డైలీ సీరియల్

వేషం.. భాషా శివమయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్టి ఈ యువతులు ఉలిముట్టని లింగాలై పోవడం (శివభక్తులు కావడం) చిత్రమే. బంగారు పదకాలు- మొలనూళ్లు (మొలకు ధరించే బంగారు త్రాళ్లు), భుజాలకు ధరించే వంకీలు, బంగారునాణాలు, అంగదాలు- ముంగరలు- ఉంగరాలు మణిహారాలు మొదలైనవి తెచ్చి యిస్తామని రాజకుమారులు తన చెలుల ద్వారా చెప్పించినా వీరు వారితో పల్కనైనా పల్కడం లేదు. అయ్యో! ఆ సొమ్మంతా వ్యర్థంగా పోయిందే కదా. మణి-మంత్ర-తంత్ర-విద్యాచాతుర్యం చేతనైనా మందుల చేతనయినా ఈ కమలాక్షులికి కల్గిన ఈశ్వరజ్ఞానాన్ని ఏ నెరజాణలైనా మాన్పించి వీరియందు కామవాంఛ కలిగించనట్లయితే వారికి ఒక్కకాసైనా పుచ్చుకోకుండా వీరి కనె్నరికాన్ని దానం చేస్తాను.’
ఈ రీతిగా తల్లి మాణిక్యవల్లి తలపోసి తన కుమార్తెలకు దుర్భోధచేస్తూ బాధింపసాగింది. ఆరాటంతో వారితో పోరాడుతూ ఉండేది. ఆ కన్యలు శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించుకోవాలని మదిలో తలంచారు. ఈ గ్రామంలో మమ్మల్ని ఆయన వద్దకు తీసుకుపోగల సమర్థులె వ్వరున్నారు?
శ్రీకాళహస్తికి వేశ్యాకన్యల ప్రయాణ సర్వేశ్వరుడూ- జ్ఞాన మయుడూ- సంసారసముద్రాన్ని దాటించేందుకు ఓడవంటి వాడూ- గిరిజా వల్లభుడూ అయిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వద్దకు మమ్మల్ని ఏధన్యులు తీసుకొనిపోగలరు? అని వారు పలికిన మాటల్ని వారి ఇంటి పంచలోనున్న అరుగుల మీద నిత్యమూ కూర్చుండే దొంగలు విన్నారు. రాజద్వారాల దాటి కావలివాండ్రకు ఏమరుపాటు కలిగించి పెడత్రోవలో నడు వనేల? ఈ వేశ్యాస్ర్తిలను శ్రీకాళహస్తి తీసుకుపోతామని నమ్మిస్తే వారు మన వెంట వస్తారు. సులభంగా ఎంతో ద్రవ్యం మనకు లభిస్తుంది. అని వారు తలంచి వేశ్యల్ని పిలిచి ‘మీరు మీ తల్లితో పోరడం దేనికి? శ్రీకాళహస్తిని మీకు చూపే భారం మాది మావెంటరండి. మమ్మల్ని నమ్మండి. ఈ రాత్రియే ప్రయాణం’ అని పలికారు. అప్పుడా వేశ్యాంగనలు వారిని నిజమైన జంగాలని నమ్మి ఆ దొంగలకు నమస్కారం చేసారు. వెంటనే వారు తాము వేశ్యలమని తెలియ రాకుండేందుకు జంగమస్ర్తిల వస్తధ్రారణ చేసుకొన్నారు. అందుకొరకై వారు చెంగావిరంగు గుడ్డలను నడుముకు కట్టుకొన్నారు. చెవులకి అందమైన రాగి కమ్మలు ధరించారు. రకరకాల గుడ్డపేలికలతో కుట్టిన బొంతల్ని కప్పుకొన్నారు. పవిత్రమైన విభూతిని శరీరంపై మూడు రేఖలుగా దిద్దుకొన్నారు. చంకలలో వ్రేలా డే విధంగా భిక్షాపాత్రల్ని జోలె ల్ని ధరించారు. శుభకరమైన రుద్రాక్షల్ని ఆభరణాలుగా అలంకరించుకొన్నారు. మెడ లో శివసూత్రాలతో కట్టబడిన శివలింగాన్ని పెట్టుకొన్నారు. కొంచెం మాసిన వస్త్రాల్ని కట్టుకొన్నారు. చిగురు టాకు పోలిన ఎడమ చేతితో విభూతి సం చుల్ని పట్టుకొన్నారు. ఈ విధంగా జంగమ స్ర్తిల వేషధారణతో ఆ వేశ్యాస్ర్తిలు దొంగజంగాలు ప్రోత్స హిస్తుండగా ఇంటి నుండి శ్రీకాళ హస్తీశ్వరుని దర్శ నానికై బయలుదేరారు.
అప్పుడు వారు తమ యింట నున్న ధనాన్ని మూట గట్టుకొని తమ వెంట తీసుకొని వెళ్లే ఇద్దరు ఇంటిబిడ్డలను (్ధనమిచ్చికొన్న బానిస స్ర్తిలు) తీసుకొని ఇల్లు బోసిపోయే విధంగా చేసి అర్ధరాత్రి దొంగ జంగాలను నమ్మి ఇల్లు వెడలి శివశివా అంటూ శ్రీకాళహస్తికి ప్రయాణమయ్యారు. వారా విధంగా సుమారు ఇరువది ఐదుమైళ్ల దూరం వెళ్లారు. అంతలో సూర్యోదయమయ్యింది. అయినా కొండలెక్కుతూ దిగుతూ వారివెంట నడువ సా గారు. ఆ వేశ్యాంగనలు దగ్గ ర దారుల్లో కుంభ కోణానికి చేరు కొన్నారు. అచట చంద్ర శేఖరుడైన కుంభకో ణేశ్వరుని వారు సేవించుకొన్నారు. అక్కడ నుండి వారు తాండవనృత్య సమయం లో కాలి నుండి జారిపడిన అందె కలవాడు, హరి-బ్రహ్మల మనస్సులలో నివసించేవాడూ, శివకామ సుందరిని ఎన్నడూ వీడనివాడూ, పతంజలి- వ్యాఘ్ర పాత్తు అను మునీశ్వరుల పూజాఫలంగా అవతరించిన వాడూ, కాంచనసభానిలయుడూ- కలి పాపఘాతకుడూ, ప్రళయ కాలాన చేయు తాండవ నృత్యం చేత చలించే త్రినేత్రం కలవాడు- జితమన్మథాకారుడైన చిందంబరేశ్వరుణ్ని దర్శించుకొన్నారు.
పిమ్మట ఆ వేశ్యామణులు జలచరాలు ఎగిరిపడుతూ ఉండటం చేత పెద్దగా ధ్వనిస్తూ ఉన్నదీ, ఎగిరిపడే కెరటాలనే దొంగ్ఱచేత హరింపబడిన ఆకాశంలోని నల్లదనాన్ని కలిగి ఉన్నదీ అయిన మహాసముద్రాన్ని సేవించు కొన్నారు. అది మహా అల్లకల్లోలంగా ఉంది. వేగంగా ఒడ్డుకు ఒరుసుకొని వచ్చి తిరిగి వెనుకకు మరలే కెరటాలతో, ఆ అలలు ఎదురుగా వచ్చు కెరటాన్ని ఢీకొనడం వలన ఆ సముద్రం గంభీరంగా ఘోషిస్తూ ఉంది. నింగిలోని మేఘాలు గుంపులు గుంపులుగా దిగి వచ్చి సముద్రజలాల్ని త్రాగే ధ్వని భీకరంగా ఉంది. దట్టంగా మబ్బులు క్రమ్మి పెనుగాలులతో అంతకంతకు ఎగసిపడే ఆ సముద్రం దిక్కులు పిక్కటిల్లే మహాధ్వనిని కల్పిస్తూంది. ప్రతిదినం ఉదయ సాయంకాల సంధ్యా సమయాల మధ్యకాలంలో పోటు పొడు స్తూ (పొంగుట) వెంటనే విచ్చిపోతున్న మహాజలధ్వనితో మారుమ్రోగుతూ ఉంది. ఈ రీతిగా దశదిశల సముద్రం ప్రతి ధ్వనిస్తున్న కారణంగా చుట్టూ ఉన్న చక్రవాళ పర్వత గుహలలోని సింహాలకు శరభాలకు పెద్దపులులకు భయాన్ని కలిగిస్తూ ఉంది. అంతేకాదు, ఆ సముద్రం నిరంతరం కెరటాలు పరస్పరం ఢీకొనడం చేత వానినుండి లేచిన నీటి తుంపరలు శ్రేష్ఠమైన మరుద్దేవతలకు సమృద్ధిగా సమర్పించే ముత్యాల రాశియేమో అన్నట్లు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతమాత్రమే కాదు రత్నాలతో, గజేంద్ర రత్నంతో, (ఐరా వతం) వృక్షరత్నాలతో, (కల్ప వృక్షాలతో) వధూరత్నంతో (లక్ష్మీదేవితో), ధేనురత్నాలతో (కామధేనువులు), గ్లౌరత్నంతో (చంద్ర రత్నంతో), అమృతరత్నంతో (అమృతం), హరిరత్నంతో (ఇంద్రుని గుఱ్ఱం ఉచ్చైశ్శ్రవము), ఇలా అనేక రత్నాలతో ఆ సముద్రం రత్నాకరమనే పేరును సార్థకం చేసుకొంటూంది.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512