డైలీ సీరియల్

యాజ్ఞసేని-110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కీచకుల సమూహంవలన యే కీడూ పొందకుండా తిరగి వచ్చావా తల్లీ? నిన్నావిధంగా బాధించిన ఆ దురహంకారి కీచకుడు యమలోకానికి చేరాడు! అంతటితో ఆగక ఆ ఉపకీచకులందరూ కలిసి నీ శరీరానికి దారుణమైన అపాయాన్ని కలిగించటానికి చూచారా? నీ నర్తలు వెంటనే శత్రువులను చంపి ఇంత త్వరగా రక్షించుకొంటారా? అని ఓదార్ప మాటలు మాట్లాడుతుండగా బృహన్నల సైరంధ్రితో-
‘‘ఆ దుర్మార్గుల చేష్టలను, వరుసగా వారందరూ చంపబడిన తీరునూ నీ నోట విని తెలిసికొనగోరుతున్నాను’’ అని అన్నాడు.
‘‘కన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడిపే నీకు సైరంధ్రి ఏమైపోయినా ఒక్కింత బాధ కూడా లేకపోబట్టి గదా యిట్లు నగుమొహంతో విషయాలన్నీ నా నోట వినాలనుకొంటున్నావు? నిన్ను ఏమనాలి?’’ అని ద్రౌపది అనగా అర్జునుడు-
‘‘నీవు కష్టాలలో చిక్కుకొన్నావని తెలిసి దుఃఖాన్ని పొందినా ప్రయోజనం లేని ఈ పనికిమాలిన రూపాన్ని పొంది నేను మనసులో పడే బధ ఎవరికి పడుతుంది. నీవెట్టి దోషం లేనిదానవు. నీవు బాధపడుతున్నందులకు నా మనసులో బాధ లేదనుకొన్నావా? నిజాన్ని నీవు గుర్తించటం లేదు’’ అని అనగా అతడి మాటలకు లోలోన నవ్వుకొంటూ-
‘‘సరే! నీ గురించి ఇంతగా చెప్పటం ఎందుకు? నీ మనసు నాకు తెలియనిదానిననుకొంటున్నావా? రాచనగరిలో సముచితంగా నీవు నడచుకొనటమే నాకు చాలా ఇష్టం’’ అని అంటూ ద్రౌపది అంతఃపురంలోనికి ప్రేశించింది. తమ్ముల చావుకు దుఃఖిస్తున్న సుదేష్ణ వద్దకు లోలోన తన ఆనందాన్ని పైకి కనపడనీయకుండా, ఏమీ తెలియని అమాయకురాలిగా ఎప్పటిమాదిరిగానే లోనికి వెళ్లింది. సుదేష్ణ సైరంధ్రిని చూచింది. సైరంధ్రిని పిలిచి ప్రక్కనే కూర్చుండబెట్టుకొంది. కొంచెం తడవు ఆలోచిస్తూ దుఃఖాన్ని ఆపుకుంటూ సైరంధ్రిని చూచి-
‘‘సైరంధ్రీ! నీవా చక్కనిదానవు. అందకత్తెవు. అయితే మగవారు చితె్తై్ధర్యం లేని మనస్సు కలవారు. ఇంద్రియ నిగ్రహం లేనివారు. బహుచంచలచిత్తులు. అందువల్ల విరాట మహారాజు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి బాగా ఆలోచించి భయపడినవాడై నిన్ను, నీకు యిచ్చవచ్చిన చోటికి నిశ్చింతగా, స్వేచ్ఛగా వెళ్ళమని ప్రార్థనాపూర్వకంగా చెప్పి పంపమని కోరాడు.
పేరుగల భర్తలున్నారని వరుసబెట్టి అందరినీ చంపటానికి ప్రయత్నిస్తున్నావు. మనుషులు నిన్ను చూస్తే భయపడుచున్నారు. నీ జాడలో నడవటానికి జంకుచున్నారు. కాబట్టి మా నగరాన్ని, మా దేశాన్నీ వదలి ఎక్కడికైనా వెళ్లిపొమ్ము’’ అని సున్నితంగా రాజు మనసు తెలియజెప్పింది.
ఆ మాటలకు సైరంధ్రి ‘‘అమ్మా! సుదేష్ణాదేవీ! ఇంతవరకున్న విధంగా ఇంకొక్క పదమూడు దినములు మాత్రం నీ మందిరంలో వుండటానికి ఒప్పుకొంటే చాలును. నా కోరిక తీరుతుంది. ఆ తరువాత నా భర్తలు కనిపించి మీ కోర్కెను తీర్చగలరు. ఇదివరకెన్నడూ కలుగన సంతోషం మీకు కలుగుతుంది. ఏదైనా మేలు చేస్తే నా భర్తలు దానిని మరువజాలరు. కృతజ్ఞతాభావంతో గుర్తిస్తారు. పరోపకార బుద్ధులు. స్వభావ రీత్యా వారు దయామయులు. వారు విరాటరాజుకు మేలు చేసేవారే అగుతారు. కావున సైంధ్రీ యిట్లా అనటానికి గల కారణమేమై ఉంటుందోనని అనుమానించకు.
ఈ సైంధ్రి ఏమైపోతేనేమి? ఈమెను గురించి విచారం నాకెందుకు? ఇంతకాలం గౌరవంగా చూచావు. చివరి దశలో భంగం వాటిల్లకుండా ఈమెను ఇక్కడినుండి వెళ్లిపొమ్మని వేడుకుంటాను అని నిర్ణయించుకొనటం నీకు తగదమ్మా! అని వేడుకొన్నట్లుగా పలికింది. సైరంధ్రి మాటలను విన్న సుధేష్ణాదేవి ఆమెతో-
‘‘సైరంధ్రీ! నీవు చెప్పిన గడువు ముగసేంతవరకు నా మందిరంలో నీవు వుండటానికి సమ్మతిస్తున్నాను. నీవు నీ వృత్తికి తగిన పనులలో వ్యవహరిస్తూ వుండిపొమ్ము. న కొడుకులనూ, నా భర్తనూ పెద్దమనసుతో కనిపెట్టి రక్షిస్తూ యుండుము. నీ మనసు ఊరట కలగటానికి నీకు ఏయేవి అవసరమో నీవు కోరినట్లు, తగినట్లు అమరుస్తాను’’ అని సైరంధ్రి మనసు కుదుటపడేటట్లు అన్నది.
ద్రౌపది ఎప్పటివలెనే తన వృత్తిలో సముచితంగా మసలటం మొదలుపెట్టింది.
సింహబలుడైన కీచకుడు ఒక ఆడుదానికొరకై భయంకరమైన, నీచమైన చావు చచ్చాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము