డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం( రెండవ భాగం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు నమ్మారా ? ...’’
‘‘నమ్మకేం జేస్తాం తల్లీ ! ... ఒకటి తరువాత మరొహటి అద్భుతాల్ని చేసేస్తోంటే ! ... పూతననీ, శకటాసురున్నీ, తృణావర్తున్నీ ... యిలా ఎంద రెందరో రాచ్చసుల్ని సునాయాసంగా సంపుతూ వచ్చాడాయె ! ... సూడ్డానికి యేలెడంత ! అద్భుతాలేమో కొండంత !’’
‘‘ఐతే ఏమయింది ?’’
‘‘ఏమవుతుంది ? ... చచ్చుకుంటూ, వీడికే పూజలు చేశారంతా. వీనిపై పసుపూ కుంకాలు చల్లాం ! హారతులిచ్చాం ! నైవేద్యాలూ సమర్పించుకొన్నాం ! వీని సుట్టూ తిరిగి, సాష్టాంగ నమస్కారాలూ చేశాం!’’
‘‘అవునా ... గమ్మత్తుగా ఉందే !’’
‘‘అంతే ననుకున్నావా ? ... ఇంకా ఏం జరిగిందో, నీకు తెలుసా కోడలమ్మా ? ... ’’
‘‘ఏం జరిగింది అత్తమ్మా ?’’
‘‘అపుడు ఉరుములూ, మెరుపులూ, పిడుగులతో పేద్ద వాన కుర్సింది! పేద్ద గాలి రుూచింది. అంతా, చెల్లా చెదరైపోయారు. గొడ్డూ, గోదా అలమటించేయి. అప్పుడంతా ‘కృష్ణా ! కృష్ణా’ ! అంటూ అరిచేరు, మా కిష్టయ్యకి ఏమవుద్దోనని !’’
‘‘అయితే ఏమయింది ?’’
‘‘అప్పుడీ కిట్టయ్య అంతెత్తు కొండమీంచి, గభాల్న కిందికి దూకాడు, మా మధ్యలోకి ! ... దూకగానే, మేమంతా సూస్తుండగానే పహిల్వానులా కండలు పెంచి, అమాంతం పైకెత్తి, తన చిటికెన వేలుపై నిలబెట్టాడా కొండని ! ... ఆచ్చెర్యంగా అట్టాగే చూస్తుండి పోయానే్నను ! ... అందరూ, ‘పోలో’మంటూ ఆ కొండ కిందికి చేరారు ! ... నేనూ యెళ్ళాను ఏదయితే అదవుద్దని ! ... ఒక్క సినుకైనా మామీద గానీ, పసుల మీదగానీ పడితే ఒట్టు !’’.
‘‘ఎంత విచిత్రం ?’’
‘‘యిసిత్రమే మరి ! ... యింకా విను పిల్లా ! ... అప్పుడు యెవరో యింద్రుడంట ! ... పైనుండి క్రిందికి దిగాడు ! ... ఆయనెంట భార్యా, బలగమూ ఉంది. తెల్ల ఏనుగు మీంచి దిగాడు ! ...
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087