డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడా! ఇంతకుపూర్వం సభలో దుష్ట దుశ్శాసనుని బారినుండి నన్ను రక్షించి తప్పించినట్లే ఈ సంకటంనుండి నన్ను కాపాడేవాడిని నీవే ప్రభూ! దీనదయాళో! రక్షమాం! రక్షమాం! రక్షమాం!’’
అని శ్రీకృష్ణ్భగవానుని మనసారా ప్రార్థించింది.
అప్పుడు ఆ దేవాదిదేవుడు అయిన శ్రీకృష్ణ్భగవానుడు ద్రౌపది ఆర్తనాదాన్ని విన్నాడు.
ప్రక్కనే శయ్యపై ఉన్న రుక్మిణీదేవికి కూడా చెప్పకుండా ఆమెను వదలి త్వరగా వచ్చాడు. శ్రీకృష్ణుని చూచిన ద్రౌపది సంతోషంతో వంగి నమస్కరించింది. వాసుదేవునికి దుర్వాసముని రాకను గురించి వివరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు-
‘‘యాజ్ఞసేనీ! నాకు భరించరానంత ఆకలి వేస్తోంది. ముందు వెంటనే అన్నం పెట్టుము. ఆ తరువాత అంతా చేస్తాను’’ అని అనగానే ద్రౌపది సిగ్గుపడి-
‘‘కృష్ణా! వాసుదేవా! సూర్యభగవానుడిచ్చిన అక్షయపాత్ర నా భోజనం అయ్యేవరకే పనిచేస్తుంది. దేవా! ఇప్పుడు నా భోజనం అయిపోయింది. అందుకని అన్నం దొరకదు’’ అని అనగా ఆ కంస సంహారి-
‘‘ద్రౌపదీ! ఇది వేళాకోళానికి సమయం కాదు నేను ఆకలితో ఉన్నాను. ఎంతో అలసిపోయి ఉన్నాను. వెళ్ళు వెంటనే ఆ పాత్రను తెచ్చి నాకు చూపించు’’ అని బలవంతపెట్టి ఆ పాత్రను తెప్పించాడు. ఆ పాత్రను చూచి దాని అంచుకు అంటుకొని వున్న తోటకూర ఆకు ముక్కను (లోపలి భాగములో అంటుకొని ఉన్న ఒక్క అన్నం మెతుకును అనిగూడా) చూచి దానిని నోటిలో వేసుకొని తిని ‘‘దీనితో విశ్వామిత్రుడు, యజ్ఞ్భుక్తి, సరేశ్వరుడు అయిన భగవంతుడు శ్రీహరి సంతోషించుగాక! తృప్తిచెందుగాక!’’ అని పెద్దగా అన్నాడు అక్కడ వున్న సహదేవునితో సహా.
‘‘సహదేవా! మునులందరినీ వెంటనే భోజనానికి రమ్మని ఆహ్వానించి తీసునిరా’’ అనన్నాడు.
సహదేవుడు అప్పుడు దేవకీ నదిలో స్నానం చేయటానికి వెళ్లిన దుర్వాస ముని మొదలైన మునులందరినీ భోజనానికి పిలవటానికి త్వరత్వరగా వెళ్లాడు. అక్కడ నీటిలో అఘమర్షణ మంత్రాన్ని జపిస్తున్న మునులందరినీ చూచి-
‘‘మహామునీ! త్వరగా ముగించి భోజనానికి రండి’’ అని అన్నాడు. వారు ‘పదండి వస్తాము’ అని అన్నారు. ఆ దుర్వాస ముని పదివేలమంది శిష్యులకు పరమ తృప్తి కలిగి అన్నరసంతో కూడిన త్రేనుపులు రాగా భుక్తాయాసంతో క్రిందపడి దొర్లనారంభించారు. వారంతా లేచి దుర్వాసమునిని చూచి- ‘‘విప్రోత్తమా! యుధిష్ఠిరుని అన్నం సిద్ధం చేయించమని చెప్పి మనం స్నానానికి వచ్చాము. గొంతువరకు తృప్తిగా ఉన్న మనం ఇంకా ఏమి భుజించగలం? ఏం తింటాం? మనం సిద్ధం చేయించిన అన్నం అంతా వ్యర్థం అవుతుందిగదా! మనం ఇప్పుడు ఏం చేయాలి’’ అని అనగా-
ఆ దుర్వాసముని ‘మనం అనవసరంగా అన్నం వండించి రాజర్షి అయిన యుధిష్ఠిరుని పట్ల గొప్ప అపరాధం చేశాము. పాండవులు క్రూరదృష్టితో చూచి మనలను భస్మం చేయగలరు గదా! అంబరీషునితో కలిగిన అనుభవం గుర్తుకొస్తున్నది. పాండవులందరూ మహాత్ములు. ధర్మపరాయణులు, శూరులు, పండితులు, వ్రతపరాయణులు, సదాచారులు. నిత్యము వాసుదేవుని పరమాశ్రయం పొందినవారు. కనుక శిష్యులారా! వారిని ఏమియు అడగకుండా వెంటనే పారిపోండి’’ అని అన్నాడు. శిష్యులందరూ మిక్కిలిగా భయపడిపోయారు. వారు కనిపించక అటూ నిటూ తిరుగుతూ అక్కడ ఉండే తాపసులవలన వారంతా పారిపోయారని విని తిరిగి వచ్చి యుధిష్ఠిరునకు వృత్తాంతాన్ని నివేదించాడు. పాండవులందరూ వారు వస్తారనే ఆశతో ఎదురుచూస్తూ ఉండిపోయారు.
‘‘అర్థరాత్రివేళ వచ్చి అకస్మాత్తుగా అతడు మనలను మోసగిస్తాడు. దైవవశాత్తు వచ్చినపడిన ఈ కష్టం నుండి మనం ఎలా బయటపడగలిగాం’’ అని చింతాపరులై ఉన్న పాండవులను చూచి శ్రీకృష్ణుడు-
‘‘కుంతీపుత్రులారా! పరమ కోపిష్ఠుడైన దుర్వాస మహర్షి వలన మీకు కలిగిన ఆపదను గురించి ద్రౌపది నన్ను ప్రార్థిస్తే నేను వెంటనే వచ్చాను. ఆ దుర్వాసుని వలన మీకు కొంచెమైనా భయం వలదు. మీ తేజస్సుకు భయపడి ఇంతకుపూర్వమే అతడు పారిపోయాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము