డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు వెళ్ళి ప్రక్కపై పడుకొనుము’’అని చెప్పి భీమసేనుడు ద్రౌపదిని పంపించి వేశాడు.
(్భమసేనుడిని గొప్పవాడని పొగడి, ఆ పని అలాచేశావు, ఈ పని ఇలా చేశావు నియంతవాడు మరెవరున్నాడు. ద్రౌపది దుఃఖాన్ని తీర్చటానికి నీవే దిక్కు అని రెచ్చగొట్టి కార్యాన్ని సాధించటము ద్రౌపదికి బాగా తెలుసు. పొగడ్తలకు పొంగే భీమసేనుడు ద్రౌపది మాటలకు కార్యరూపం కలిగించ పూనుకొన్నాడు. ఏదైనా పనిని సాధించాలంటే ద్రౌపది భీముడిని మెత్తగా రెచ్చగొడుతుంది. అదే పని కీచకుడి విషయంలో గూడా ద్రౌపది చేసింది.)
(49)
కీచక వధ
తెల్లవారింది. కీచకుడు ద్రౌపదిపై కలిగిన మోహంతో అతివేగంగా సుదేష్ణ మందిరానికి వెళ్లాడు. అక్కడ తన పనిలో నిమగ్నమైయున్న సైరంధ్రిని చూచాడు. ఆమె సమీపానికి వెళ్ళాడు. అట్లా ఆ కీచకుడు దగ్గరికి వెళ్ళగా, భీమునికిచ్చిన మాటలను ఊతంగా తీసికొని, కీచకుడిని చూచీ చూడనట్లుగా నటిస్తూ దూరంగా తొలగిపోకుండా వున్నది. అప్పుడు కీచకుడు ద్రౌపదిని చూచి
‘ఓ అమాయకురాలా! ఈ విధంగా నన్ను లెక్కబెట్టకుండా చూచి నీపై నా ఆశను వమ్ముచేయకుము. నన్ను గ్రహించి అంతంలేని సంపదలను, సుఖాన్నీ పొందుము. రాజు చూస్తుండగా సభలో నిన్నట్లా త్రోసిపడేసినా నన్నడ్డుకొన్న వాడెవడూ లేడు. నీకు ఐదుగురు భర్తలున్నారని పల్కావు. వారి బలపరాక్రమాలు యిప్పుడు తెలసివచ్చాయిగదా? వారి అంతుచూస్తాను. నీవు యెక్కడ చొరబడ్డా అడ్డంలేకుండా నిన్ను గ్రహిస్తాను.’’అని అనేక విధాలుగా మాట్లాడుతున్న కీచకుడిని చూచి ‘‘వీడు నన్ను పట్టుకొనడానికి త్వరపడుతున్నాడు. నేను వీడిని కట్టడిచేయవలసిన మాటలు చెప్పకముందే వీడు నన్ను సమీపిస్తే అనుకున్న పనిచెడిపోతుంది’’అని ఆలోచించి వాడివైపు చూచి
‘‘నేను వద్దని యెంత వారించినా విడవకుండా వెంబడించి మాటిమాటికి తొందరపడి నామీదికి వస్తున్నావు. నీ మనస్సు మన్మథ వశమైనట్లే అందరి మనస్సులుగూడా మదనావేశానికి లోనౌతాయని గ్రహించుము. పురుషులు మోహావేశాన్ని రహస్యంగా వుంచుకొనకుండా బయటపడతారు. స్ర్తిలు తమ మోహాన్ని మనసులోనే ధైర్యంగా వుంచుకొంటారుగానీ బయటపడరు.
ఓ కీచకా! ఈ విషయాన్ని తెలిసికొని అన్నివిధాలా బయటపడని విధంగా, గోప్యంగా, నీ కోర్కెకు అనువైన పద్ధతి యేదో అటువంటి పద్ధతిలోనే నన్ను పొందుము. అన్నివిధాలా మన రహస్యవ్యూహం భగ్నంగాకుండా వుండే విధంగానే సాగుతున్న నీ కోర్కెకు యెటువంటి ఫలాన్ని అనుభవించవలసి వుంటుందో అటువంటి ఫలాభోగాన్ని పొందుము’’అని అనగా కీచకుడుప్పొంగి (ద్రౌపది అన్నమాటలలోని గూఢార్థాన్ని నీచుడైన కీచకుడు తెలిసికొనలేకపోయాడు)
‘‘సరే! నీ ఆజ్ఞ మనసా పాటిస్తాను. శిరసావహిస్తాను. నా కోరిక యెక్కడ యే ఉపాయంతో తీరుస్తావో చెప్పుము’’అని అనగా కీచకుడు తన వలలో చిక్కుకొన్నాడని గ్రహించిన ద్రౌపది
‘‘అతి రహస్యంగా చీకటి తప్పు చేయగోరేవారికి ఆ ‘‘నర్తనశాల’’ వేడుక కలిగించే సంకేత ప్రదేశము. ఉత్తర కన్యలందరూ పగలంతా ప్రీతిగా నాట్యంచేసి పోయిన తరువాత ఆ నర్తనశాల నిర్మానుష్యంగా వుంటుంది కాబట్టి అది యనువైన ప్రదేశం. అటువంటి రహస్య క్రీడకు నీవు ఒంటరిగా వస్తేనే మంచిది’’అని ద్రౌపది పలుకగానే వుప్పొంగిపోయిన కీచకుడు
‘‘ఓ పద్మముఖీ! నన్ను నీవు యేవిధంగా ఏలుకుంటావో ఆ విధంగానే నడుచుకొంటాను ఈ రాత్రికే నేను సంతోషంగా ఒంటరిగావస్తాను. ఇది నా నిర్ణయం. నీవన్నమాట నీవు తప్పకుండా పాటించాలి సుమా!’’
‘‘నీ వొక్కడివే రావాలి సుమా! అట్లుగాకపోతే నేనక్కడ నిలువకుండా వెళ్ళిపోతాను సుమా! నామాట నిజం’’అని ద్రౌపది గట్టిగా వొత్తిచెప్పి
‘‘మనమిద్దరం ఎక్కువసేపు సంకోచంలేకుండా మాట్లాడుకోవడం భావ్యంగాదు. ఎవరైనా చూడగలరు. మన రహస్యం బయటపడే అవకాశం యిచ్చినట్లవుతుంది. అందువల్ల నీవు యిక్కడినుండి వెళ్ళిపొమ్ము. నేనూ నా పనిమీద వెళతాను’’ అని కీచకుని నమ్మబలికింది.
ద్రౌపది మాటలకు కీచకుడు సంతోషంతో తన యింటికి వెళ్ళిపోయాడు. ద్రౌపది కూడా తను చేయవలసిన పని పూర్తిచేసుకొని భీమసేనుడుండే వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమసేనును చూచి అతడి కోపాగ్నిని యెగదోయటానికి అండితో
‘‘నా వంతు పని నేను పూర్తిచేసి వచ్చాను. నీవు చేయవలసిన నీవంతు పని యింక మిగిలివున్నది. కీచక సంహారానికి, లోకాన్ని మోసంచేయటానికి తగిన సమయం ఆసన్నమైంది. ఆ చీకటి రాత్రి రానున్నది. ఇంక నీ యిష్టం. ఏం చేస్తావో చెప్పుము.’’అని అనగా
‘‘ఓ ద్రౌపదీ! నన్ను అడగటం దేనికి? నీవూ ఆ నీచుడూ యేమి మాట్లాడుకొన్నారో నాకున్నది వున్నట్లుగా తెలుపుము. నిన్ను నేను మెప్పిస్తాను’’అని అన్నాడు.
..........................ఇంకావుంది

-- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము