డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చూపులూ, మనస్సు నీ మీద ఆసక్తితో లగ్నమైయుండగా యెడలు మరచి వుండేదానిని. మధ్యమధ్యవారు నన్ను గమనిస్తున్న తీరును గమనిస్తుండేదానిని.
నేను పొందిన అవమానభారానికి నీవు నిజంగా విక్రమిస్తే లోకులు మనలను యిట్టే పోల్చుకొనగలరు. కాబట్టి నీకు యనువైన విధంగా రహస్య వర్తనం మరెవరికీ తెలియకుండునట్లుగా బయటపడకుండా శత్రువును మట్టుపెట్టాలి.
అంతేగాదు అర్జునుడు భరతవంశానికే పేరుతెచ్చినవాడు. ఆ ఘనుడు రుూనా ఆపదలను యెదుర్కొంటున్నాడు. అభిమానధనుడైన అన్జునుడు నాట్యరంగంలో నిలబడి రాచకన్యలకు నాట్యం నేర్పవలసిన స్థితియెంత దయనీయం. దానిని చూచి నేను లోలోపల దుఃఖిస్తుంటాను. కుమిలిపోతుంటాను. అతడింతటి నీచ వృత్తికి పాల్పడటమా? అయినా చేసేదేముంది.?
తన ఆనందాన్ని ఎదురుబడి చూస్తే మరలా తిరిగి చూడాలని యెవరికైనా అనిపించేటంతటి అందగాడు, దానశీలుడైన ‘నకులుడు’ గుఱ్ఱాలను శిక్షకుడుగా యుండవలసినవాడా? అతడి శోభనీయ పరిస్థితిని చూచి కన్నీరు పెడుతుంటాను.
వయసులో చిన్నవాడైనా గుణాలలో పెద్దవాడూ మాద్రీదేవి చిన్నకొడుకు. కుంతీదేవికి అతి ప్రీతిపాత్రుడైన ‘సహదేవుడు’ కార్యనిర్వహణ పరిజ్ఞానం గలవాడు నేడు ‘ఆవులకు’ కాపరిగ వుంటూ అడవులలో సంచరిస్తూ వుండటం చూచి నేను దుఃఖిస్తుంటాను. ‘‘కోడలా నిన్ను నమ్మి అతి కష్టమైన వనవాసం చేయడానికి సహదేవుడిని పంపటానికి వొప్పుకుంటున్నాను’’అని కన్నీరు కారుస్తూ కుంతీదేవి అన్నది. అతడి మనసును కనిపెట్టి కాపాడమని కోరింది.
ద్రుపద మహారాజుకు కూతురుగా, కుంతీదేవికి తన కోడళ్ళందరిలో అధికంగా పొగడగా వర్ధిల్లాను. మీ అందరూ స్నేహరాగాలు పంచగా ప్రవర్తిల్లాను. రూప గుణ బలపరాక్రమాలలో పేరొందిన కుమారులకు తల్లినైయ్యాను. పాండుమహీపతికి కోడలినై ‘‘ద్రౌపది పుణ్యాంగన’’ యని మహారాజుల పత్నులు, మాన్యులైన రాణులందరూ ప్రశంసించే కీర్తిని సంపాదించాను.
మానవాభిమానాలు కోల్పోయి నీచంగా పొట్టకూటికొరకు, సుదేష్ణకు సపర్యలు చేస్తూ, సహస్ర పరిజనులచేత చేయించుకొనడమేగానీ, యొకరివద్ద పనిచేయడం మీకు యేమాత్రం దుఃఖాన్ని కలిగించడం లేదు. సుకుమారమైన నా ‘అరచేతులు’ నలుగుపిండిని గంధంవలె నూరడానికి, మై పూతలు పూసి సువాసనలు యేర్పరచడానికి, సుదేష్ణ కనుసన్నలలో యెప్పుడూ పరిచర్యలు చేస్తుండటంవలన నా అరచేతులు కాయలు గాచిపోయాయి.’’
అని చెప్పి ద్రౌపది దుఃఖిస్తూ భీమసేనుని గుండెలపై ముఖాన్ని చేర్చింది. ఆమె కష్ఠస్థితిని చూచి భీమసేనుడు కలత చెందాడు. భీముడు చింత పడుతుండగా ద్రౌపది మరలా అన్నది
‘‘మీ గౌరవాన్ని, న్నత్యాన్ని వనసులో కోరుకొని నేను యెట్లానైనా ఆపదలన్నిటినీ ఓర్చుకొంటాను. కానీ పొగరుబోతు కీచకుడు మదన పీడితుడై చిన్నచిన్న యత్నాలతో ఆగక విజృంభించి నన్ను పట్టుకొనటానికి ప్రయత్నించటంతో యింతగా భయంతో వణికిపోతున్నాను. భీమసేనా! నన్ను యిన్ని యిడుములకు పాల్జేసిన ఆ కీచకుడు రేపు సూర్యదయమగునప్పటికీ బ్రతికియున్న చోట నేను నీ యెదుటనే ప్రాణత్యాగం చేస్తాను. ఉరివేసుకొని గానీ, నీళ్ళులో దూకిగానీ, అగ్నిలో పడిగానీ, విషం తిని గానీ శరీరం విడిచిపెడతాను. కానీ కీచకునికి మాత్రం చేజిక్కను. నీమీద ఒట్టు’’అని దుఃఖిస్తూ ద్రౌపది అనగా
‘‘ఓ ద్రౌపదీ! కీచకుడిని చంపటంకొరకు ఈ విధంగా మర్మాలు తగిలేటట్లు యింతగా నచ్చజెప్పాలా? నేను చూస్తుండగా అడ్డూయాపూ లేకుండా నిన్ను పరాభవించిన ఆ కీచకుడినింకా భూమిపై జీవించియుండే యిల్లాండ్రను మానభంగాలనుంచి గట్టెక్కించే మార్గమేది?
రేపటి దినం ఆ కీచకుడు ఎట్లాయున్నా, స్వయంగా ధర్మజుడు వచ్చి అడ్డుపడినా, నీవుగూడా అధిక దయతో క్షమించినా, నా చేతిలో అతడి చావు మూడింది.
ఇక నీవు కీచకుడి పట్ల అంతగా చింతపడవలసిన అవసరం లేదు. వాడి మాటలు యిక నీవు మరచిపొమ్ము. దుష్టదుర్యోధన కర్ణశకుని దుశ్శాసన సైంధవుల నందరినీ నర లోకానికి పంపేటంతవరకూ నా మనసు చింతాభారంతో నిండియుంటుంది. కౌరవుల కాలం మూడినట్లు మన అజ్ఞాతవాస సమయంగూడా పూర్తిగావస్తున్నది. పండ్రెండవ నెల నడుస్తున్నది. ఇంకా రుూ గడువుకాస్తా తీరితే నీ దుఃఖం కూడా తీరుతుంది. కాస్త యూరడిల్లుము. కీచకుడు నిన్ను అవమానించి యింకా శరీరంతో బ్రతికియున్నాడు. కాబట్టి రేపు వాడి ఆయుస్సు మూడింది.
నీవుగూడా ఆ నీచుడిని అంగీకరిస్తున్నట్లు నటించి ‘నర్తనశాలను’ సంకేతంగా చెప్పి వాణ్ణి అక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పుము. అట్లావస్తే ఆ సొసుగాడి మట్టుబెట్టి నీకు కళ్ళారాచూపి నీ మనస్సు రంజింపచేస్తాను. ఇదిదప్ప మరొక యుపాయం లేదు. ఇదే నిర్ణయం. ఇట్లాగే చేద్దాం. ఈ కార్యం మాటలతో తీరేదిగాదు. చేష్టలకు దిగాలి. అదిగో తెల్లవారబోతున్నది. లోకం గుర్తిస్తే అజ్ఞానవాస వ్రతానికి భంగం వాటిల్లుతుంది.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము