డైలీ సీరియల్
శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవునో, కాదో ఎరుగను
కాని, ఒకటి నేనెరుగుదు
కొంతసేపు నేను వీని
ధరియింపక నుంటిగాని
శ్రీరాముడు పదునాలుగు
వత్సరాలు తొడుగలేదు
వట్టి కాళ్ళ తిరిగినాడు’’
అంచు పలికె పరమాత్ముడు
ఆ మాటను వినినంతనె
‘వలవల’ మని ఏడ్చె హనుమ
‘‘ఇది యేమిటి ? ఇతడేడ్చును’’ ?
అంచు అతని జేరిరి
‘‘ఎంత బాధపడినాడో ?
నా రాముడు ! శ్యాముడు
ఒకటా ? రెండా ? మూడా ?
పదునాలుగు ఏడులు ?
ఎన్ని ముళ్ళు గ్రుచ్చినవో ?
ఎన్ని రాళ్ళు తగిలినవో ?
ఏడ్వలేదు ఎన్నడతడు !
తన బాధను చెప్పలేదు’’
అనుచు నతడు రాముదలచి
వెక్కి వెక్కి ఏడ్చెను
‘‘ఇపుడెందుకు రామునికథ ?
ఇపుడెందుకు రాముని వ్యధ
ఊరుకొనుము హనుమా !’’ యని
ఊరడించినారు వారు.
‘‘మీ రాముడు మీకెంతో
మా కృష్ణుడు మాకంతని’’
పోరాడిరి రక్షలకై
రక్షలె జనరక్షలని
శ్రీకృష్ణుని పదములబడి
‘‘మాకిమ్మని ! మాకిమ్మని’’
‘‘మాకు ప్రసాదించ’’మని
అతని వేడుకొనిరి వారు
ఆ భామల బాధలు విని
ఆ లేమల తీరుల గని
ఏడ్చే హనుమయు నవ్వెను
కృష్ణుడున్ను నవ్వెను
‘‘ఆనాడో నీ తమ్ముడు
భరతుని కిడినావు ప్రేమ !
ఈనాడో ఈ తల్లులు
అడిగిరి ఎనమండ్రును
ఎవరికి నీ విత్తువోయి ?
ఎవరిని కాదందువో ?
ఇవ్వకున్న ఊరుకొనరు
నీ భరతం పట్టేరు’’
అనుచు నవ్వె హనుమ యంత
దిక్కులన్ని మారుమ్రోగ
ఇంకా ఉంది