డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వస్త్రం చూచెను
దానిని తొలగించుచునది
తన కుబుసం తొడిగెను
ఆపిదపను ఏనుగొకటి
ఆ కుబుసము తొలగించెను

లింగని నోటను కడిగెను
పూలతోడ పూజించెను
మీ వలెనే ఒకరిపూజ
మరియొకరికి నచ్చదాయె
ఒకరు చేయు అ
నచ్చదాయె మెచ్చరాయె

కర్మసాక్షి వలె కృష్ణుడు
వీక్షించెను వారి తీరు

అవుననకను, కాదనకను
వౌనమ్మున మునిగెను
‘‘మీ సేవల తీరుచూడ
నాకొక కద స్మరణకొచ్చె’’
అనుచు నవ్వెనాతండు
వేవెలుగుల చంద్రుండు

‘‘అవునా ? ఆ కదయేమిటొ
సెలవీయగ వలదో ?’’
అంచు చుట్టు ఆ యింతులు
చేరిరి పూబంతులట్లు
‘‘వినరే ? శ్రీకాళహస్తి
ఈశ్వర మాహాత్మ్యమ్మును ?
కనరే ? అమ్మహేశ్వరుని
మహిమాన్వితమగు లీలలు ?

‘శ్రీ’ యనగా సాలెపురుగు
‘కాళ’మ్మన కాలనాగు
‘హస్తి’ యనగ ఏనుగు
వాని కథే క్షేత్రకద

ఊరి చివర అడవిలోన
పాడుపడిన గుడియుండెను
దాన ‘లింగ’ మొకటుండెను
పూజలు సేవలు లేకను
సాలె పురుగు దాని జూచి
ప్రేమను వస్తమ్మ్రల్లెను
లింగనికది సమర్పించి
భక్తితోడ కొలిచెను

ఆపై ఒక నల్లత్రాచు
ఆ వస్త్రం చూచెను
దానిని తొలగించుచునది
తన కుబుసం తొడిగెను
ఆ పిదపను ఏనుగొకటి
ఆ కుబుసము తొలగించెను
లింగని నోటను కడిగెను

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087