డైలీ సీరియల్

ఈశ్వరార్జునుల పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిన్నని పూర్వజన్మ వృత్తాంతం
ఇక కన్నప్ప పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తాను. విను. దేవేంద్రసుతుడైన అర్జునుడు జగత్త్రయేశ్వరుడైన మహేశ్వరుని ధ్యానించి నిరాహారియై సంపూర్ణ నియమనిష్ఠలతో ఇంద్రకీల పర్వతం మీద శత్రుసంహారార్థంగా పాశుపతాస్త్రాన్ని పొందాలని ఇంద్రాదిదేవత లాశ్చర్యపడే విధంగా తపస్సు చేసాడు. అప్పుడు మహేశ్వరుడు పరీక్షార్థంగా అర్జునుని ఆశ్రమానికి ప్రమదగణాలు ఎరుకులవారుగా, హిమగిరితనయ శబరస్ర్తిగా నాల్గువేదాలు
శునకాలుగా (కుక్కలు) మూకాసురుడు సూకరంగా (పంది) వెంటనడువగా వచ్చాడు. ఆ వచ్చిన శబరమహేశ్వరుని రూపం చాల మనోజ్ఞం ఉంది. నెమలిపురి వెంట్రుకలతో పేనిన దారచుపుట్టతో జడల్ని గట్టిగా కట్టుకొన్నాడు. చంద్రరేఖను ఆ తలపై అందమైన ఈకగా పెట్టుకొన్నాడు. నిప్పులు కక్కే త్రినేత్రాన్ని నుదుటిపై జేగురురంగు బొట్టుగా దిద్దుకొన్నాడు. చెవులో ఆభరణంగా ఉన్న సర్పాన్ని షధలతలా ధరించాడ. మెడలోని పుర్రెల దండను తామర పూల హారంగా దాల్చాడు. కట్టుకొన్న గజచర్మాన్ని శరీరం మీద వస్త్రంగా కట్టుకొన్నాడు. విషాహారుడైన శివుని మాయావరాహం హనుమద్ధ్వజుడైన అర్జునుని ఆశ్రమంలో మునీశ్వర సమూహం అలజడి చెందగా కోలాహలం చేసింది.
అప్పుడు అర్జునుడు భయపడుతున్న మునీశ్వరుల్ని కలత చెందవలదని ధైర్యం చెబుతూ అక్షయతూణీరాన్ని (తరగని అంబులపొంది) గాండీవ ధనుస్సును దాల్చి వరాహాన్ని వెన్నంటగా ధూర్జటి (శివుడు) ముందుగా ఒక బాణంతో దాన్ని కొట్టాడు. వెనువెంటనే అర్జునుడు కూడ ఒక దారుణ బాణంతో దాన్ని కొట్టాడు. ఆ రీతిగా ఆ యిరువురు ప్రయోగించిన బాణాలు ఆ వరాహానికి రెండు ప్రక్కల గ్రుచ్చుకొనగా రెండుముఖాలు కల్గిన నాట్యకత్తె వేదికపై గుండ్రంగా తిరిగినట్లు వేగంగా తిరిగింది. కిరాతార్జునుల బాణాలు రెండుప్రక్కల గుచ్చుకోగా వానిని తొలగించుకోవడానికి రెండు తలల వరాహం లాగ అది గిరగిర తిరిగింది. హరుడు- పార్థుడు పంది ఘనతను కొనియాడుతూ దాని దగ్గరకు వచ్చారు. అప్పటికే అది బాణాహతిచే కొండలాగ నేలమీద పడియుంది. దానికొఱకై భీముడు (శివుడు) భీమానుజుడు దానిని ‘నేను ముందు కొట్టాను. నేను ముందు కొట్టాను.’ అని ఇరువురు తమ తమ వీర్యపరాక్రమాల్ని ప్రదర్శిస్తు దివ్యబాణాలతో సూర్యుడు మరొక సూర్యునితో యుద్ధం చేస్తున్న రీతిగా భీకరయుద్ధాన్ని చేయసాగారు.
చెంచువాడు కదా అని అర్జునుడా శివుని లెక్కచేయక ప్రతాపిం చి యుద్ధం చేయసాగాడు. దానిని చూచి త్రిపురాంతకుడు కోపించి వీడు నన్ను ఏ మాత్రమూ లెక్కపెట్టడం లేదు. మిన్నకుండుట యుద్ధనీతి కాదు.’ అని తలంచి మహేంద్ర జాలకుని లాగ ఒక మహామాయను రచించి అర్జునుని అక్షయ తూణీరంలో ఒక్క బాణం కూడ లేకుండ చేసాడు. దానిని చూచి అర్జునులు చాల ఆశ్చర్యపడి గాండీవ ధనుస్సు నెత్తి కెంపు రంగులోని జటాజూటం వీడిపోగా, దానిని చుట్టుకొన్న శేషాహి జారిపోవగా ముక్కంటి శిరస్సుపై బలంగా మోదాడు. బలమైన ఆ వింటి దెబ్బకు ఉగ్రుడు (శివుడు) భయపడక తానూ వింటిని తీసుకొని విలాసంగా క్రీడిని (అర్జునుడు) బలం కొలది గట్టిగా మోదాడు.
ఈ విధంగా రుద్రార్జునులు ధనుస్సులతో ఒకరినొకరు తలపై ఉదరంపై (పొట్ట) గుండెలపై - భుజాలపై మోదుకొన్నారు. తదుపరి వారిరువురు భూమ్యాకాశాలు దద్దరిల్లేలా బిగ్గరగా నవ్వుతూ భుజబలాన్ని చూపుతూ మల్లయుద్ధం చేయసాగారు. తమతమ భుజాల్ని చరుచుకొంటూ పాదాలతో నేలను తన్నుతూ ఒకరినొకరు భయపడేలా ప్రవర్తిస్తూ తమ తమ శరీరాల్ని వంచు కొంటూ తొడలు చరుచుకొంటూ ఒకరి నొకరిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒకరినొకరికి తమతమ చేతుల్ని చూపి నేర్పుగా ఒకరినొకరు దొరకకుండ తప్పించుకున్నారు. ఎట్లో ఒకరినొకరి ఆక్రమించి దట్టీల్ని (కుస్తీపట్టే వారు నడుమును విబట్టుకొనే వస్త్రం) పట్టుకొని లాగుకొంటూ కొంతసేపు యుద్ధం చేసారు. దానిని విడిచి నేలపై గట్టిగా అదిమి పట్టిన కాళ్లను పెకలించి క్రింద పడగొట్టి ఒకరినొకరు పెనుగులాడారు. మరికొంతసేపు మెడ విరుగునట్లుగా తమ తమ భుజాలలోకి చిక్కించుకొని గుండెలకు నొక్కి నొక్కి పోరు సలిపారు. ఒకరి నడుముల్ని మరొకరు ఒడిసిపట్టి నేలపై సమంగాపడి తమ తమ శక్తిసామర్థ్యాలలో ఎక్కువ తక్కువలు లేకుండా ఈశ్వరార్జునులు మల్లయుద్ధం చేసారు. ఆ రీతిగా లయకాల తాండవకరుడైన శివుడు ఉప్పొంగి అర్జునునితో చేసే యుద్ధం మదగజం గున్న (చిన్న) ఏనుగుతో పోరాడుతూ ఉన్నట్లు ఉంది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512