డైలీ సీరియల్

యాజ్ఞసేని-113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహానంతరం పాండవులు ఏ విరాట నగరానికి ‘దగ్గరలోనున్న’ ఉపప్లావ్యము అనేచోట ఉన్నారు.
ఇక్కడినుండి పాండవులు తమ ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభిస్తారు.
***
శ్రీకృష్ణరాయబారము
విరాట నగరము
‘‘హరి మేనల్లుడైన’’ అభిమన్యుని వివాహం చేసి పాండవులు, వారి స్వపక్షంవారైన యాదవ పాంచాలాదులు ఆనందించారు.
తదుపరి విరాట నగరానికి దగ్గరలోనున్న ‘ఉపప్లావ్యానికి’ చేరారు పాండవులు.
వివాహశుభకార్యం ముగిసిన తరువాత వచ్చిన రాజులందరూ భవిష్యత్కార్యక్రమాన్ని నిర్ణయించటానికి ఉపప్లావ్యంలో ‘్ధర్మరాజు’వద్ద పెద్ద సభ తీర్చారు. పాండవులు రెండవసారి జూదం ఆడినప్పుడు రాజ్యాధికారులే. వారి సంపదలూ, రాజ్యం వారి వద్దనే వున్నాయి. అయితే జూదంలో పెట్టిన నియమాలలో రాజ్యప్రసక్తి లేదు. ఓడిన వారు పండ్రెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అనేది నియమం. కాబట్టి అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత పాండవులకు వారి రాజ్యభాగం తిరిగి వారికి చేరాలి. అదే న్యాయమైన పద్ధతి. దానికోసమే ప్రయత్నం చేయాలి.
మత్స్యదేశాధిపతి అయిన విరాటుని సభ సంవృద్ధిగా వుంది. వివిధాలంకారాలతో సభ శోభాయమానంగా ప్రకాశిస్తున్నది. తగిన ఆసనాలను ఆయా స్థానాలలో సిద్ధం చేసి వుంచారు. రాజులందరూ అక్కడికి చేరుకొన్నారు.
సభలో అందరికి ముందుభాగంలో విరాట రాజు, పాంచాల దేశాధీశుడైన ‘ద్రుపద మహారాజు కూర్చున్నారు. వారు రాజులందరిలోనూ వృద్ధులు, పూజ్యులు.
శ్రీకృష్ణ బలరాముల తండ్రి అయిన వసుదేవుడు తన ఆసనాన్ని అలంకరించాడు.
సాత్యికి, బలరాములు ద్రుపద మహారాజు ప్రక్కన ఆశీనులయ్యారు.
విరాటరాజుకు దగ్గరగా శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఆశీనులయ్యారు.
భీమార్జున నకుల సహదేవులు ద్రుపదరాజ పుత్రులు వారివెనుక వారి స్థానాలలోకూర్చున్నారు.
ప్రద్యుమ్నుడు, సాంబుడు విరాటుని పుత్రులతో కలిసి, అభిమన్యుడు, ద్రౌపరి తయులందరితో కలసి అందమైన బంగారు ఆసనాలపై కూర్చున్నారు.
అలా అనేక రాజులతో నిండుగాయున్న సభ కాంతివంతమై, గ్రహనక్షత్రాలతో నిండిన ఆకాశం వలే ప్రకాశించింది.
అంత శ్రీకృష్ణుడు పాండవుల హితాన్ని కోరినవాడై, తదుపరి చేయవలసిన కార్యాన్ని గురించి సభలోనున్న రాజులను చూచి
‘‘పాండవులు జూదంలో శకుని కుటిలత్వం చేత రాజ్యాన్ని వదలి, సమర్ధులైయుండి కూడా ధర్మబద్ధులై,రి కుపిత స్వాంతులుగాక అరణ్యాజ్ఞాతావాసాలు చేశారు. మీరందరూ ధర్మరాజు యొక్క సత్ప్రవర్తన తెలిసినవారే కాబట్టి కౌరవులకూ, పాండవులకు మేలుగలిగే విధంగా ధర్మమార్గము విడిచిపెట్టకుండా యేదేని ఒక విధం ఆలోచించండి. రాజ్యాన్ని రెండు పక్షాలవారూ పంచుకొని అనుభవింప దగినది కావున కర్తవ్యం ఉపదేశించటానికి మీరు తగిన వారు.
పాండవులు తమ పరాక్రమాన్ని కౌరవులకు చూపాలనుకొంటున్నారు. దుర్యోధనుడు శత్రువులను జయించటానికి మిత్ర బృందాన్ని సమాయత్తం చేస్తున్నాడు.
ఎదుటవారి అభిప్రాయం తెలిసికొనకుండా యే కార్యాన్నీ నిశ్చయించటం మంచిది కాదు. కాబట్టి రుూ సమయంలో తగినవాడిని కౌరవు సభకుపంపవలసిన ఆవశ్యకత యెంతేని యున్నది. దుర్యోధనుడు పాండవులకు రాజ్యభాగం యిస్తాడా మంచిది. ఇవ్వని పక్షంలో ఆ సమయానికి యేమి చేయాలో చూచుకుందాం’’ అని అన్నాడు.
శ్రీకృష్ణుడు అలా మాట్లాడగా బలరాముడు విని బాగా ప్రశంసించి తాను మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘‘సభికులారా! ధర్మానుకూలమూ, అర్ధశాస్త్ర సమ్మతమూ, దుర్యోధనునికి హితమైనదీ అయిన శ్రీకృష్ణుని సంభాషణననుమీరు అందరూ విన్నారు. పాండవులు మహావీరులు. అయినా సగం వదలుకొని అర్ధరాజ్యానికి ప్రయత్నిస్తున్నారు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము