డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుక్కలల్లే మెరిసిపోతున్నారు వాళ్ళు ! మా కిట్టయ్య కాళ్ళపైబడ్డారు. నువ్వే దేవుడవన్నారు. తెలియక వానలూ, పిడుగులూ కురిపించాం ! మన్నించమన్నారు ! ‘అట్టాగే’నంటూ, మా కిట్టయ్య మన్నించేశాడు వాళ్ళని. వాళ్ళంతా మా కన్నయ్యని దీవించి, మాయమైపోయారు మళ్ళీ’’
‘‘అమ్మో ! ... అమ్మో ! ... ఇదంతా నిజమే !’’
‘‘మా అవ్వ ఏవో కట్టుకదలు వింది ! అవన్నీ నిజమే అనుకుంటోంది. అంతా వట్టిదే !’’
‘‘వాడట్టాగే అంటాడు తల్లీ ! మాయలోడు వాడు ! ... అప్పుడు వర్షం ఆగిపోయాక మేమంతా మా యిండ్లకు పరుగెత్తాం ! ... వీడా పర్వతాన్ని మళ్ళీ ఉన్నచోటే పెట్టేశాడు భద్రంగా ! ... చీకటి కొండలా నల్లగా ఉందా కొండ ! ... అప్పట్నుంచీ, వీణ్ణి ‘గోవర్ధన గిరిధారి’ అంటూ పొగిడి, భజనలు చేసేశారు ప్రజలు. యిప్పుడూ చేస్తున్నారు కూడా !’’.
‘‘నిజమా ?’’
‘‘నిజం తల్లీ ! ... నా మాట నమ్ము ! ... ఓసారి నాతోరా ! ... మా యిల్లూ వాకిలీ, ఊరూవాడా, గొడ్డూ, గోదా చూపిస్తా ! ... మా గోపెమ్మల్ని చూపిస్తా ! ఆ మడుగునీ, కొండనీ చూద్దూగానీ ! ... నా మాటలు నిజాలో, అబద్దాలో నీకే తెలుస్తుంది’’ అంది యశోదమ్మ.
‘‘సర్లే అవ్వా ! ... అంతా నిజమే కానీ, మన యింటికెళ్దాం పద ! ... అక్కడ కాసేపు పడుకొని, విశ్రాంతి తీసుకుందువుగానీ, బాగా అ
అంటూ తన రదమెక్కించి, పత్నులతో, యశోదమ్మతో శరవేగంగా వెళ్ళాడు. ఆపై, సముద్రంలో నావనెక్కించి, సముద్ర తరంగాల గుండా పయనించి, ద్వారకాపురిని చేరుకున్నాడు, చుక్కల్లోని చంద్రునిలా! రాత్రంతా హాయిగా, తల్లి ఒడిలో పాపాయిలా పడుకున్నాడు పరంధాముడు.
2. శ్రీకృష్ణ పాదుకలు

ఒకనాడొక మొగలిపూల
పొద చెంతను కృష్ణుడుండె
తేలుచు తన వయారాల
భామలతో సరసాలను
కమ్మని పూవుల తావుల
నెమ్మది నాస్వాదించుచు
ఝుమ్మను తుమ్మెదల
గానలహరులందు నీదుచు
ఒక పూవును కోసిమ్మని
కోరె నొక్క పూబోణి
ఆమె ముద్దు తీర్చుటకై
కోసిచ్చెను పూవొక్కటి
ఆమె నగవు దూసియిచ్చి
ఇంకా వుంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087