డైలీ సీరియల్

చిదానందస్వరూపా!శివా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్వాసాంతము
మునిజనుల మనస్సులనే పక్షుల్ని వశపరచుకొనే వల వంటివాడా! సావయవమైన శరీరం లేనివాడా! ప్రపంచంతో సంబంధ ముండియు లేనివాడా! పంచభూతాల యందు సమష్టిగా ఉండే అగణ్యమైన ఆత్మస్వరూపా! ప్రఖ్యాతమైన తత్త్వస్వరూపా! పరమార్థస్వరూపా! స్వీయమైన హర తేజస్సుచే పుక్కిలింపబడిన బ్రహ్మాండ రచన చేసినవాడా! సంసారమనే సర్పం పాలిటి గరుత్మంతుడైన వాడా! శ్రీకాళహస్తీశ్వరా !
బంగారు పర్వతం (మేరువు) విల్లుగా కలవాడా! బ్రహ్మ విష్ణువుల చేత పూజింపబడు పాద పద్మాలు కలవాడా! సువర్ణముఖరీ నదియందు పుట్టే బంగారు కమలాల సువాసనలకు పరవశుడవైన మనస్సు కలవాడా! శ్రీకాళహస్తీశ్వరా!
మునీంద్రుల వౌనముద్రచే వ్యాఖ్యానింపబడు వాడా! సామాన్యుల వలె పూర్వజన్మ వాసనలు లేని పురాణ స్వరూపా! నిత్యసత్య పరమాత్మస్వరూపా! భక్తుల కష్టాలనే పద్మాల పాలిటి మేఘం వంటివాడా! కారుణ్యామృత వృష్టి కురిపించే ఘనమైన దయామయమేఘమా! మన్మథుడనే అగ్నిని ఆర్పివేసే ఉదకస్వరూపా! వనాలకు రాజయిన నాథు నాథుడను వానికి కుమారుడైన తిన్ననిని ఏలుకొన్న ప్రభువా ! పుత్రహత్యాది పాపాలనుండి బ్రహ్మను విముక్తుణ్ణి చేసిన పావనచరితుడా! శ్రీకాళహస్తీశ్వరా!

చతుర్థాశ్వాసం
ఓ నీలకంఠ! నాగవిభూషణ ! అధములైన శివేతర మతస్థుల వ్యాఖ్యానాల కోలాహలానికి దూరంగా నిలిచేవాడా! చిదానందస్వరూపా! మృత్యుంజయా! శ్రీకాళహస్తీశ! శివా!
యాదవరాజు ఎడల కరుణా కటాక్షాల్ని నెరపి నీవే స్వయంగా చెప్పిన నీ స్వీయగాధను భక్తజనులకు చెవుల పండువగునట్లుగా వినిపింతును. ఆలకించుడు.
మధురాపుర వర్ణన
అది భారతదేశమోక్ష నగరాలలో మధురానగరం. అచట గల రాజులు భయంకర యుద్ధాలలో విజయమనే రతీదేవికి ప్రియమైన మన్మథులే. ఆ నగరంలోని యువతులు కోటకొమ్మల నెక్కి దేవతా వృక్షాల పూలు కోస్తుంటారు. అందలి అగడ్త, సర్పరాజులు పాతాళలోకం నుండి మలయానిలాన్ని అనుభవించడానికి నిత్యం వచ్చే మహాద్వారం. ప్రకాశమానమైన వజ్రకాంతులతో ప్రకాశించే రతనాల మేడల మహాకాంతి పుంజం ఆ సూర్యకాంతికే విరోధిగా ఉంటుంది. ఆ రీతిగా రాజులు పౌరుషం చేత, కోటకొమ్మల ఔన్నత్యం చేత (ఎక్కువ ఎత్తుగా ఉండుట), అగడ్తలు నిమ్నతా (మిక్కిలి లోతుగా ఉండుట) వైభవం చేత, మేడలు భా (తెల్లని ప్రకాశం) చేత ప్రజలు సర్వ సంపదల చేత (విభూతి) వైభవం కలిగి ఉన్న ఆ మధుర మహానగరంలో సాక్షాత్ శివుడే అయిన చొక్కనాథుడు మీనాక్షీదేవితో కూడి స్థిరనివాసముం టున్నాడు.
అంతేకాదు. లక్ష్మీదేవికి కూడ, ఆ మధుర పుట్టినిల్లయిన సముద్రం. ఆ ఊరిలో గల వివిధ గృహాలు, ఆమె నివసించు క్రీడాగృహాలు. అచటగల స్ర్తి సమాజమంతా లక్ష్మికి ప్రియ సుఖురాండ్రే. రథాలు- గుఱ్ఱాలు- ఏనుగులు అన్నీ ఆమె క్రీడావస్తువులే, రాజమార్గాలన్నీ ఆమెకు నాట్యరంగాలే. పలికే మాటలన్నీ వేదశాస్తవ్రిషయాలే.
ఆ మధురానగరం భూమండలానికే కంఠాభరణం. రాజవంశం ఆ నగరానికి శిరోభూషణం. రాజకుమారులు దానికి ప్రాణతుల్యం. శృంగార స్వరూపిణులైన ఆ పట్టణం లోని వేశ్యావాటికి ఆ మధురానగర పట్టణానికి ఆత్మవంటివారయిన రాజ పుత్రుల మదనతాపాన్ని హరించే మేఘం వంటిది. ఆ నగరమందలి వనితా మణులు చక్కదనానికి చిహ్నమైనవారు.
మాణిక్యవల్లికి శివభక్తురాండ్రైన ఇద్దరు కుమార్తెలు కలుగుట
వేశ్యావంశాంబుధిలో జన్మించిన మాణిక్యమో అన్నట్లు మన్మథశాస్త్రాలలో నిష్ణాతురాలైన మాణిక్యవల్లి అను ఒక వనిత ఆ మధురానగరంలో ప్రసిద్ధురాలై ఉంది. ఆమె కొంతకాలానికి దైవ యోగం చేత గర్భవతి అయింది. క్రమంగా వేవిళ్లు కలిగాయి. నోటికి అరుచి ఏర్పడింది. ముఖంలో తెల్లదనం వ్యాపించింది. ఓర్పు సన్నగిల్లింది. చూపులలో మాంద్యం సంభవించింది. పొట్ట లావె క్కింది. ఆ పిమ్మట విటులతో సంగమం దూరమైపోయింది.
నెలలు నిండిన పిమ్మట ఆ మాణిక్య వల్లికి శివభక్తి ఆకారం ధరించిందేమో నన్న రీతిగా అందమైన ఇద్దరు ఆడశిశువులు జన్మించారు. రాజకుమారులు వనవతలైన పిమ్మట ఈ శిశువుల్ని చూస్తే వారి మనఃపద్మాలు తప్పక వికసిస్తాయి అని ఆ తల్లి మాణిక్యవల్లి తలంచి చాల సంతోషపడింది. తలకు నూనె పెట్టుకొని, పుక్కిట తాంబూలాన్ని వేసికొని, కంటికి కాటుక పెట్టుకొని, మెడలో వసపూసల్ని ధరించి, పాలుబ్బివచ్చు స్తనాలు కలిగి, ఒంటి వేలితో భస్మాన్ని పూసుకొని, జిడ్డైన వస్త్రాన్ని ధరిస్తూ ఆ మాణిక్యవల్లి క్రమంగా బాలింతతనాన్ని ఎలాగో గడిపింది.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512