డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మిక్కిలి బలంగల వాడను. ‘సురథుడు’ అనే మహారాజు కొడుకును. నన్ను ప్రజలు కోటికాస్యుడు అని పిలుస్తారు.
సుందరీ! అడుగో మనకు కనిపిస్తున్న ఆ బంగారు రథంమీద వేదియందు అగ్నిలా ప్రకాశించే అతడు ‘త్రిగర్త’ దేశాధిపతి అయిన ‘క్షేమంకరుడు’.
ఉత్పలాక్షీ! ఆ తరువాత మహాధనుర్థారి, విశాలమైన కన్నులుతో చక్కని పూలమాలను ధరించి నన్ను చూస్తున్నవాడు ‘కుళిందదేశ విభుడు (కళింగదేశానికి ప్రభువు)
సుందరాంగీ! ఆ పుష్కరిణీ సమీపాన (తామరకొలనువద్ద) నిన్ను చూస్తున్న ఆ విప్పారిన కన్నులు కలవాడున్నాడే అతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ‘‘సుబలుడు’ అనేరాకుమారుడు. (సుబలుని సుతుడు) శత్రుసంహారి.
నలినాక్షీ! అడుగో ఎఱ్ఱని గుఱ్ఱాలు పూన్చిన రథాలలో మణులు పొదిగిన ఆభరణాలు ధరించి, యజ్ఞాలలోని అగ్నులవలె ప్రకాశిస్తున్న ‘‘సౌవీర రాజకుమారులైన అంగారకుడు, కుంజరుడు, గుప్తకుడు (సుప్తకుడు), శత్రుంజయుడు, సుప్రవృద్ధుడు (సుప్రబుద్ధుడు), భయంకరుడు (శుభంకరుడు), భ్రమరుడు (భ్రమంకరుడు), శూరుడు, రవి (రథి), ప్రతాపుడు (గుహకుడు), సంజయుడు (సృంజయుడు) మరియు కుహనుడు (బలాఢ్యుడు).
ఆ పనె్నండు మంది చేత ధ్వజాలు ధరించి, రథం వెనుక నడువగా, ఆరువేల రథాలు, ఏనుగులు, పదాతులు అనుసరిస్తుండగా మత్త్భేం మీద అధివసించి ఉన్నవాడే ‘‘సింధుసౌవీరదేశాలకు’’ అధిపతి అయిన ‘‘జయద్రథుడు’’. అతని పేరు నీవు వినే ఉంటావు. ‘సైంధవుడు’ అని కూడా అంటారు. అతని సోదరులైన ‘బలహక, అనీకి, విదారణుడు కూడా ఉన్నారు.
సుకేశీ! మాకు నీ గురించి తెలియదు. కాబట్టి నీవెవరి భార్యవో? ఎవరి కుమార్తెవో? చెప్పుము.
కోటికాస్యుని మాటలను విన్న ద్రౌపది తత్తరపాటుతో తన ఉత్తరీయాన్ని సవ్యంగా అమర్చుకొని కమిడిచెట్టు కొమ్మను వదలి, అతనిని సంకోచిస్తూ అన్నది.
‘‘కోటికాస్యుడా! ఇక్కడ ఈ అరణ్యంలో ఈ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నాను గదా? నీవు నా దగ్గరకు రావడం సమంజసం కాదు. నేను కొడుకులు కలదానను. ధర్మాన్ని అనుసరిస్తున్న దానిని. నన్ను తదితర సామాన్య స్ర్తిగా ఊహించి పలు మాటలాడటం నీకు పాడిగాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు గనుక నీకు సమాధానం ఇవ్వవలసి వస్తోంది. ఈ విషయం నీవు గమనించవలసి ఉన్నది. సర్వధర్మనిరతురాలైన నేను ఒంటరి పురషడవైననీతో ఎలా మాట్లాడగలను.?
ఓ కోటకాస్యుడా! దావీరుడుగా సుప్రసిద్ధుడైన ‘‘శిబి చక్రవర్తి వంశంలో జన్మించిన ‘సురథుడి’ కొడుకువని తెలుసును.
శైబ్యా! ఇక నా విషయం చెపుతాను వినుము. నేను పాంచాల మహారాజైన ‘‘ద్రపదుడి’ యొక్క పుత్రికను. నన్ను ప్రజలు ‘‘కృష్ణ’’ అని పిలుస్తారు. నేను అయిదుగురిని పతులుగా వరించాను. వారు పాండు మహీపతి కుమారులైన యుధిష్టిరుడు (్ధర్మరాజు), భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు. (నకులుడు, సహదేవుడు). అట్టి మహావీరులకు నేను ధర్మపత్నిని. వీరులైన ఆ కుంతీ పుత్రులు నన్ను ఇక్కడ ఉంచి ధర్మరాజు తూర్పుదిక్కునకు, భీమసేనుడు దక్షిణ దిక్కుకు, అర్జునుడు, పడమర దిక్కుకు, నకుల సహదేవులు ఉత్తర దిక్కుకు వేటకొరకై వెళ్ళారు. ఆ రథసత్తములు అన్ని వైపులనుండి ఇక్కడికి కొద్దిసేపటిలో తిరిగి రాగలరు. కాబట్టి మీరు మహాత్ములైన పాండవులచేత అతిథి మర్యాదల పొంది యధేచ్ఛగా వెళ్ళెదరుగాక. మీరు కొంతసేపు ఈ ఆశ్రమ సమీపంలో నిలవండి’’ అన పలికి భీతితో ఆ వరవర్ణిని అయిన యాజ్ఞసేని పర్ణ కుటీరంలోనికి పోయింది.
అంత కోటికాస్యుడు తిరిగి వెళ్ళి రాజుల మధ్యనున్న జయద్రథునితో ఆ సుందరాంగి ద్రుపద మహారాజు కూతురునీ, పాండవుల ధర్మపత్ని అనీ తెయజెప్పాడు. ఆ మాటలు విన్న దుష్టస్వభావుడైన సైంధవుడు ఇ‘ఆ ద్రౌపదని చూస్తాను’ అని సింహగృహంలోనికి ప్రవేశించే తోడేలులా పవిత్రమైన ఆశ్రమంలోనికి వెళ్ళ ద్రౌపదిని చూచి
‘‘అందమైన కన్నులుగల ద్రౌపదీ! నీకు కుశలమేగదా?
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము