డైలీ సీరియల్

వృత్తి ధర్మమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ స్థితిలో వారు నత్కీరుడు రచించిన నూరు పద్యాలను కంఠస్థం చేసి నిత్యవ్రతంగా చదివే వారు. శ్రీకాళహస్తీశ్వరుడే తమకు భర్తయని నిశ్చయబుద్ధితో ప్రవర్తించే వారు. వారి స్థితిని చూచి మదనవిద్యా ప్రవీణురాలయిన తల్లి మాణిక్యవల్లి కుమార్తెల వద్దకు వచ్చి యిలా అంది.
మాణిక్యవల్లి కూతుళ్లకు వేశ్యాధర్మాల్ని ఉపదేశించుట
‘మదనశాస్త్ర కోవిదురాలనగు నాకు ఇన్నాళ్లకొక దిక్కు ఏర్పడిందని తోడి వెలయాండ్రందరు నన్ను ఎంతగానో పొగిడారు. మీరు పుట్టగానే నాకొక ముద్దు మురిపం ఏర్పడింది. కాని మన్మథళా మర్మాలు తెలిసిన వేశ్యాధర్మంలో జన్మించిన మీరు కులధర్మాన్ని నిస్సారం చేసి దానిని విడిచిపోవడం తగునా?
నడుచుట, మాటలాడుట, చదువుట, ఆడుట ఎప్పుడు నేర్చుకుంటారో, వేశ్య లందరి లాగ విటుల్ని ఎప్పుడు పొందుతారో అని ఎదురుచూస్తుండగా మిమ్మల్ని పెంచిన దానికి ఫలితంగా ఈ విధంగా దుఃఖం కలిగించడం న్యాయమా? అరువది నాలుగు కళలు, ప్రమాణాలు (ఒట్టులు), హృదయా- కర్షకమయిన చూపులు, పద్మని-హస్తిని- శంఖిని-చిత్తిని అనే చతుర్విధ స్ర్తిజాతి మార్గాల్ని, వివిధ రతిబంధాల్ని, కౌగిలింతల్ని, స్తంభం- ప్రళయం -స్వేదము -వైస్వర్యం- రోమాంచం- కంపం- వివర్ణత అనే సాత్వికభావాల్ని, చూచుట- చింతించుట- తలంచుట- గుణాల్ని పొగుడుట- అయిష్టత- తాపం- సిగ్గువిడుచుట- ఉన్మాదం- మూర్ఛ-్ధన్యత అనే శృంగార దశావస్థల్ని తెలిసికొని వేశ్యాకులాన్ని ఉద్ధరించాలి.
జిడ్డు నాలుకను, జలం తామరరేకుల్ని, బురద కుమ్మరిపురుగును, గచ్చకాయను బూడిద అంటని విధంగా విటుకాండ్రతో కలిసి కూడ కలియని విధంగా ఉండాలి. జిగురున పడిన రామ చిలుకలా, సంపంగి పూలవాసనకు చిక్కిన గండుతుమ్మెదలా, తేనెలోన పడిన ఈగలా, మోహాతిశయం చేత విటుడు తన బిగికౌగిలిలో చిక్కకుంటె వట్టి మాటలకు కోరినంత డబ్బు ఇస్తాడా? మణులు- మంత్రాలు - తంత్రాలు, మందులు పెట్టడం, మాయలు చేయడం, సరసంగా మాట్లాడటం, కపటమైన తత్తరపాటులు, సహజంగా కాక తెచ్చుకొన్న ఏడుపులు, ఉబుసుపోక మాటలు, అసత్యమైన ఒట్టులు, నిదానమైన నడతలు, జిత్తులు, కపటమైన కోపాలు, ఊపేక్షచేస్తూ ఆశకలిగి యుండటం, వినయం, భయం, బలాత్కారం, స్నేహం, వాగ్దానాలు, ఆజ్ఞాపించడం, తిట్లు, కొట్టడాలు, మొండిగా ఉండటం, సంజ్ఞలు, ప్రియాలు, మెప్పులు, భేదాభిప్రాయాలు, తగవులాడటం ఇవన్నీ కూడ వేశ్యాస్ర్తిలకు సహజంగా వచ్చే గుణాలు.
తనపై మరులుగొన్న విటుడిని వంచించి ఆతని చెలికానికి ప్రియాన్ని తెలిపితే అట్టి వారాంగనపై వారికి ప్రేమ ఎన్నటికి తరుగదు. వారామెకు ధనాన్ని అధికంగా ఇస్తారు. ఇందుకు సందేహం లేదు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512