డైలీ సీరియల్
శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొంతసేపటికి వ్యాసుక్ష్మివారూ విచ్చేశారు. ఆయన కృష్ణున్నీ, హనుమనీ కౌగలించుకొని, ఆనందాశ్రువుల్ని చిందించారు. ఆపూట అక్కడే విశ్రమించి, భోజన తాంబూలాదులు స్వీకరించి, మరునాడుదయాన తిరుగు ప్రయాణమయ్యారు వారు ద్వారకకి.
4. ఆనంద సందోహం
యమునా నదీ తీరాన ఆడుతూ, పాడుతూ హనుమ రామకథా గానం చేస్తున్నాడని గోపికలకు తెలిసింది. వాళ్ళు గోపకులకు చెప్పారు. వాళ్ళు వాళ్ళ మిత్రులకూ, సన్నిహితులకూ చెప్పారు.
ఇంకేముంది ? యాదవులంతా ఒక ఉప్పెనలా కదలివచ్చారు. పాలూ, పూలూ, పెరుగూ, వెన్నలతో, పసుపూ కుంకాలతో.
ఈ జనాలందరినీ చూచి, హనుమ లఘుస్వరూపియై, పిల్లకోతియై చెట్టెక్కి, కొమ్మలమధ్యా, రెమ్మలమధ్యా దూరి కూచున్నాడు ఎవరికీ కనిపించకుండా.
బృందావనమంతా ప్రజలతో నిండిపోయింది. ఇసకవేస్తే రాలకుండా జనం ! మధ్యలో గట్టుపై శ్రీకృష్ణుడూ, అతని అష్ట్భార్యలూను.
‘‘ఏమిటిది ? ... ఇలా వచ్చారు మీరు ఒక్కుమ్మడిగా ?’’ ప్రశ్నించాడు కృష్ణుడు.
‘‘అనుమకోసం’’ అన్నారొకరు.
‘‘అనుమ రామాయణం సెబుతున్నాడటగందా ?’’ అన్నారు మరొకరు.
‘‘మేమూ యింటాం ! యిని తరిత్తాం !’’
‘‘ఎవరు చెప్పారు మీకు ?’’ అడిగాడు కృష్ణుడు.
‘‘ఆ నోటా రుూ నోటా యిన్నాం !’’
‘‘అవునా ?’’
‘‘యింతకూ అనుమయేడీ ?’’
‘‘నాకేం తెలుసు ? ... ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు. ఏమయ్యాడో ఏమో !’’
‘‘యే సెట్టెక్కి కూకున్నాడోరా !’’
‘‘సెట్లన్నీ యెదకండిరా !’’
‘‘యింద ! రుూ సెట్టుమీన ఓ పిల్లకోతి ఉంది ! కానీ, అనుమ లేడు’’.
‘‘యెటెళ్ళాడో గందా ?’’
‘‘అయ్యా ! కిట్టయ్యా ! ... తమరే రచ్చించాలి ! ... తమరే మాకు దిక్కు !’’ అంటూ శ్రీకృష్ణుని చుట్టూచేరి, అతని పాదాలపైబడ్డారు వారు.
ఇంకా ఉంది