డైలీ సీరియల్

యాజ్ఞసేని--106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు ద్రౌపది తాను సుదేష్ణ మందిరంలో పనిలో నిమగ్నమై వుండటం, అక్కడికి కీచకుడు సింగారించుకొని రాడా, తాను బెదరక వాడిని లోబరుచుకోవాలని ప్రయత్నించడం, నర్తనశాలకు రాత్రిపూట ఒంటరిగా రమ్మని చెప్పడం, వాడు మూర్ఖుడు కాబట్టి సంతోషంతో పొంగిపోయినప్పటికీ
‘‘ద్రౌపదీ! కష్టసాధ్యమైన పని. అజ్ఞాతవాస ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధమైనదీ అయినటువంటి కార్యాన్ని వెంటనే చేసేటట్లు సంఘటితం చేశావు. ప్రతీకారం తీసుకొనటానికి తగిన అవకాశాన్ని కల్పించావు. ధర్మరాజు మెచ్చేటట్లు పగ సాధించి చూపిస్తాను. అయితే భయపడకుండా వాడు నీవు గుర్తుచెప్పిన చోటికి వస్తాడా? లేక మరొకరిని సహాయంగా తీసుకొని వస్తాడా? తొందరపాటు వలన మూఢుడై రహస్యాన్నంతా బట్టబయలు చేస్తాడా? అయినా వాడు అట్లా యెందుకు చేస్తాడులే! కన్నుగానని మోహాంధకారంతో నిరభ్యంతరంగా ఒంటరిగానే నర్తనశాలకు తప్పకవస్తాడు. నన్ను చూచి యుద్ధంచేస్తాడు. నా బాహుబలం ముందు తన బలాన్ని కోల్పోయి నీకు ప్రీతి కలిగేటట్లు చేస్తాడు’అని అన్నాడు.
భీముడన్న మాటలకు ద్రౌపది భీముడి కోపావేశం తమ అజ్ఞాతవాసానికి భంగకరం గాకుండా అతడికి తెలిసేటట్లుగా
‘‘రాజా! మనమంటే పడని వారంతా నవ్వేటట్లు, ధర్మరాజుకు అధిక దుఃఖం కలిగింటేటట్లు, లోకనింద సంభవించేటట్లు, రుూ కలహా నీవధిక కోపంతో రహస్యం చెడదగొడితే నా కోర్కె తీరినా చివరకు ఫలితం శూన్యమే యవుతుంది. మన అజ్ఞాతవాసం బహిర్గతంకాకుండా శత్రువును చంపగలగాలి. అదే నా యభిమతం. వేరొక విధంగానైతే రుూ ప్రయత్నమే వద్దు’’అని ద్రౌపది యనగా
‘‘నీవు చెప్పిన విషయం మనసులో వుంచుకొని వీలయినంతవరకు రహస్య పద్ధతిని భద్రంగాకాపాడుతూ తగిన వుపాయంతో కీచకుడిని చంప ప్రయత్నిస్తాను’’అని ద్రౌపదికి వూరట కలిగించాడు భీముడు.
ద్రౌపది కీచకుడితో నర్తనశాలకు రాత్రిపూట ఒంటరిగా రమ్మని చెప్పగానతడు సంతోషంతో యింటికి వెళ్ళాడు. ఆ పూట కీచకుడికొక మాసంలాయనిపించింది. మృత్యువు సైరంధ్రి రూపంలో పొంచియున్నదని మూర్ఖుడైన కీచకుడు తెలిసికోలేకపోయాడు. వెంటనే కామమోహితుడయ్యాడు.
గంధం పూసుకోవడం, ఆభరణాలు పెట్టుకోవడం, దండలు ధరించడం, మొదలుగాగల యలంకరణాలపట్ల ఆసక్తుడయ్యాడు. ద్రౌపదిని పదే పదే తలచుకొంటూ క్షణమొక యుగంలా గడిపాడు.
ఎత్తుపల్లాలేవో చెప్పలేనంతగా, లోపలాబయటా నొకే విధంగా, కళ్ళు తెరచినా మూసినా యొకటే విధంగా వుండేటట్లు చీకటి క్రమంగా నేలపై వ్యాపించింది.
అప్పుడు ద్రౌపది భీముడివద్దకు వచ్చింది. సమయమైందని చెప్పింది. భీమసేనుడు సంతోషించి తలపాగా చుట్టుకొన్నాడు. ద్రౌపదిని రిరితన వెనుక కొంచెం దూరంగా వుంటూ తనననుసరిస్తూ రమ్మని కోరాడు. కోపావేశం బయటివారు తెలిసికొన లేకుండా గంభీరంగా నర్తనశాలకు చేరాడు.
చీకటితో కలుషితమైనదీ, ప్రేమవలె నిరూపించలేనిదీ, అరణ్యంవలె మనుషులు లేనట్టిదీ, యుపయోగ రహితమైనట్టిదీ, కలలోని వస్తువువలె కంటికి కనపడనిదీ, దొంగలకు యిష్టమైనదీయైన ఆ నర్తనశాల ముందర భాగానికి భీమసేనుడు చేరాడు. నర్తనశాల నలుదిక్కులను కలయజూచాడు.
భవనాంగాలను తుది మొదళ్ళను గుర్తించలేని చీకటి గల, పిరికివాళ్ళకు భయంకరంగా యుండి చొరబడటానికి చొరనివ్వని (వీలులుని) చీకటిగల నర్తనశాల లోపల భాగంలోనికి నిశ్చింతగా భార్య ద్రౌపది చేయిని పట్టుకొని మిక్కిలి కోపంతో ప్రవేశించాడు.
ఆ విధంగా ప్రవేశించిన భీమసేనుడు, భవన మధ్యలో ఉత్తరకన్య శయనించే (విశ్రాంతికి) సునిమెత్తని పాన్పును పరిశీలించాడు. ఆ శయ్యను తెలిసికొని దానికి దగ్గరలో ద్రౌపదిని కనపడకుండా దాచి యుంచాడు. ఆ పాన్పుపై తానెక్కి కూర్చున్నాడు.
ఇంతలో మంచిగా యలంకరించుకొని, మదభావం గలిగిన వింత సంతోషంతో శరీరము యుప్పొంగుతుండగా, కామకేళకి పనికివచ్చే మద్యాన్ని సేవించడంవలన కలిగిన కోర్కెతో పరుగులిడుచున్న మనస్సుగలవాడై, సింహపు గుహలోనికి వేగంగా వచ్చే యేనుగుపగిది, భీమసేనుడు గూర్చున్న నర్తనశాలకు కీచకుడు వచ్చాడు. ఆ నర్తనశాల మండపంలోని యంతర్భాగంలో సంకేతంగా యేర్పరచు కొన్న ప్రదేశానికి సమీపించి, దానిని పరిశీలించి మిక్కిలి సంతోషంతో తన చేతిని ఆ శయ్యపై చాచడు. భీముడు శరీరంపై చేయివేసి ‘‘మాలిని’’ అనుకొని
‘‘ఓ మాలినీ! నీకు మేలి వుస్తవులను యేర్పరచి ప్రీతిగా తెచ్చాను. తీసికొనుము.
..........................ఇంకావుంది

-- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము