డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యభామ : హనుమా ! మేమూ వస్తాం !
హ : ఎంత అదృష్టం తల్లీ ! లంకలో మీరు సీతగా ఉన్నప్పుడు మిమ్మల్ని నా భుజాలపై కూర్చోమన్నాను. శ్రీరాముని వద్దకు చేర్చుతానన్నాను. కానీ, మీరప్పుడు ఒప్పుకోలేదు. కానీ, యిప్పుడు, ఈ యుగంలో నాకా అదృష్టం దక్కబోతోంది అంటూ ఆనందాశ్రువుల్ని కార్చాడు.అప్పుడు తన తలపై కృష్ణున్ని, భుజాలపై అష్ట పత్నుల్నీ కూర్చో బెట్టుకొని, గాలిలో తేలిపోయాడు హనుమ. క్షణాల్లో వ్యాసాశ్రమంలో వ్రాలాడు.
ఆ ఆశ్రమం మబ్బుల్లోని చంద్రబింబంలా దివ్యకాంతులీనుతోంది. మొహం మీద పడుతోన్న ముంగురుల్ని తొలగించుకుంటూ, ముందుకు నడిచాడు వాయుసూనుడు. ఆతని వెనక కృష్ణుడూ, కృష్ణపత్నులూ వెళ్ళారు.
అక్కడ వ్యాసమహర్షి లేడు. ఆతని శిష్యులు మాత్రం ఉన్నారు. కొందరు యజ్ఞ యాగాదుల్ని చేస్తోంటే, కొందరు, జప, తప, ధ్యానాల్లో మునిగి ఉన్నారు. మరికొందరు కొన్ని తాటియాకుల్ని ముందేసుకుని, గంటంతో ఏవో లిఖిస్తున్నారు.
‘‘ఏం చేస్తున్నారు మీరు ?’’ ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు.
‘‘ఏముంది ? మా గురువుగారు మాకప్పగించిన పనిని మేం పూర్తి చేస్తున్నాం’’ అన్నారు వారు వినయంగా.
‘‘ఏమిటది ?’’
‘‘మా గురువుగారు భారత భాగవతాదుల్ని వ్రాసి, అక్కడక్కడా కొంత విడిచిపెట్టారు’’ ...
‘‘వాటిని మీరు పూర్తిచేస్తున్నారన్నమాట !’’
‘‘అవునండీ ! ఇంతకీ తమరెవరో మేము తెలుసుకొనవచ్చా ?’’
‘‘తప్పకుండా ! నేను వసుదేవపుత్రుణ్ణి ! కృష్ణున్ని !’’ అన్నాడాయన. వెంటనే వారు వారి పాదపద్మాలపై పడిపోయారు.
‘‘ఏమిటిది ? ... లెండి ! లెండి ! ...’’ అంటూ లేవనెత్తాడు వారిని శ్రీకృష్ణుడు.
‘‘మరి, వీరంతా ఎవరు ?’’
‘‘ఈయన హనుమ. వీరు నా ధర్మపత్నులు’’ అన్నాడు శ్రీకృష్ణుడు.
‘‘అవునా ? చెప్పరేం ?’’ అంటూ వారందరికీ పాదాభివందనాలు చేసి,
‘‘మేమూ, మా ఆశ్రమం నేటికి పావనం’’ ! అన్నారు వారు పారవశ్యంతో
‘‘ఎందుకు నాయనా ?’’
‘‘ఎందుకేమిటండీ ! ... మీ కథే మేమిప్పుడు వ్రాస్తోంది. అది పూర్తయే సమయానికి మీరు మాకు సతుల సమేతంగా, హనుమ సమేతంగా దర్శన మిచ్చారు !’’ అంటూ వారు మురిసిపోయారు. వారికి సకల మర్యాదలూ చేశారు వారు.
ఇంకా ఉంది