు నా అయిదుగురు కొడుకులు గూడా నీకు మేనల్లుళ్ళేగదా? అటువంటి నన్ను పాండవులు చూస్తుండగా, నీవు బ్రతికుండగా, జుట్టు పట్టుకొని కొలువులోనికి రుూడ్చి పరాభవించారు. పాండురాజకుమారులు, పాంచాలురూ, యాదవులూ జీవించి యుండగానే పాపాత్ములైన కౌరవులకు దాసినై కొలువుకూటములో ఆ రీతిగా నిలవవలసి వచ్చింది.
.. సుతా ద్రుపద రాజస్య వేదిమధ్యాత్ సముత్థితా! ధృష్టద్యుమ్నస్య భగినీ తపకృష్ణప్రియా సఖీ!
అజామీఢకులం ప్రాప్తా స్నుషా పాణ్డోర్మహాత్మనః; మషిహీ పాణ్డు పుత్రాణాం పజ్ఞేన్ద్ర సమవర్చసామ్!
సుతా మే పఞ్చ్భిర్వీరైః పఞ్చజాతా మహారథాః! అభిమన్యుర్యథా కృష్ణతథా తపధర్మితః!!
చ॥ వరమునఁబుట్టితిన్, భరత వంశముఁ జొచ్చితి, నందుఁబాండు భూ
వరునకుఁ గోడలైతి, జనవంద్యులఁబొందితి, నీతివిక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్, సహజన్ముల ప్రాపుగాంచితిన్
సరసిజనాభ! యిన్నిటఁ బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్!!
(ఆం.మ.్భ. తిక్కన/ ఉద్యోగపర్వము తృ.ఆశ్వా.పద్యం 108)
అని పలికి ద్రౌపది తటాలున పీఠంనుండి లేచి రాజసూయ యజ్ఞ దీక్షానంతరం కావించిన మంగళ స్నానంతో పావనమైన, చూడ ముచ్చటైన, ఉంగారాలు తిరిగిన కురులను ఎడమ చేతితో పట్టుకొని పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుని సమీపించి కళ్ళనీరు గ్రుక్కుకొని
‘‘కేశవా! శత్రువులతో సంధి కోరుతున్న నీవు నీ ప్రయత్నం చేస్తున్నా, దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చేవేళ అతడి పచేతివ్రేళ్ళలో చిక్కుకొని సగం తెగగా మిగిలిన ఈ కురులను కౌరవుల వద్ద సంధి వచనములాడు సందర్భములో వీటిని గుర్తుంచుకోవాలి సుమా
ఒకవేళ భీమార్జునులు సంధినే కోరుతున్నా నా తండ్రి వృద్ధుడైనా మహారథులైన తన కొడుకులతో కలిసి యుద్ధం చేస్తాడు. నా అయిదుగురు కొడుకులూ అభిమన్యున్యున్ని ముందుంచుకొని కౌరవులతో యుద్ధం చేస్తారు.
నా తల వెంట్రుకలను పట్టి లాగిన సభలోనికీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుని ఆ హస్తం, ఆ దేహం ప్రప్రథమంగా యింతింతముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాపి వుండగా చూచినప్పుడే నా మనస్తాపము చల్లారగలదు. ఆ విధంగా పరిభవింపబడిన ధర్మనందనుడూ, నేనూ దుర్యోధనుడి శవాన్ని కనులారా చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డవింటిని ధరించే పాండవ మధ్యముడి శౌర్యమూ దేనికి? పనికిరాని శౌర్యసంపద వుపయోగమేమి?’’
అని ద్రౌపది కన్నీరు కంఠస్వరాన్ని అడ్డగింపగా కంపిస్తున్న స్వరంతో యేడవసాగింది. ఆమె కన్నీరు రొమ్ములను తడిపి వేసింది. అలా దుఃఖిస్తున్న ద్రుపదరాజపుత్రి యాజ్ఞసేనిని చూచిన శ్రీకృష్ణుడు ఆమె ననునయిస్తూ.
‘‘కృష్ణా! భరత వంశపు స్ర్తిలు యేడ్చుచుండగా త్వరలోనే చూచెదవు. నీ వెవరిపై కోపించితివో ఆ కౌరవ కాంతలు తమ బంధువులు, అన్నదమ్ములు, మంత్రులు, సైనికులు అందరూ దారుణంగా మరణించగా నీవలెనే దుఃఖింతురు. ధర్మరాజు ఆజ్ఞమేరకూ, బ్రహ్మవ్రాతమేరకూ భీమార్జున నకుల సహదేవులాపనికావింతురు. కాలము మూడినవారై ఆ ధృతరాష్ట్ర సూనులు నా మాట వినకుందురేని కుక్కలకు, నక్కలకు ఆహారంగా రణభూమిపై పడిపోతారు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము