డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజు నర్తనశాలకు ప్రజల కన్నులు గప్పి యెటువంటి సంకోచం లేకుండా వచ్చిన నీ కార్యభార నిర్వహణ గొప్పదనం తలపోయ నాతరమా? మనవారైన పాండవులలో ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా ఒంటరిగా ప్రకటించిన నీ సాహసం మెచ్చుకొనడం నా తరమా? లోకులెవ్వరికీ సాధ్యంగాని ‘కీచకుడిని’ క్షణంలో మట్టుబెట్టిన నీ పరాక్రమాన్ని కీర్తించటం నా తరమా? నిన్ను కీర్తించటానికి నేనెంత దానిని? అమితానందంతో, ఆశ్చర్యంతో మురిసిపోయాను’’ అని అన్నది. భీముడు భార్య పలికిన మాటలకు పొంగిపోయి
‘‘ఇక యిక్కడ ఆలస్యం చేయడం మంచిది కాదు’’ అని హెచ్చరించి భీముడు వెంటనే వెళ్ళి పోయాడు. వంటింటికి చేరుకొని తన శరీరానికి యున్న రక్తాన్ని శుభ్రంగా కడిగికొని మైనపూతో దానిని వాసన రాకుండా చేసికొని తన పడకమీద విశ్రాంతి కొరవై మేను వాల్చాడు.
కీచకుడిని చంపిన తరువాత సంతోషంగానూ, నిర్భయంగాను యున్న ద్రౌపది నర్తనశాలకు కాపలాకాస్తున్న భటుల వద్దకు వెళ్ళివారితో
‘‘రండి! రండి! ఇటురండి! ఇళ్ళకు రండి! ఇలా చూడండి! పరస్ర్తిని కామించిన రుూ నీచ కీచకుడిని నా పతులైన గంధర్వులు చంపారు. వాడు యిక్కడ పడి ఉన్నాడు’’ అని అన్నది.
నర్తనశాలకు కాపలా కాసేవారు ద్రౌపది మాటలు విని వెంటనే కాగడాలను వెలిగించి తీసుకోని అక్కడికి వచ్చారు. నర్తనశాలలో రక్తం మడుగులో తడిసి ముద్దయి నేలపై చచ్చి పడి యున్న కీచకుణ్ణి చూచారు. కాళ్ళుచేతులు లేని ఆ కీచకుడిని చూచి బాధపడ్డారు. పరీక్షగా చూచారు. కీచకుడు ఈ విధంగా చావటం చూచి వారంతా తమలో తాము ఇది మనుష్యులు చేసిన పనిగా తోచటం లేదు. చూశారా! వీడి మెడ, చేతులు, కాళ్ళు ఎక్కడికి పోయాయో?’’ అని కోలాహలాన్ని విని ‘కీచకులగుంపు ‘‘చాలావేగంగా అక్కడికి వచ్చారు. గుర్తపట్టలేనంతగా వింతచావు చచ్చిన తమ అన్న కీచకుడి తీరు చూసి గుండెలు పగిలిపోయేటట్లుగా ఎలుగెత్తి ‘హ, హా’ అని ఆక్రోశించారు. ఆశ్చర్యంలో కొయ్యబారిపోయాను. నేలమీద పడి శోకాలు పెట్టారు. ఉపకీచకులు ఆ విధంగా శోకిస్తుండగా బంధువులంతా పరుగెత్తికొచ్చి కీచకుడి శవాన్ని చూచారు.
‘‘మానవ లోకంలో యింతటి వింత పీనుగుగా మారిన వాడిని ఎక్కడైనా చూచామా? అయ్యో ఎంతటి అప్రదిష్ఠతో కూడుకొన్న పనికి ‘మాలిన’ చావై వచ్చింది. ఎవ్వరూ జయించలేని యితడి బలం పనికి రాకుండాపోయింది. సమయం వచ్చినప్పుడు తనకు పనికిరాకుండాపోయింది. మూర్ఞుడి మనస్సు రాబోయే కీడును తెలిసికొనలేదు. చేతులేవి? తలేది? కాళ్ళెక్కడికిపోయాయి? గంధర్వులచేతిలో చచ్చేవాళ్ళంతా ఈ విధంగానే అవుతారేమో? అని అందరూ మాట్లాడుకొంటూ శోకంతో నిండియున్న సమయంలో వారిలోని ఒక ఉపకీకుడు సోదరులందరితో
‘‘మనం యెంత పిలిచినా అన్న వినగలడా? ఇతడిని వేగంగా స్మశానానికి తీసికొని పోవాలి.’’ అని అందరినీ వూరడించాలి.
ఉపకీచకుల చేష్టలను చప్పుడు కాకుండా చూస్తూ ముందేమి జరుగుతుందేమో చూద్దామని ఆసక్తితో వారికి దగ్గరలోనే ఒకచోట నిలబడింది ద్రౌపది. ఆమెను ఉపకీచకులు చూచారు. ఒకకసారిగా వారిలో కోపం పొల్లుబికింది. ద్రౌపదిని కసితో, కరకుదనంతో గట్టిగా పట్టుకొన్నారు. చేతులను వెనుకకు త్రిప్పికట్టారు.
‘‘పాపిష్ఠి రూపం గలిగిన యిదేగా మన అన్నను మట్టుపెట్టించింది? కాబట్టి అతడితోపాటుగా ఈమెను గూడా కలిసి దహనం చేయటం యుక్తమైన పని’’ అని నిర్ణయించి తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపారు. ‘‘ఈ విధంగానైనా సైరంధ్రిని సింహబలుడితో కలిపి దహనం చేసి చంపాలని ఆలోచించాం. నీకు తెలియపరచటానికి వచ్చాము. నీవు మమ్ములను అనుమతించాలి’ అని కోరారు.
విరాటుడు తన మనసులో ‘ఈ ఉఫకీచకుల పద్దతి చూస్తే నేను వద్దన్నా వీరు వినేటట్లుగా లేరు. మానేటట్లు లేరు. గంధర్వులు బలవంతులు కాబట్టి సైరంధ్రికి అపాయం కలుగక పోవచ్చునని అనుకొన్నాడు. ‘‘అట్లాగే మీకు తోచిన విధంగా చేయండి’’ అని అన్నాడు.
‘‘ఈ రంకుటాలు అతడితోపాటే అంతం కావాలి. ఈ విధంగానైనాఅన్నను సంతోషపెట్టాలి.’’ అని అంటూ ఉపకీచకులు ద్రౌపదిని కొనిపోయి కీచకుడి పీనుగ మీద ఉంచి ఆమెను పీనుగతో కలిసికట్టారు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము