డైలీ సీరియల్

యాజ్ఞసేని--117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృతరాష్ట్ర కుమారుడైన ‘సుయోధనుని’కి ఈ మాటను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుము... కురుదేశాలకు (కౌరవులకు) శత్రువులు లేకుండా చేయాలని నీ మనస్సులో కోరిక నీ శరీరాన్ని బాధిస్తున్నది. అది సిద్ధించటానికి తగిన ఉపాయం యేమీ లేదు. నీకిష్టమైనట్లుగా మేము వుండలేము. ఇంద్రప్రస్థాన్ని నాకు తిరిగి యిమ్ము. లేదా యుద్ధానికి సిద్ధంగా వుండుము’’ అని చెప్పి ధర్మరాజు సంజయునికి వీడ్కోలు పలికాడు.

52
ఉపప్లావ్యం నుండి
సంజయుడు పాండవులను వీడది వాయువేగంతో పరుగెత్తే రథాశ్వాలుగల తేరుపైన సూర్యాస్తమయ సమయానికి హస్తినాపురానికి చేరాడు.
ధృతరాష్ట్రుని అంతఃపురం వద్దకుచేరి ప్రతీహారులవలన తన రాకనెరింగించాడు. ధృతరాష్ట్రుడు వెంటనే సంజయుని తన వద్దకు పిలిపించుకొన్నాడు.
సంజయుడు తాను ఉపప్లావ్యం నుండి తిరిగి వచ్చిన విషయాన్ని తెలపి, ధర్మరాజుయొక్క, అతడి తమ్ముల యొక్క, చుట్టాల, మంత్రివర్యుల, సేవకుల యొక్క క్షేమసమాచారాన్ని విన్నవించాడు. తదుపరి ధృతరాష్ట్రుడు చేయదగిన ధర్మం యేదో దాన్ని బోధించాడు. దుర్మార్గులైన దుర్యోధన దుశ్శాసన కర్ణశకుని మాటల లెక్కబెట్టక పాండవులకు రాజ్యభాగాన్ని పంచి యివ్వమని బోధించాడు.
‘‘రాజా! ఉపప్లాప్యంలో ధర్మరాజాదులంతా క్షేమం. మీ క్షేమాన్ని అడిగాడు. రాజా! జూదం ఆడినప్పుడే అవినీతి యేర్పడింది. అప్పుడు నీవు వుపేక్షించి వూరకున్నావు. అది పాండవులకు నిప్పు దహించివేశింది. ప్రభూ! ధర్మరాజు స్వాధీన మనస్కుడు. పైకి యెంతో మృదువుగా కనిపించే పులి. అతడు ‘‘మెత్తని పులి’’ అని తెలిసికో. లోకులంతా అన్యాయం నీమీద పెట్టేదాకా వినడు. కనడు. ఏమీ ఎరగనట్లు వుంటాడు. అటువంటి నింద పడ్డ తరువాత అతడిని ఆపటం నీకూ, నాకు తరంగాదు’’ అని చెప్పి ‘‘మరునాడు నిండు సభలో ధర్మరాజాదులు చెప్పిన మాటలను అందరూ వినేటట్లుగా వివరిస్తాను’’ అని వెళ్ళిపోయాడు.
మరునాడు ధృతరాష్ట్రుడు సభతీర్చగా, ద్రోణుడూ, కృపుడూ, కృతవర్మ, ఆశ్వత్థామ మొదలగువారూ, భీష్ముడూ, విదురుడూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ మొదలైన బంధువులూ, దుర్యోధన దుశ్శాసన మొదలగు కుమారులూ, వచ్చి వారివారి స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు సంజయుడు తాను హస్తినాపురం నుండి బయలుదేరి ఉపప్లావ్యపురానికి వెళ్ళినప్పటినుండి జరిగిన విషయాలను పూర్తిగా వివరించాడు. మొదట తాను శ్రీకృష్ణార్జులను దర్శించుకొన్నాననీ, అప్పుడు శ్రీకృష్ణుడు తనను ఆదరించి తనతో
‘‘సంజయా! వినుము. అజాతశత్రుడికి కోపం రావడం అంటే నీళ్ళలో నిప్పు పుట్టడం వంటిదే. దానిని ఆర్పటానికి మీకు ఉపాయం లేదు. ద్రౌపదికి ఋణగ్రస్తుడనైయున్న నేను రథాన్ని నడవగా గాండీవాన్ని ధరించి పార్థుడు (అర్జునుడు) నేడోరేపో యుద్ధానికి వస్తాడు. ఇక దుర్యోధనాథులు ఎక్కడికి పోతారు’’అని నుడివాడని విన్నవించాడు.
తదుపరి అర్జునుడు అన్న మాటలను విపులంగా చెప్పాడు. చివరిగా ధర్మరాజుయొక్క నిశ్చయాన్ని కుండబ్రద్దలుకొట్టినట్లుగా తెలియపరచాడు. బంధువులతో, మిత్రులతో, నానాదేశ రాజుల సహాయంతో ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు.
సంజయుని మాటలను విన్న భీష్మపితామహుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, అందరూ కలిసి దుర్యోధనుని పాండవులతో సంధి చేసికొని రాజ్యభాగాన్ని యిచ్చి కురువంశ వినాశనాన్ని కాపాడవలసినదని నొక్కి చెప్పారు. కానీ దుర్యోధనుడు మాత్రం కర్ణుని అండతో, అతడి మీదనున్న ఆశతో పాండవులతో యుద్ధానికే మొగ్గుచూపాడు. ధృతరాష్ట్రునికి తన బలాన్ని గురించి వివరించుకొన్నాడు.
‘‘తండ్రీ! నేనూ, కర్ణుడూ, దుశ్శాసనుడూ ముగ్గురమూ యుద్ధంలో పాండవులను చంపగలము. పాండవులను చంపి నేనే ఈ భూమిని పాలిస్తాను. లేదా పాండవులను నన్ను చంపి ఈ భూమిని అనుభవిస్తారు. మహారాజా! నా జీవితాన్నీ, రాజ్యాన్నీ, ధనాన్నీ, సర్వమూ విడుస్తానుగానీ, పాండవులతో కలిసి మాత్రం ఎన్నడూ జీవించను... ఆర్యా! ‘‘వాడి సూదిమొన మోపినంత భూమికూడా పాండవులకు విడిచిపెట్టను’’- అని తెగేసి చెప్పాడు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము