డైలీ సీరియల్

పంచాక్షరే పరవౌషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేకువ జామున విటుని చేతినుండి తాంబూలాన్ని తీసుకోరాదు. ఒకవేళ తీసుకుంటే అది నోటిలో ఊరేజలాన్ని ఉమ్మి వేయాలి. కారణం ఎవరు ఎవరికైనా మందుపెట్టే సమయమదే కాబట్టి.
తగవు పెట్టుకొని చూచేచూపులే తొలకరి మెఱుపులుగా, బెదిరింపు మాటలే గర్జనలుగా, కపటపు కన్నీళ్లే వర్షంగా బహుభంగుల అన్యాపదేశంగా వేశ్యలు వివిధరీతులుగా ఉండే మేఘాల వంటివాళ్లు. వారు తమపై గల మోహం చేత విటుల మనస్సులలో మొలకెత్తే వ్యామోహమనే మొలకల్ని ఒడుపుగ చేజిక్కించుకోక మిన్నకుంటే వేశ్యలకు ధనమెలా లభిస్తుంది?
తమ భార్యలపై మనస్సులలో ఉన్న భర్తల ప్రేమానురాగాల్ని వేశ్యలు మన్మథుని బాణాల వంటి తమ చూపులనే అగ్గిలో చిక్కుకొని రగిలిపోయేలా చేయాలి. తమ చిరునవ్వనే మలయపు కొండగాలికి రగిలి పొగలు ఎగచిమ్మేలా అగ్గి చేయాలి. దానిపై తీపి మాటలనే నేతిని పోస్తూ అది మండేలా మాయ అనే కట్టెతో ఎగసన త్రోయాలి. పిమ్మట ప్రేమ అనే చిన్న చిన్న తుంపరలతో దానిని పూర్తిగా ఆర్పివేయాలి. పద్మముఖులార! మీ గానమాధుర్యాన్ని ఆలకించాలని రసికులెందరో వచ్చారు. మీ శివభక్తి పాడుగాను. శివభక్తిని మాని పాటలు పాడండి. జాణలెందరో మీ విలాసాల్ని చూసేందుకు వచ్చారు. వానిని చూపండి. విటులెందరో మీ తోడ మాటాడవచ్చారు. మీ శివభక్తి ఎక్కడికి పోదు. వారితో మాటలాడండి. మహారాజులెంతో ధనమీయడానికి వచ్చారు. మీ శివభక్తి ఏమీ చెడిపోదు. వారిని ఆదరించండి. ధనముంటే శివభక్తుల్ని పూజించవచ్చు. ఈశ్వరుడికి సకలోపచారాలు చేయవచ్చు. సంపద కలిగిన మీ సరివారిలో తలయెత్తుకొని తిరుగనూ వచ్చు.’ ఈ విధంగా మెరుపుతీగల వంటి తన కుమార్తెలకు మాణిక్యవల్లి వేశ్యలనీతి- రీతుల్ని వివరించి చెప్పింది. అయినా అది వారి మనస్సులకు అప్రియమై తమ తల్లితో ఇలా అన్నారు.
వేశ్య లిరువురు వేశ్యాధర్మాల్ని నిరసించుట
‘తల్లీ! శ్రీకాళహస్తీశ్వరుని పాదపద్మారాధనయే కులధర్మం. శివలోకంలో వ్యాపించియుండే బ్రహ్మానందమయుడైన శివస్మృతియే మాకు ఆనందానుభవం. మణులు- మంత్రాలు- ఔషధాలు ప్రయోగించడం ద్వారా కలిగే శక్తితో విటుల్ని కామవశుల్ని చేసి వారినుండి మణులు- ఆభరణాలు తీసుకోవాలని మాకు బుద్ధిపుట్టడం లేదమ్మా. మాకు మణి రుద్రాక్షయే. ఓం నమశ్శివాయ అను పంచాక్షరియే మాకు మంత్రం. శివవిభూతియే మాకు ఔషధం. దక్షిణ కైలాసనాథుడైన శ్రీకాళహ స్తీశ్వరుడే మాకు భర్త. భక్తియే మాకు సర్వసంపదలు.
శివుని పరిపూర్ణంగా కోరుకొన్న మనస్సు మన్మథ వశమై విటుల నాశ పడు తుందా? పరమేశ్వరుని గాథల్ని వినే చెవులు తార్పుడు కత్తెలు చెప్పే మాటల్ని వింటాయా? మహాదేవుని దర్శింపకోరే కళ్లు ఇతర సామాన్యరూపాల్ని చూడాలని కోరుకొంటాయా? మోక్షపురుషుని ప్రేమతో కూడ దలంచిన ఈ శరీరం కాము కుల్ని కూడాలని ఇష్టపడుతుందా? సంసార నాశకుడైన శ్రీకాళహస్తీశ్వరుని స్తుతించే నాలుక నీతి తప్పి మనుష్యుల్ని స్తుతించగలదా? తల్లీ! ఈ వేశ్యాధర్మాలు మాకు చెప్పవద్దు.
ఒకనిని ఒక తలుపుమూల, మరొకరిని తల్లి యింటిలో, వేరొక్కని చెలికత్తె యింటిలో ఇంకొకరిని చెల్లెలి యింటిలో, ఉంచి మరొకరితో చుట్టం వలె వానితో స్వేచ్ఛగా చౌర్యరతి చేసి ఆరీతిగా ఒకరికి తెలియక మరొకరితో రతిక్రీడలాడటం అమ్మా! నేరమే కదా! దారుకావనంలో మునీంద్రుల భార్యలకు, భక్త్భల్లాణుని భార్యకు, మోక్షకాంతకు, భుజంగుడై (విటుడై) ప్రవర్తించిన ఆ భుజంగ (పాము) భూషణుడే మాకు భుజంగుడు (విటుడు) కాని నిస్సారమైన మానవభుజంగుడు మాకు భుజంగుడు కాదు. మగువకు తన అర్ధశరీరాన్ని పంచి యిచ్చిన మగడు (అర్ధనారీశ్వరుడు) మోక్షలక్ష్మికి మగడు, మాయా స్వరూపిణికి మగడు, మగదేవతలకు సహితం మగడు అయిన వాడే మాకు మగడు కాక మనుష్యుడు మాకు మగడు కాగలడా? అమృతం త్రాగే నాలుక రుచికరమైనదని తేనెను త్రాగుతుందా? ముంగిటిలో కల్పవృక్షమునే నిలుపుకొన్నవాడు రాజుల్ని ఆశ్రయిస్తాడా? మునిజనులు మహాభాగ్యంగా తలంచే అనాదితత్త్వమైన శ్రీకాళహస్తి దైవాన్ని సేవించే మనస్సు సామాన్యమైన వేశ్యాజనమత్త సౌఖ్యాన్ని కోరుకొంటుందా?’ ఈ రీతిగా తన ఉపదేశాన్ని చెవిలో కూడ వేసుకోక మాట లాడిన కూతుళ్లను చూచి మాణిక్యవల్లి చిన్న బోయి మనస్సులో ఇలా అనుకొంది.
కూతుళ్ల శివభక్తిని చూచి వేశ్యామాత విచారించుట
ఈ విలాసగృహాలు, ఈ కస్తూరి- ఈ పచ్చకర్పూరం, ఈ మంచి గంధం, ఈ కాశ్మీర కుంకుమ పువ్వు, ఈ చీనాంబరాలు, రత్నాలు పొదిగిన ఈ బంగారు ఆభరణాలు, ఈ తాంబూల కరండ (్భరిణెలు) రాశి, ఈ తూగుమంచాలు; ఇవన్నింటిని ఈ కనె్నల కొఱకే సమకూర్చాను. కాని వీనిని వీరు కనె్నత్తి కూడ చూడటం లేదు. ఏమి చేయాలి? ఈ కనె్నల కన్నులు మన్మథుడు ఒకసారి కూడ ప్రయోగింపని పుష్పబాణాలే. వీరి స్తనాలు సంకెళ్లులేని మన్మథుని మత్త్భే కుంభస్థలాలు. వీరి అందమైన నవ్వు కాఱడవిలో వ్యాపించిన వెనె్నల (అంటే ఏ వ్యక్తిని తాకని నవ్వులని అర్థం) వీరి శరీరకాంతి కాల్చిన బంగారుకాంతియే. ఇట్టి ఈ భామలు విటులకు అనుభవయోగ్యులు కదా.
అందమైన వీరికళ్లు అంటని మన్మదబాణాలు. మోవులు (పెదవులు) రాచిల్కలు ముట్టని పరిపక్వమైన దొండపళ్లు. చన్నులు మిండ తుమ్మెదలు ముట్టని పూలగుత్తులు. వీరి ముఖాలు రాహువు కోర తగలని చంద్రులే.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512