డైలీ సీరియల్
రాలిపోయేది అధర్మమే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పిమ్మట వారు ఆకాశ మార్గంలో నిలువకుండ దానిని ఖండిస్తూ అనేక బాణాలను ప్రయోగించాడు.
దానితో ఆ అసురవీరులు యుద్ధంలో తూలిపోయి కూడ భయపడక యుద్ధవాంఛతో నింగిలో నుండే మేఘాల వలె ప్రకాశిస్తూ ఉగ్రునిపై రాళ్ల వాన కురిపించారు. అప్పుడాతడు రోషంతో తీవ్రమైన వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి వారినందరిని చెదరగొట్టి శాంత చిత్తుడయ్యాడు. ఆ విధంగా సింహ వాహనుడైన ఉగ్రుని చేత ముప్పది వేల మంది రాక్షసు లు యుద్ధంలో మరణింపగా మానవుల ప్రాణాలు గుండె గూటిలోనికి చేరాయి. సర్పజాతి సుఖంగా నిద్రపోయింది. దేవతలకు సంతోషం అంబర మంటింది. బ్రాహ్మణులు తృప్తిపడ్డారు. భూదేవి సుస్థిరత్వాన్ని వహించింది. మునుల సమూహం స్వేచ్ఛగా సంచరించింది.
యుద్ధ్భూమి వర్ణన
వాణీపతి అయిన బ్రహ్మ కుమారుడగు ఉగ్రుడు యుద్ధ్భూమిని ఒక్కసారి తేరిపార చూచాడు. అది చాల జుగుప్సాకరమై భయంకరంగా కనబడింది. ఆ మహారణ స్థలంలో నేలకూలిన ఏనుగుల మొండాలు కట్టలు కట్టలుగా పడ్డాయి. అందుండి కారిన రక్తం ప్రవహించి ఒకచోట మడుగుగా ఏర్పడింది. శాకినీ డాకినుల పిల్లలు యుద్ధ భూమిలోని ఆ మడుగులలో గడ్డిపోచల వలె తేలియాడే బాణా ల కట్టెల్ని సేకరించి తెప్పలుగా కట్టి ఆడేందుకు ఉత్సాహ పడుతున్నారు. వారిని చూచి సంతోషపడి ముద్దాడుతూ శాకినీ డాకినులు చేసే కోలాహలం భీభత్సంగా ఆ యుద్ధ్భూమి అంతట కనిపిస్తూంది.
సమరస్థలంలోని పచ్చిమాంసాన్ని విచ్చలవిడిగా తిన్న భూతభేతాళ బాలికా సమూహానికి చివరకు వాని యెడల వెగటు పుట్టింది. అప్పుడచట గల శవాల మీద నున్న ఆభరణా లు రాలి అందలి పద్మ రాగమణులు చిందరవందరగా నేల రాలాయి. వానిని చూచి నిప్పులని భ్రమపడి మాంసకండల్ని పొడుగైన కట్టెలకు గుచ్చి తెచ్చి కరకుట్ల వలె కాల్చుటకు తిరుగుతూ చేసే వారి కోలాహలంతో ఆ ప్రదేశమంతా భీభత్సంగా ఉంది.
చివర గుండు గల బాణాల దెబ్బలకు రాక్షసుల కిరీటాలలోని వజ్రాలు - ముత్యాలు పగిలి పిండిగా అయిపో యాయి. దానిని చూచి పిశాచస్ర్తిలు ఉప్పుగా భ్రమపడ్డాయి. అవి సహజంగా ఉప్పు చవి మరిగినట్టివి. అందుచేత యుద్ద్భూమిలోని మాంసఖండాలు పాడుకాకుండా ఉండేం దుకు వాని నాపొడిలో అద్దితూ ఉప్పుకండలుగా పెడుతూ అవి చాలా కోలాహలం చేస్తు న్నాయి.
ఇక పిల్ల పిశాచాల కలకలం మరొకరకంగా ఉంది. సమర భూమిలో మరణించిన రాక్షస వీరుల మట్టిలో కలిసిన మెదడును, బాణపు దెబ్బలకు నలిగి ముద్దయిన మాంసాన్ని; ప్రేగుల పోగుల్ని ఒకచోట కూడ బెట్టి వానిని గుట్టలు గుట్టలుగా కట్టాయి. అవి వానిని మోయ జాలక ఏనుగుల తుండాలతో వాని మధ్య ఒక తూముగా నిర్మించాయి. అవి ఆవిధంగా చేయడం వల్ల చాల అలసిపోయి ముఖాల మీద నుండి చెమటలు కారుచుండగ రక్తపు మడుగులు నిర్మించి క్రీడించే పిల్లపిశాచాల పిల్లల నవ్వుల సందడి అంతట వ్యాపించింది.
అచట ఆడదయ్యాల విలాసం మరోవిధంగా ఉంది. యుద్ధ్భూమిలో కూలిపోయిన ఏనుగుల కళేబరాల్ని కాకులు - గుడ్లగూబలు - నక్కలు - అడవి కుక్కలు చీల్చి రంధ్రాలు చేసాయి. వానిలో దాగి ఆవలి నుండి ఈవలకు వస్తూ దాగుడుమూతలాడే ఆడదయ్యాల సయ్యాటల కయ్యాలతో ఆ ప్రదేశం మారు మ్రోగుతూ ఉంది.
అట్లే విజయం తప్పక సిద్ధిస్తుందనే ఆశ చేత పరవశత్వంతో ముందుకుపోతూ అసురసింహాలు నేలకూలి పోయాయి. ఆ కళేబరాలను చూచి వారు సజీవంగా ఉన్నా యేమో ననే శంకతో జంకి నక్కల సమూహం వెనుక కాళ్లతో నేలను గోకాయి. దాని వలన రేగిన దుమ్ములో కదలక నిలిచి శవాల మాంసాల్ని పంచుకొనే నక్కగుంపుల ఊళలతో ఆ ప్రదేశం మారుమ్రోగుతూ ఉంది.
అంతే కాక ఆ రణభూమి మరణించిన వీరుల రథాలతో నిండిపోయింది. తునాతునకలైన శరీరావయవాలతో గుఱా ఱలు అచట పడియున్నాయి. శరీరమంత గ్రుచ్చుకొన్న బాణాలతో రథసారథులు నేలకూలియున్నారు. ధనుస్సులు ముక్క ముక్కలై పడియున్నాయి. చిల్లులు పడ్డ జెండాలంతట చెల్లా చెదురుగా పడియున్నాయి. తెగిన సూత్రాలు కల కవచాలు చిందరవందరగా ఉన్నాయి. దుమ్ము కొట్టిన శూలాలెన్నో అంతట పడియున్నాయి. అగ్రభాగాలు విరిగిపోయిన కిరీటాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. విరుగ గొట్టబడి వెదురు కర్రలతో వ్రేలాడే తెల్లగొడుగులు అచట పడియున్నాయి. మొనలు విరుగ గొట్టబడిన బాణాలు నేలపై పడియున్నాయి. ముక్కముక్కలైన ఏనుగులు కుప్పలు కుప్పలుగా పడి- యున్నాయి. రక్తంలో మునిగిన మావటి వాండ్రెందరో మూలు గుతూ ఉన్నారు. యమకింకరులకు వశమైన గుఱ్ఱపురౌతులు ఎందరో అచట ఉన్నారు.
అటువంటి యుద్ధ్భూమిని చూస్తూ ఉగ్రుడు బ్రహ్మవద్దకు పోయి తాను ముప్పదివేల రాక్షసులను జయించిన విధానాన్ని విన్నవించి నిలిచాడు. అప్పుడు బ్రహ్మ పుత్రవధ విధానాన్ని వినడం వలన దుఃఖంతో మండిపోతూ ఉగ్రుణ్ణి చూచాడు. ఆ చూపునకు ఉగ్రుడు భస్మమై పోయాడు. ఆ దృశ్యాన్ని చూచి బ్రహ్మ తనకు పుత్రవిహీనత మరియు బ్రహ్మహత్యాదోషం కూడ ప్రాప్తించాయి అని తనలో విచారించాడు.
కుమారుని కొఱకై బ్రహ్మ తపస్సు
పిమ్మట దయావీక్షణుడు - దేవదేవుడు - దక్షిణకైలాసవాసి భక్తజనకల్పవృక్షం అయిన హిమగిరి కన్యకావిభుని సేవింప కుంటె ఈ విధమైన పుత్రహీనతా దోషమనే సముద్రంలో పడిపోకుండ సుఖంగా ఉండగలనా? అని బ్రహ్మ తర్కించు కొని హంసలను కట్టిన రథంపై తన భార్య సరస్వతీదేవితో కూడి కూర్చుని తలంచినంతనే మోక్షపదవీ రసాలమూ (తియ్య మామిడి చెట్టు) ఆపదలనే అరణ్యాలకు దావాగ్ని, పంచముఖ శివునకు నివాసానుకూలమూ అయిన దక్షిణ కైలాస పర్వతాన్ని చేరుకొని దర్శించాడు.
- ఇంకావుంది...