డైలీ సీరియల్

యాజ్ఞసేని-115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బృహంతుని, సేనాబిందువు, సేఅజిత్తు, ప్రతివింధ్యుడు, చిత్రవర్మ, సువాస్తుకుడు, బాహ్లికుడు, ముంజకేతుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేష్టుడు, నీలుడు, వీరధర్ముడు, బలశాలి, భూమిపాలుడు, భూమి పాలుడు, దుర్జయుడు, దంతవ్రక్తుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాడుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, కారూషకరాజు, క్షేమధూర్తి, కాంభోజ, ఋషిక, పశ్చిమ ద్వీపరాజులు, జయత్సేనుడు, కాశ్యుడు, పంచనదరాజులు, క్రోధపుత్రుడు, దుర్దర్షుడు, పార్వతీయరా జలు, జానకి, సుశర్మ, మణిమంతుడు, క్ష్మీఓతిమత్సకుడు, పాంశురాజ్యాధిపతి, ధృష్టకేతువు, తుండుడు, దండధారుడు, బృహత్సేనుడు, అపరాజితుడు, నిపాదుడు, శ్రేణిమంతుడు, వసుమంతుడు, బృహద్బలుడు, మహోజుడు, బాహుడు, సముద్రసేనుడు, ఉద్భవుడు, క్షేమకుడు, వాటధానుడు, శ్రుతాయువు, దృఢాయువు, శాల్యపుత్రుడు, యుద్దతీప్రుడు, కళింగరాజు మొదలైన ముఖ్యులందరి వద్దకు త్వరగా దూతలను పంపి యుద్ధములో సహాయానికి ఆహ్వానించండి.
మత్సరాజా! విద్వాంసుడైన ఈ బ్రాహ్మణుడు నా పురోహితుడు. మన మాటలు యితనికి చెప్పి ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పంపండి. భీష్మద్రోణులకు, ధృతరాష్ట్రునికి, దుద్యోధనునికి, యెలా చెప్పాలో వివరంగా చెప్పండి.’’ అని పలికాడు.
విరాటరాజు ద్రుపదుని సహాయంతో పాండవులు మిత్రులైన రాజులను కూడగట్టుకొన్నారు. పాండవ వర్గం రాజులందరూ వచ్చేశారని విన్న దుర్యోధనుడు తాను కూడా రాజులను రప్పించాడు. కురుపాండవుల కారణంగా భూమి కలత పడింది. చతురంగ బలాలతో కూడిన రాజుల ప్రయాణాలతో బాటలన్నియూ నిండి సముద్రాన్ని తలపించింది.
ధర్మరాజు అభిప్రాయాన్ని తెలిసిన ద్రుపద మహారాజు తన పురోహితుణ్ణి కౌరవుల వద్దకు పంపాడు.ఆ పురోహితుడు ధృతరాష్ట్ర భీష్మద్రోణాదుల, సేనా నాయకుల అందరి సమక్షంలో తన రాకను గురించి చెప్పి, భీమార్జున నకుల సహదేవుల బలాలను, శ్రీకృష్ణుడు పాండవపక్షం వహించిన విషయాన్ని, కృష్ణార్జునుల తెలివి తేటలను, వారందరితో యుద్ధం చేస్తే కలిగే పరిణామాలను తెలియపరచాడు. అందువలన పాండవులకు యివ్వదగిన రాజ్య భాగాన్ని యిచ్చి శాంతిని పొందండని అన్నాడు. పురోహితుని మాటలను భీష్ముడు సమర్ధించాడు.
పురోహితుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు అతడితో ‘‘్భష్ముడు మాకు హితమైన కార్యాన్ని చెప్పాడు. అది పాండవులకూ, సకల జగత్తుకూ కూడా హితమైనదే. నేను ఆలోచించి పాండవుల వద్దకు దూతను పంపిస్తాను. నీవు ఆలస్యం చేయక పాండవుల వద్దకు తిరిగి వెళ్ళుము’’ అని అన్నాడు. తదుపరి ధ్రుపదుని పురోహితుని సత్కరించి పాండవుల వద్దకు పంపాడు.
ద్రుపదుని దూత వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడు తనకు హితుడు అయిన ‘సంజయుని’ పిలిపించాడు. ఉపప్లావ్యనగరంలో యున్న పాండవుల వద్దకు తాను చెప్పదలుచుకొన్న విషయాలను చెప్పి తన దూతగా సంజయుడిని పంపాడు.
సంజయుడు వెళ్ళి ఉపప్లావ్యపురం ప్రవేశించి శ్రీకృష్ణుడు వున్న శననానికి పోయి, అంతఃపురం ప్రవేశించి అర్జునుడితో కూడుకొనియున్న శ్రీకృష్ణుని చూచి, భయము, భక్తి, వినయము ప్రకాశించగా వారిద్దరి మన్ననలను పొంది సంతోషించిన మనస్సుగలవాడైనాడు. మరునాడు ధర్మరాజు పెద్ద కొలువు తీర్చే సమయం కోసం కాచుకొనియుండి తగిన రీతిన అతడిని దర్శిణచాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మరాజు ప్రీతిపురస్సరంగా ఆదరించి తనకు దగ్గరగా కూర్చుండబెట్టుకొన్నాడు. అప్పుడు సంజయుడు ధర్మరాజుతో.
‘‘రాజా! మీ తండ్రి ధృతరాష్ట్రుడు తమ్ములు, నీవూ, ద్రౌపదీ, నీ కొడుకులూ కులాసాగాయున్న విధం తెలిసికొనటానికి అధిక మైత్రితో నిండిన మనస్సుతో నన్ను పంపాడు. మీ క్షేమ సమాచారాలనడిగి తెలిసికొమ్మన్నాడు. నన్ను రాయబారిగా కూడా పంపాడు. అదేమిటంటే నిండు కొలువులో నీ తమ్ములూ ఆత్మీయులూ, శ్రీకృష్ణుడూ వింటుండగా ధృతరాష్టమ్రహారాజు చెప్పమన్న మాటలను విన్నవించుకొంటాను.
‘దర్మరాజా! నీవు అజాతశత్రువుడవు. నీ అజాతవత్రుత్వం అన్ని లోకాలకూ తెలిసిందే. అలాగే పాండవులందరూ శాంతస్వభావులే. కాబట్టి యుద్ధం చేయ తలపెట్టటం ధర్మంగాదు. యుద్ధంలో వృద్ధులనూ, పిల్లలనూ, మిత్రులనూ, గురువులనూ, చంపినట్లయితే ప్రయోజనమేముంటుంది?

.. ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము