డైలీ సీరియల్

యాజ్ఞసేని-87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ముని కొన్ని రోజులపాటు అక్కడనే ఉన్నాడు. దుర్యోధనుడు ఆ ముని శపిస్తాడేమోననే భయంతో దివారాత్రులు జాగరూకుడై సేవకునివలె సేవలు చేశాడు. ముని ఒకసారి ‘‘నాకు ఆకలిగా ఉంది. వెంటనే అన్నం పెట్టు’ అని చెప్పి స్నానానికి వెళ్ళి చాలాసేపు అక్కడే ఉన్న తరువాత వచ్చేవాడు. అలా వచ్చి ‘‘ఈరోజు అన్నం తినను. నాకు ఆకలిగా లేదు’’ అని చెప్పి అదృశ్యమైపోయేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా తొందరపడి వచ్చి ‘‘మాకు భోజనం పెట్టు’’ అని చెప్పి అదృశ్యమైపోయేవాడు. ఒక్కోసారి అకస్మాత్తుగా తొందరపడి వచ్చి ‘‘మాకు భోజనం పెట్టు’’అని అనేవాడు. మరొకసారి అర్ధరాత్రివేళ లేచి బెదిరించేవాడు. అయినా దుర్యోధనుడు ఏమాత్రం చిరాకు, కోపాన్ని ప్రదర్శించక ప్రవర్తించేవాడు. అప్పుడు దుర్పర్షుడైన దుర్వాసముని సంతుష్టుడై’’ వరాన్ని ఇస్తాను కోరుకో’’ అని దుర్యోధనునితో అన్నాడు.
‘‘రాజా! నీకు శుభమగుగాక! నీ మనసులో ఏదైనా ఉంటే అది వరంగా అడుగుము. నేను సంతోషించాక ధర్మానుకూలమైనది ఏదీ నీకు లభ్యమవకుండా ఉండదు’’ అని అన్నాడు.
దుర్యోధనుడు అంతకుముందే ముని ఏదైనా వరాన్ని వరాన్ని తన సేవలకు సంతృప్తుడై కోరుకొమ్మంటే ఎలాంటి వరాన్ని అడగాలో నిశ్చయించుకొన్నాడు. దుష్టుడైన దుర్యోధునుడు వెంటనే
‘‘ఓ బ్రాహ్మణోత్తమా! శిష్యులతో కలిసి మీరు నాకు అతిథి అయ్యారు. మా వంశంలోకెల్లా శ్రేష్ఠుడు అయినవాడు యుధిష్ఠిర మహారాజు. ఆ ధర్మాత్ముడు తమ్ములతో కలిసి అడవిలో నివసిస్తున్నాడు. శీల సంపన్నుడు, గుణవంతుడు అయిన అతనికి మీరు అతిథులుకండి. ఆ సుకుమారి యశస్విని, రాజపుత్రి అయిన ద్రౌపదీ విప్రులందరికీ, భర్తలకూ భోజనం పెట్టిన తరువాత తాను కూడా భుజించి విశ్రాంతిగా సుఖంగాకూర్చున్నప్పుడు నా మీద మీకు అనుగ్రహం ఉంటే ఆ సమయంలో అక్కడికి వెళ్ళండి’’అని వరాన్ని కోరాడు. అందుకు మహర్షి
‘‘నీకు ప్రీతి కలిగించడానికి అలాగే చేస్తాను’’ అని సుయోధనునికి చెప్పి తన శిష్యులతో కలిసి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు తాను కృతార్థునిగా భావించి తన చేతిలో కర్ణుని చేతిని పట్టుకొని మిక్కిలిగా సంతోషించాడు. అప్పుడు కర్ణుడు
‘‘కౌరవా! అదృష్టంకొద్దీ నీ కోరిక నెరవేరింది. దుర్వాసుని యొక్క క్రోధంవలన పుట్టిన అగ్నిలో పాండవులు పడిపోయారు. వారు తాము చేసిన మహా పాపాలవలననే దుస్తరమైననరకంలో పడిపోయారు’’ అని అన్నాడు. అందరూ సంతోషించారు.
ఇట్లుండగా పాండవులందరూ ఒకసారి సుఖాసీనులై ఉండగా ద్రౌపది భోజనం చేసి కూర్చొని ఉండటం తెలిసికొన్న దుర్వాస మహాముని తన పదివేలమంది శిష్యులతో కూడి ఆ వనానికి వచ్చాడు. వచ్చిన అతిథిని చూచి యుధిష్ఠిరుడు ధర్మానుసారం తన తమ్ముళ్ళతో కలిసి ఎదురేగి చేతులు జోడించి నమస్కరించి, ఉత్తమాసనం మీద ఆసీనుగావించి విధి పూర్వకంగా అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించి ఆతిథ్యం ఇవ్వదలచి భోజనానికి ఆహ్వానించాడు.
‘‘్భగవాన్! మీరు ఆహ్నికం పూర్తిచేసుకొని శీఘ్రంగా రండి’’ అని ప్రార్థించాడు. ఆ మహాముని ‘‘శిష్యసహితుడైన నాకు ఇప్పుడు ఎలా భోజనం పెట్టగలడు’’ అని ఆలోచించకుండానే తన శిష్యులతో కలిసి స్నానానికి వెళ్లాడు. మునులందరూ స్నానం చేసి ధ్యాననిమగ్నులయ్యారు.
ఈలోపల ఇక్కడ స్ర్తి రత్నమూ, పతివ్రత అయిన ద్రౌపది అన్నం గురించి మిక్కిలి వ్యాకుల పడింది. ఆమె ఎంత ఆలోచించినా అన్నం దొరికే ఉపాయం కనిపించలేదు. ఏమీ తోచక వెంటనే శ్రీకృష్ణవాసుదేవుని ప్రార్థించసాగింది.
‘‘హే కృష్ణా! గోవిందా! ముకుందా! మహాబాహూ దేవకీనందనా! వసుదేవసుతా! నమస్కరించినవారి ఆర్తిని నాశనం చేసేవాడా! గోపాలబాలా! కంస సంహారీ! జగన్నాథా! విశ్వాత్మా! విశ్వజనకా! విశ్వహర్తా! అవ్యయా! ప్రభూ! దీనజన పోషకా! పరాత్పరా! వరేణ్యా! వరదా! అనంతా! దిక్కులేనివారికి దిక్కు నీవైనవాడా! పురాణ పురుషా! సర్వాధ్యక్షా! పరాధ్యక్షా! శరణాగత వత్సలా! దేవా! దేవాధిదేవా! జగన్నాధా! శ్యామవర్ణా! పద్మాక్షా! దయతో నన్ను రక్షింపుము! హే పీతాంబరధరా! కౌస్త్భుం ఆభరణంగాకలవాడా! సమస్త ప్రాణులకూ ఆద్యంతాలు నీవే! నీవే వారికి పరమాశ్రయుడవు! పరాత్పరుడవు! రక్షకుడివి!

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము