డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యమూ ధర్మతత్పరులై ఉండేవారు ఎప్పుడూ కూడా నశించిపోరు. ఇక నాకు సెలవు, వెళ్తాను. మీకు ఎప్పుడు శుభమగుగాక!’’’ అని అనగా కుదుటపడిన మనసులతో చింత తొలగి ద్రౌపది సహితంగా-
‘‘గోవిందా! ప్రభూ! మహాసాగరంలో మునిగిపోతున్న వారికి నావ దొరికినట్లుగా నిన్ను మేం రక్షకునిగా పొంది అతి కష్టమైన ఈ ఆపదనుండి గట్టెక్కినాము. నీకు కళ్యాణమగుగాక’ అని పాండవులు వేనోళ్ళ శ్రీకృష్ణునికి వంగి అభివాదం చేసి-
‘‘హే కృష్ణా! నీవు ఎల్లప్పుడూ పాండవుల ఎడల, నా ఎడల దయతో ఉండుము. నీవలన మేము అన్ని ఘోరమైన కష్టాలనుండి బయటపడుచున్నాము. మా మీద దయతో ఉండుము’’ అని ప్రార్థించింది.
45
సైంధవుడి పరాభవము (జయద్రథుడు)
కామ్యకవనంలో పాండవులు తృణబిందు ఆశ్రమ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయా ఋతువులలో రమణీయంగా పుష్పాలతో ఉన్న వనాలను చూచారు. మృగయాసక్తులై పాండవులు ఆ మహారణ్యంలో విహరించారు.
ఒకనాడు పాండవులు తమ పురోహితుడు, గొప్ప తపస్వి అయిన దౌమ్యుని యొక్క, తృణబిందు మహర్షి యొక్క అనుమతి గైకొని ద్రౌపదిని తృణబిందు ఆశ్రమంలో ఆమె చెలికత్తె అయిన ధాత్రేయికతో పాటు ఉంచి బ్రాహ్మణ రక్షణార్థం వేట కోసం నలుదిక్కులా వెళ్లారు.
అదే సమయంలో సింధు దేశాధిపతి, వృద్ధక్షత్రుని పుత్రుడు అయిన జయప్రథుడు వివాహేచ్ఛతో మిత్రులతో కలిసి సాల్వ (శాల్వ అని) దేశానికి వెళుతున్నాడు. మంచిగా అలంకరించుకొని, పెక్కుమంది రాజులతో కలిసి ప్రయాణిస్తూ కామ్యకవనానికి చేరుకొన్నాడు.
ఆ నిర్జరారణ్యంలో తృణబిందు ఆశ్రమ ద్వారంవద్ద నిల్చొని ఉన్న ద్రౌపదిని చూశాడు సైంధవుడు. మెఱుపు నల్లని మబ్బులను వెలిగించినట్లుగా ఉన్న యశస్విని అయిన ద్రౌపది అతిసుందర రూపాన్ని చూచి, ఆమె అప్సరసయో, దేవకన్యయో, లేక దేవతలు కల్పించిన మాయయో అనుకొని ఆశ్చర్యచకితుడయ్యాడు జయద్రథుడు. అతడిలో వెంటనే దుష్ట్భావనలు కలిగాయి. కామమోహితుడయ్యాడు. తన చెలికాడు, రాజకుమారుడు అయిన కాటికాస్యుడు అనే వానిని చూచి.
‘‘మిత్రమా! కోటికాస్యా! అక్కడ నిలుచొని ఉన్న లోకోత్తర సౌందర్యవతి అయిన ఆమె మానుష స్ర్తియా, దేవతా స్ర్తియా, యక్షజాతికి చెందిన కన్యయా, పన్నగభామినియ, కాకపోతే ఎవరై యుండును? వివాహంకోసం వెళ్ళే నాకు ఈ అతిలోక సుందరిని పొందితే వేరెవరితో పనిలేదు. కమిడిచెట్టు కొమ్మను తన చేతితో పట్టుకొని నిల్చియున్న ఈమె ఎవరికి చెందినదో, ఎక్కడిదో, ఈ కంటకావృతమైన అడవిలో ఎందుకు వచ్చిందో తెలిసుకొని రమ్ము. చక్కని పలువరుస, సన్నని నడుము, విశాలమైన కన్నులు కలిగిన ఈ అతిలోక సుందరి నన్ను వరిస్తుందా?
ఈ స్ర్తి రత్నాన్ని పొంది నేను కృతార్థుడనౌతాను. ఈ మనోహరాంగి నాకు వలపుకత్తె అయితే మూడు లోకాలను పాలించే సార్వభౌముడివలె మన్మథవీరుడిని నా భృత్యుడిగా చేసికొని సర్వసుభాలనూ అనుభవించగలను. ప్రియమిత్రమా! నీవు పూనుకొని ఈమెను అంగీకరింపజేసి, నాకు సంయోగం గూర్చి నా జన్మధన్యం చేయాలి సుమా!
అని సైంధవుడు కోరి నియోగించగా కోటికాస్యుడు వేగంగా ద్రౌపది ఉన్నచోటికి వెళ్ళాడు. ప్రియవచనాలతో ద్రౌపదిని చూచి
‘‘సుందరీ! లేడి చూపులవంటి చూపులు కలదానా! కమిటిచెట్టును వంచి విలాసంగా పట్టుకొని ఈ ఆశ్రమంలో ఒంటరగా ఉన్న నీవు ఎవరు? ఇక్కడ ఉండటానికి కారణమేమిటి? నీవు మూర్త్భీవించిన వనదేవతవా? దేవతవా? యక్షిణివా? అప్సరసవా? దైత్యాంగనవా? దివ్య రూపధారిణివి అయిన నాగరాజకన్యవా? లేక వరుణయమకుబేర చంద్రులలో ఒకరి భార్యవా? నీ ప్రేమకు పాత్రుడైన నీ భర్త ఆగొప్ప సుఖభోగి ఎవరు?
మత్త్భేమందగంభీర గమనం కలదానా! నీకు మా విషయం సవిత్తరంగా తెలిసికొనటానికి వివరిస్తాను.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము