డైలీ సీరియల్

భక్తవత్సలుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది మధ్యాంతర రహితుడు, ఆలోచనాతీతుడు, యోగుల పాలిటి మహాభాగ్యస్వరూపుడు, యమాంతకుడు అయిన శ్రీకాళహస్తీశ్వరుని సేవిస్తే మోక్షసిద్ధి బహుసుకరమే’ అని భావించి ఆ వేశ్యాసుందరులు సువర్ణముఖిలో స్నానమాడి తడి వస్త్రాల్ని విడిచి మడిబట్టలు ధరించి, జుట్టు తడిని ఒత్తుకొంటూ నడుమున ఆడే విధంగా కీలుగంటులు (జారుగా ముడిచిన వెంట్రుకల ముడి) అందంగా అమర్చుకొని సువర్ణముఖీ నదిలోని ఇసుక తినె్నలపై పద్మాసనం వేసుకొని కూర్చున్నారు.
వేశ్యలు కాళహస్తీశ్వరుని అర్చించుట
పిమ్మట వారు శాశ్వతస్వరూపుడైన శ్రీకాళహస్తీశ్వరుని తమ మనస్సులో నింపుకొని ఓం నమశ్శివాయ అను పంచాక్షరీ మంత్రంచేత శివపూజ చేసారు. తదుపరి కర్మబంధాన్ని త్రుంచే శివుని గుణాల్ని వర్ణించే స్తోత్రాల్ని పఠించారు. తదుపరి ఆ వేశ్యావనితలు తమిళకవి నత్కీరుడు రచించిన కాళహస్తిస్తుతి లోని పద్యాల్ని చదువుకొంటూ మనసున ఏ విచారాలు లేక శివాలయ ముఖద్వారానికి చేరుకొన్నారు.
వేశ్యాకన్యలకు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం
ఆ సమయంలో వారికి నవ్వు రాకపోయినా వారి ముఖపద్మాలపై చిరునవ్వు ఏర్పడ్డ సౌందర్య గుణం ప్రకాశించింది. స్వభావం చేత వారియందు మదగుణమేమీ లేకపోయినా నవనవోనే్మషంగా ఉదయించే లావణ్య సంపదల మదం మాత్రం ఉదయించినట్లు స్పష్టంగా పొంగిన వారి శరీరం తెలుపుతూ ఉంది. మెఱుగు పెట్టకపోయినా నున్నగా మెరిసి పోయే వారి శరీరపు తళతళలు తరంగాలై విరజిమ్ముతున్నాయి. వేగంగా నడవలేక పోయినా నడకలలో ఒయ్యారం కలబోసుకుంది. నిర్వికారుడు- సవికారాత్ముడు అయిన పార్వతీశ్వరుని వారు చేరుకొనవచ్చినవారు కాబట్టి ఆయనకు గల గుణగౌరవ సంపద వారికి అబ్బకుండ ఉంటుందా? భర్తకు సన్నిహితులైన భాగ్యవంతులగు వనితలు భర్తతో సమానంగా ఉంటారు కదా. శివదర్శనం కాగానే ఆ వేశ్యభామల శరీరం ఆనందం చేత పులకించి పోయింది. అది ఎలా ఉందంటే - భయమనే తొల్లిక (మొక్కలు పెల్లగించు చిన్న సాధనం)తో స్వచ్ఛమైన భావమనే నేలను పెల్లగించి అందులో భక్తి అను విత్తనాన్ని నాటి అది పెరిగి పెద్దది కావడానికి సద్వ్రతాల యందు లగ్నమైన బుద్ధి అనే నదీ జలాన్ని చల్లితే అంకురించిన మొగ్గలేమో అన్నట్లుగా కొనలు సాగుతూ పులకాంకురాలు వారి శరీరంమీద వ్యాపించి ప్రకాశించాయి. ఆ విధంగా జనించిన పులకలనే మొగల్ని చూచేందుకు ప్రయత్నించే పూతేనె యేమొ అన్నట్లుగా ఆ వేశ్యాంగనల శరీరమనే తీగనుండి స్వేదక ణాలు స్రవించాయి. కొనలు కొనలుగా సాగే వారి విశాల తనూలతకు (శరీరమనే తీగకు) నీరు చాలదేమో నన్నట్లుగా ఆ వనితల నేత్రాలనే నల్లని మేఘాలు జలధారల్ని మహా వృష్టిగా కురిసాయి. ఆ వానలో తడిసి వణికిపోతున్న విధంగా ఆ కామినులు శివుని సేవ చేయడానికి చేరిన సమయంలో వారికి వణుకుపుట్టింది. బ్రహ్మాండమనే భరణి వంటి గుహలో లోపల- బైట- ప్రతి దినమూ సర్వుల చేత భావింపబడుతూ ఉండేవాడూ, ఏ రూపమూ లేకనే మహామహిమను చూపే శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఆ పణ్యాంగనలు (వేశ్యలు) వెళ్లేటప్పుడు శరీరం దుర్గతి పాలై నశింపకుండ ఉండేందుకు కట్టిన పెండెవిబట్టుల (అడ్డంగా కట్టిన కట్లు) వలె విభూతి పెండె కట్టులు (అడ్డంగా పూసుకొన్న విభూతి) పెట్టుకొన్నారు. వెనుకకు ఒరగి జారిపోయే చీకటి ముళ్లేమో నన్న రీతిగా వారు కీలు గంట్లు (జారుగా ముడిచిన వెంట్రుకలముడి) ధరించారు. ‘ఓపాప కర్ములారా! మీరు రారాదు. అని నిలువరించే రీతిగా వారు చేసే జపాలు ప్రకాశిస్తున్నాయి. ఆత్మ పరమాత్మతో సంయోగమందగా నిశే్చష్టమై మనస్సు మిన్నకుండి పోయింది. ఆ సమయంలో జ్ఞానప్రసూనాంబా సహితుడైన శ్రీకాళహస్తీశ్వరుడు ఆ వేశ్య కన్యల జన్మ దీనత్వాన్ని తొలగించేందుకు అర్ధనారీశ్వర రూపుడై వారికి ప్రత్యక్షమయ్యాడు. మహా భాగ్యమంటే వారిదేకదా.
అర్ధనారీశ్వరుడుగా శ్రీకాళహస్తీశ్వర దర్శనం
అప్పుడు ఆ జ్ఞానప్రసూనాంబా సహిత శ్రీకాళ హస్తీశ్వర దంపతుల శిరోభాగాలపై నాట్యమాటే ఆకాశగంగానది పొరలు పొరలుగా అలలు అలలుగా ఎగసిపడుతున్న కారణంగా తునాతు నకలైన చినుకులు ఒకదానితో నొకటి హత్తుకొని ముత్యాల తలంబ్రాల సౌందర్యాన్ని వహిస్తు న్నాయి. చూపులకు తగినట్లుగా ఎడమభాగంలో కొప్పు అనే మేఘం మెరిసిపోతూ ఉంది. అందులో మరచిపోవ శక్యంకాని మెరుపుతీగ సౌందర్యాన్ని వహిస్తూ దట్టమైన రేకులు కలిగిన మొగలిపూవు ఉంది. దానినుండి మిక్కిలి సువాసనలు వెదజల్లుతూ వెలువడే సాంద్రమైన పుప్పొడి చంద్రరేఖామృత బిందువుల మనోహరత్వాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. తలపై గల ఆకాశగంగానదీ తరంగాలకు బెదురుచున్న తన (శివుని) చేతిలోని లేడి విశాలమైన బెదురు చూపుల సౌందర్యం తమకు సాటి యనగల సామ్యాన్ని (పోలికను) గుర్తించి బంధుభావనతో హారతి పట్టుచున్నవా అన్నట్లు హిమగిరితనయ వాలు చూపులు మెరుస్తూ ఉన్నాయి. పార్వతి చంద్రరేఖ వంటి తన నుదుటిమీద ఉదయించే సూర్యమండలమేమో అనే శంక కలిగించే రీతిగా గుండ్రని కుంకుమ బొట్టును ధరించింది. అది శివుని కుడి పార్శ్వభాగంలో సగం అణగిపోయింది. ఆ కారణంగా అది వేశ్యల కామమనే పాపాన్ని హరించేందుకు తెరవబడిన అర్ధనిమీలితమైన త్రినేత్ర అగ్నిజ్వాల వలె ఎఱ్ఱదనంతో ప్రకాశిస్తూ ఉంది. పార్వతి నల్లని కేశపాశపు నలుపు,
- ఇంకావుంది...

చరవాణి: 9490620512