డైలీ సీరియల్

యాజ్ఞసేని-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని ఐశ్వర్యంకంటే ఎంత ఎక్కువ అంతకంతకూ పెరిగిన వాళ్ళ స్వచ్ఛమైన పరాక్రమకాంతులు అన్ని దిక్కులా నిండింది.
ధర్మరాజుచేసిన రాజసూయయాగంలో లక్షమంది బ్రాహ్మణులు భుజించడం పూర్తికాగానే అక్కడ ఒక ‘శంఖం’ మ్రోగేటట్లు ఏర్పాటుచేశారు. శంఖం ఎప్పుడూ మ్రోగుతూనే ఉన్నది. ఆ నిరంతర శంఖధ్వని విన్న నాకు శరీరం గగుర్పొడిచింది. ఆ సంపదను చూసి నేను శాంతిని పొందలేకపోతున్నాను.
పైగా ద్రౌపదీదేవి అన్ని దేశాలనుండి రాజసూయ యాగాన్ని చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, తక్కిన వర్ణాలవారిని, బంధువులను, స్నేహితులను, వీర భటులను, పేదలను, బైరాగులను, ప్రతిదినం తానే స్వయంగా విచారించి తగిన రీతిగా దయతోటి అన్నం పెట్టి అందరూ భుజించిన తరువాత అర్థరాత్రిగానీ తను తృప్తిగా భుజించేది.
నేను మయసభా భనంలో తిరుగుతూ నున్ననైన మణిప్రదేశంలో నీళ్ళున్నాయని కట్టుకున్న బట్టలను పైకెత్తుతున్నను.

స్వచ్ఛమైన రాతినేల అనే తలంపుతో నీళ్ళుండిన కొలనులో అడుగుబెట్టి బట్టలన్నీ తడిసి క్రిందపడ్డాను. నా పాటు చూసిన భీముడు నవ్వాడు. ధర్మరాజు పంపున కొందరు సేవకులు కట్టుబట్టలు తెచ్చి ఇచ్చారు. అంతేగాక తెరచిన ద్వారాన్ని మూసి వున్నదానిగా తలంచి అందు ప్రవేశించకుండా అవతలికి తొలగిపోయానరు. మూసిన తలుపును తెరచిన దానిగా తలంచి ప్రవేశించమోగా దాని స్ఫటికపు రాతి నొసలకు కొట్టుకున్నాను. నకుల సహదేవులు పరుగెత్తుకొచ్చి ‘‘ఇదీ వాకిలి. ఇటు రమ్ము’’ అని పిలుచుకొనిపోయారు. నా స్థితిని చూచిన పెక్కువేలమంది చెలికత్తెలతో ఉన్న పాంచాలి ఫక్కున నవ్వింది. అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి నవ్వాడు. భీముడూ నవ్వాడు.
అంతేకాదు స్నేహంతో, బంధుత్వంతో శ్రీకృష్ణుడు, ద్రుపదుడూ తప్ప ఈ ఈ సమస్త భూమండలంలో ప్రీతితో పాండవులకు కప్పం కట్టని రాజులు లేరు. భూమండలమంతా పాండవుల అధీనంలో ఉండగా నేనొక రాజకుమారుడమై అధికారంలేని దీనుడిలా దీన్ని ఎలా చూడగలను.
ఆ వైభవాన్ని చూచి నేనూ, తక్కిన రాజులు వెలవెలపోతూ వుంటే శ్రీకృష్ణుడు, ద్రౌపదీ, సాత్యకి అదేపనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు. అని అనగా శకుని అందుకొని-
‘‘ఓ దుర్యోధనా! సూర్యునితో సమానమైన తేజస్సుగల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా మాయాద్యూతం నెపంతో నీకు అపహరించి ఇస్తాను. అయితే అందులో ఎంతమోసం వుంటుందో ధర్మరాజుకు తెలియదు. ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం. అతడిని సులభంగా ఓడించి అతని రాజ్య సంపదనంతా నీకిస్తాను. ఎందుకు దుఃఖిస్తావు?’’ అని అన్నాడు.
వెంటనే దుర్యోధనుడు తండ్రి పాదాలమీద వాలాడు. ‘‘తండ్రీ! ఈ శకుని అభిప్రాయాన్ని అంగీకరించుము’’ అని అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు-
‘‘నాయనా! దుర్యోధనా విదురుడు మేధావి. అతనితో ఈ విషయంలో ఆలోచిద్దం. అతడు నీతిపరుడు. అంతేకాదు దూరదృష్టి కలవాడు కురు పాండ పక్షాల రెంటి క్షేమం కోరేవాడు’’ అన్నాడు.
తండ్రి మాటలకు దుర్యోధనుడు స్పందించి ‘‘ఆ విదురుడు ఎప్పుడూ పాండవ పక్షం వైపే మొగ్గు చూపుతాడని ఇదివరకే విన్నాను. అతడు పనిగట్టుకొని ఈ పనిని ఆపివేస్తాడుగానీ శకుని జూదానికి అంగీకరిస్తాడా? ఈ ప్రయత్నానికి అంగీకరించుము. అంగీకరించకుంటే ఈ రోజే ఈ క్షణమే అగ్నికి ఆహుతి అవుతా. ఇది నిజం. తరువాత నిశ్చింతగా నీవు నీ విదురుడూ సుఖంగా ఉండండి’’ అని అన్నాడు.
దుర్యోధనుని మాటలకు దుఃఖించిన ధృతరాష్ట్రుడు శ్రేష్టమైన శిల్పులను రప్పించి బంగారు, రత్నాలు పొదిగిన వెయ్యి స్తంభాలతో, విచిత్రాలైన వందలకొలది ద్వారాలతో, రకరకాలైన రతనకాంతులతో ప్రకాశించే ప్రదేశాలతో అందంగా ఉండే ఒక సభను నిర్మింపజేశాడు.
..........................ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము