డైలీ సీరియల్

యాజ్ఞసేని--109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కఠినాత్ములైన ఉపకీచకులు పిత్రురాలు, పుణ్యస్వభావురాలు, అయిన ద్రౌపదిని అపవిత్రుడూ, దుష్టుడూ అయిన కీచకుని శవంతో కలిపి తీసికొని వెళ్ళారు. బంధువులందరూ పెడబొబ్బలు పెట్టారు. అట్లా శ్మశానం వైపునకు వెళుతుండగా భయంతో ద్రౌపది కలతబారిన హృదయంతో, కన్నీరు పొంగి ప్రవహిస్తుండగా యెలుగెత్తిరోదనం చేసింది.
‘‘దిక్కులేని దానను. నేను యిప్పుడు చేసే ఆక్రందన వినండి. మీరుండగనే ఉపకీచకులు నన్ను చుట్టుముట్టి కట్టివేసి భయం లేకుండా అవమానం చేస్తున్నారు. శత్రువులను పాదాక్రాంతులను చేసికొనే ‘‘ఓ జయుడా! ఓ జయంతుడా! దురభిమానులను మర్ధించిన ఓ విజయుడా! తేజోబలంతో శత్రువులను పడగొట్టిన ఓ జయత్సేనా! శత్రువులను నాశనం చేస ఓ జయద్బలా!నాథులారా! గంధర్వ శ్రేష్ఠులారా! నన్ను ఈ ఉపకీచకులు ఈ నీచ కీచకుడి శవంతో కట్టి వగంగా తీసికొని పోతున్నారు. మీరు త్వరగా వచ్చి కాపాడండి’’ అని మొరబెట్టుతుండగా ఆ అరుపులు విన్న భీమసేనుడు-
‘‘ఈ నీచ కీచకులు మళ్లీ ఇంత పని చేశారే?’’ అని కోపోద్రేంతో ఊగిపోతూ యుద్ధానికి సిద్ధమై శీఘ్రంగా పరుగెత్తి వారితో తలపడటానికి వేరొక మార్గం ద్వారా కోటగోడను దూకాడు. దగ్గరలోనున్న ఒక పెద్ద చెట్టును పెరికి కోపంతో భుజాన పెట్టుకొన్నాడు. భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు.
కీచకుడి శవాన్ని అనుసరిస్తూ వస్తున్న ఉపకీచకులు యెదుట భయంకరాకారంతో నిలబడి ఉన్న భీమసేనుడిని దూరం నుండే చూచి గుండెలదిరిపోగ ఆఅడుగు ముందుకు పెట్టక ఎక్కడివారక్కడనే నిలబడ్డారు.
‘‘అరుగో గంధర్వులు వచ్చి మనలను చుట్టుముట్టారు. ఇక వారి బారినుండి తప్పించుకొనటం ఎట్లాగో ఏమో?’’ అని కొందరు పల్లపు ప్రాంతాలలో దాక్కొన్నారు. కొందరు సమీపంలోని చెట్లపైకి ఎక్కారు. కొందరు చెల్లాచెదరుగా పరుగెత్తారు. నీటిలో మునిగి కొందరు కూర్చున్నారు.
అట్లా భయకంపితులైన ఉపకీచకులు పారిబోయేముందు ద్రౌపదితో యున్న తమ అన్న శవాన్ని క్రింద జారవిడిచాడు. కోపోద్రేకంతో వున్న భీమసేనుడు వారిని వెంటాడి ఒక్కొక్కరిని పట్టి విడువక చావమోది, నుగ్గు నుగ్గు చేసి చంపాడు. ఆ నూట ఐదుగురు ఉపకీచకులందరూ భీముడి చేతిలో హతమయ్యారు.
ఉపకీచకులను చంపి శాంతించిన భీమసేనుడు శవానికి కట్టుబడి యున్న ద్రౌపది కట్లూడదీసి నిశ్చితంగా సుదేష్ణ మందిరానికి పొమ్మని చెప్పి తాను మరొకదారిన వంటింటికి చేరాడు.
ఉపకీచులందరూ గంధర్వుల చేతిలో హతులయ్యారని విని కంపించిన విరాటుడు తోబుట్టువుల చావుకు అమితంగా దుఃఖించాడు. దుఃఖిస్తున్న భార్య సుదేష్ణను ఓదార్చి ఆమెతో-
‘‘సుదేష్ణా! వెంటనే సైరంధ్రిని ఏదో ఒక సాకుతోఈ చోటునుండి పంపించివేయాలి. అందుకు తగిన విధంగా ఆమెతో నా మాటగా చెప్పుము. ఆ అందగత్తె ప్రక్కకు మగవారు పోతే ప్రమాదం వస్తుంది కాబట్టి నేను చెప్పటానికి భయపడుతున్నాను. స్ర్తిలయితే మెత్తని మాటలతో, నేర్పుతో ఉపాయంగా చెపుతారు. అదే సరైన పద్ధతి. ఈ నగర వాసులకు ఏ సమయంలోనైనా చేటు కలుగకుండా పోదు. ఇటువంటి ప్రమాదకరమైన పొత్తు మనకు వద్దు. మనం బ్రతకలేము’’ అని అన్నాడు.
తెల్లవారింది. సూర్యుడు పశ్చిమ దిక్కున తన లేత కిరణాలను ప్రసరింపజేస్తూ ఉదయించాడు. అంతకుముందే ద్రౌపది కీచకుని శవాన్ని తాకిన దోషనివృత్తి కొరకై సచేల స్నానం చేసింది. కీచకులందరూ చనిపోవడంతో తేరుకొన్నది. మెల్లమెల్లగా నడుస్తూ నగరంలోనికి ప్రవేశిస్తుండగా చూచిన ప్రజలు వణికిపోయారు. పారిపోయారు. ద్రౌపది వంటింటి వాకిటి వద్ద కాచుకొని నిల్చున్న భీమసేనుడిని చూచింది. అతడిని సూటిగా చూడకుండా తనలో తాను మాట్లాడుకొంటున్నట్లుగా-
‘‘కీచకుల వలన కలిగిన ప్రమాదాన్నంతా తొలగించి నన్ను కాపాడిన పరమ ధర్మమూర్తి గంధర్వపతికి జీవితాంతం సదా భక్తితో నమస్కరిస్తూ బ్రతుతాను’’ అని అన్నది. భీమసేనుడు కూడా రహస్యంగా మాట్లాడే నేర్పుతో-
‘‘ఇల్లాలు అపాయంలో చిక్కుకొంటే ఆదుకొనడం భర్త యొక్క దర్మము. అది వారి కర్తవ్యం. వారు చేయవలసిన పనిని చేశారు. దనీకి అంతగా పొగడటం ఎందుకు? అని అన్నాడు.రహస్యం బయల్పడకుండా ఇతరులు తమను గుర్తించ సాధ్యంగాకుండా ప్రవర్తిస్తూ మాట్లాడుకున్నారు. తదుపరి సైరంధ్రి మెల్లగా నడుస్తూ నర్తనశాల వద్దకు వెళ్లింది. నర్తనశాలలో విరటుని కన్యల ఆటలను చూచే నెపంతో దానిలో ప్రవేశించి అర్జునుడిని చూచింది. అలా అర్జునుడిని చూస్తున్న పాంచాలిని చూచి అక్కడ వున్న కన్యలు అర్జునుడితో కలిసి ఆమెకెదురుగా వచ్చి-
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము