డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత యొకతె ఆ రక్షల
తీసి చేతబూనెను
అది ఏమిటో ఆ వృక్షం
వెలుగుల కోల్పోయెను
మరల చెట్టుక్రింద నుంచ
మరల వెలిగిపోయెను

‘‘ఏదీ ? నే చూచెద’’నని
అందుకొనియె సత్యవాని
అంత సత్యచంద్రునివలె
వింతగ వెలుగగసాగెను
అపుడు వాని ముద్దిడుకొని
తన తలపై నుంచె సత్య
ముఖమె కాదు ఒడలెల్లను
వెలుగులీన సాగెనామె

మిన్నంటెను ఆనందం !
భక్తి పారవశ్యము !
వారలంత తమ తలలను
ఉంచి పరీక్షించిరి

ముట్టుకొనిన, పట్టుకొనిన
శిరము నందు దాల్చినను
వెలిగినారు వారలంత
వే వేలుగుల చంద్రునటుల
‘‘నాకంటే, నాకంటును’’
పోరాడిరి పిల్లలవలె
అప్పుడొకతె కృష్ణునడిగె
‘‘ఏమిటి ఈ వింత ?’’ యంచు
‘‘నేనెరుగను ? నేనెరుగను
మీరె తెలుసుకొను డనుచును’’
పలికె నతడు బేలవోలె
కులికెనతడు చంటివోలె

‘‘అమ్మా ! అవి శ్రీరాముని
పాదుకల’’న్నాడు హనుమ
‘‘అందుకె అవి అంతగాను
వెలుగులీను చున్న’’వనెను
‘‘అందులకేనా భరతుడు

తన తలపై మోసె వీని ?
తన గద్దియ నుంచి భక్తి
నిరతము పూజించె వీని’’ ?
అంచు యొకతె ప్రశ్నించెను

‘‘అవునా ?’’ యని వారలంత
చూచినారు కృష్ణువంక
పలుకడాయె కృష్ణుడంత
‘‘ఉలకరేమి ? పలకరేమి ?
సత్యమేదొ తెలుపరేమి ?’’
అని యాతని బలవంతం
చేసిరి యా అబలలు

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087