డైలీ సీరియల్

యాజ్ఞసేని-114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్యోధనుడు వారు అడుగుతున్నట్లుగా అర్థరాజ్యాన్నిచ్చి మనతోపాటు తానూ సంతోషంగా యుండాలి. పాండవుల ప్రశాంతత ప్రజలకు మేలుచేస్తుంది. కాబట్టి దుర్యోధనుని అభిప్రాయాన్ని తెలుసుకొనటానికీ, ధర్మరాజు పలుకులను అతనికి తెలియజెప్పటానికీ, కౌరవ పాండవులకు క్షేమాన్నీ, శాంతాన్నీ కలిగించటానికి ఒక రాయబారి వెళ్ళాలి. ఈ ప్రయత్నం నాకు ప్రియమైనది. ఆ దూత భీష్మద్రోణకృపాచార్యాశ్వత్థామవిదుర ధృతరాష్ట్రులు, కౌరవులు, పౌరులు ఉన్న ఆ సభలో వినయ పూర్వకంగా పాండవులకు ప్రయోజనకరమైన విధంగా మాట్లాడాలి. వారికే దశలోనూ కోపం తెప్పించ కూడదు. వారు బలవంతులై రాజ్యంపై అధికారాన్ని పొందియున్నారు.
జూదం సరిగా యెరుగని యుధిష్ఠిరుని హితులు అందరూ నివారించారు. కానీ అతడు జూదానికి సిద్ధమై కర్ణదుర్యోధనాదులను గెలువగలిగి యెంతోమంది జూదరులను వదలి, గాంధార రాజ కుమారుడు, జూదంలో నిపుణుడూ అయిన శకునిచే ఆటకు పిలిపించి అతని చేతిలోఓటమిని పొందాడు. ఓడిపోతున్నా ఆగక జూదాన్ని కొనసాగించి మరీ ఓడిపోయాడు. అందులో శకుని తప్పేముంది?
యుద్ధంవలన ఉభయ పక్షాలకు నష్టమేగాక అన్యాయం జరుగుతుంది. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగకుండా వుండేటట్లు, సంధి పొసగేటట్లు ప్రయత్నించాలి’’ అని బలరాముడు పలుకుతుండ సాత్యకి లేచి
‘‘బలరామా! పురుషులలో శూరులూ, క్రూరులూ, కుత్సితులూ, సోమరులూ వున్నారు. ధర్మరాజుపై సభలో చిన్న దోషమైనా ఆరోపించటానికి ఎలా సాధ్యవౌతుంది? నీవు మాట్లాడిన మాట నేను తప్పుపట్టడం లేదుగానీ, ఆ మాటలను వౌనంగా వింటూన్న వారిని తప్పుపట్టుతున్నాను. ఆసక్తిలేనివాడు, జూదం ఆడటం సరిగా రానివాడు, మహాత్ముడు అయిన ధర్మరాజును మోసంతో జూదంలో నిపుణులైన వారు తమ యింటికి పిలిచి, ఆడించి గెలిస్తే అదెలా ధర్మబద్ధమైన జయం అవుతుంది. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్న యుధిష్ఠిరుని జూదానికి పిలిచి,మోసం చేసింది మంచిపని యెలా అవుతుంది? అంతేగాక ధర్మరాజు ప్రతిజ్ఞ పూర్తిచేసిన తరువాత వచ్చి వారికెలా తలవంచుతాడు?
నియమం ప్రకారం వనవాసాన్ని పూర్తిచేసుకొని వచ్చిన పాండవులకు రాజ్యాన్ని తిరిగి యివ్వకుండా అపహరించిన కౌరవులు ధర్మయుక్తులెలా అవుతారు? భీష్మద్రోణాదులు చెప్పినా కౌరవులు పాండవులకు రాజ్యాన్ని యివ్వటానికి సిద్ధపడటం లేదు.
కాబట్టి దుర్మార్గుడైన దుర్యోధన కర్ణశకునిని మేము శ్రీకృష్ణ్భీమార్జున సహదేవులతో, సబాంధవులతో కలిసి యుద్ధంలో చంపి ధర్మరాజుకు పట్ట్భాషేకం చేస్తాము. శత్రువులను చంపటంలో అధర్మం లేదు. కానీ వారిని యాచించిటం అధర్మమూ, అపకీర్తి అవుతుంది.’’ అని సాత్యకి వీరావేశంతో పలుకగా విన్న ద్రుపద మహారాజు
‘‘సాత్యకీ! నీవు అన్నట్లుగానే జరుగుతుంది. సందేహం లేదు. దుర్యోధనుడు రాజ్యాన్ని ధర్మపద్ధతిలో పంచి యివ్వడు. కొడుకును ప్రేమించే ధృతరాష్ట్రుడు అతనినే అనుసరిస్తాడు. భీష్మద్రోణాదులు నిస్ససాయతతోనూ, కర్ణశకునులు మూర్ఖత్వంతోనూ అతనితోనే వుంటారు. బలరాముని సూచన నాకు కూడా సరికాదని అనిపిస్తున్నది. దుర్యోధనుడు యెప్పటికనీ మెత్తని మాటలతో చెప్పదగినవాడు కాదు. పాపాత్ముడు మెత్తగా మాట్లాడే వాడిని అశక్తునిగా భావిస్తాడు.
కావున మనం దానికి తగిన ప్రయత్నం చేద్దాం. మన మిత్రులవద్దకు వెళదాం.
మహారాజా! శల్యుడు, ధృష్టకేతువు, జయత్సేనుడు, కేకయులు, మొదలైనవారందరి వద్దకు త్వరగా వెళ్లగలిగిన దూతలను పంపండి. దుర్యోధనుడు కూడా అన్ని వైపులకు దూతలను తప్పక పంపుతాడు. సజ్జనులు ముందుగా వచ్చినవారికే సహాయం చేస్తారు. మనం త్వరపడాలి.
శల్యుని వద్దకు, అతడిని అనుసరించే రాజుల వద్దకు, పూర్వ సముద్రవాసి అయిన రాజు భగదత్తుని వద్దకు వెంటనే దూతలను పంపండి.
అలాగే అమితౌజుడు, ఉగ్రుడు, కృతవర్మ, అంధకుడు, శూరుడు, రోచమానుడు, వీరందరి వద్దకు కూడా త్వరగా దూతలను పంపండి.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము