డైలీ సీరియల్

త్రిపురాసుర సంహారం చేస్తానని ఆశ్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు త్రిపురాలకూ వెళ్ళి అక్కడి ప్రజలలో భక్తిని తగ్గించి శృంగారానికి బానిసలయేట్లు చేయి. వేదాలలో లేని ఐహిక విషయాలకు వారు ప్రాముఖ్యత నిచ్చే విధంగా ఆకర్షణీయంగా భాషణాలు చేయి. ఆస్తికులైన ఆ ప్రజలూ, రాజులూ, నాస్తికులూ ధర్మ నిరసనులూ అయేట్లు చేయటమే లక్ష్యంగా పెట్టుకో. ఆ స్థితిలో వారిని నా సహకారంతో శంకరుడు సంహరిస్తాడు.’’ అని అతనికి విష్ణువు బోధించి పంపాడు.
అరిహనుడు ఆ విధంగానే చేసి మెల్లమెల్లగా వారిని యజ్ఞ యాగాదులు మానివేసి ఐహిక వాంఛలకు లోనయేట్లు చేసాడు. త్రిపురాసురుల శక్తి సన్నగిల్లింది.
ఈలోగా దేవతలు శివ పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవ నాదంతో కలిపి, కోటిసార్లు ‘‘ఓం నమశ్శివాయ’’ జపం చేసారు. ఈశ్వరుడు ప్రసన్నమై దర్శనమిచ్చి దేవతలకు తాను త్రిపురాసుర సంహారం చేస్తానని ఆశ్వాసన ఇచ్చాడు.
ఒక శుభ ముహూర్తాన విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన రథాన్ని ఆరోహించి తన పాశుపతాస్త్రంతో త్రిపురాసురుల మూడు కోటలూ ఒకేసారి దగ్ధం చేసాడు ఈశ్వరుడు. అసురులు ముగ్గురూ క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించారు. కానీ దేవతలకిచ్చిన వాగ్ధానంవలన ఆ పని చేయలేనని తెలిపి మరణానంతరం వారు తిరిగి జన్మించి తన గణంలో వసిస్తారని వారికి వరమిచ్చి వారిని వరుణాస్త్రంతో సంహరించాడు శంకరుడు. అప్పట్నుండీ ఆయన ‘త్రిపురాంతకుడ’’ని పిలువబడ్డాడు.
జలంధర వధ
సూత మహర్షి శౌనకాదులకు జలంధర వధ గూర్చి తెలుపసాగారు. ఒకప్పుడు దేవదానవ యుద్ధం జరిగింది. ఈ పోరాటాన్ని ఆరంభించిన వాడు జలంధరుడనే రాక్షసరాజు. క్షీరసాగర మధనాన్ని దేవతలూ, దానవులూ కలిసే చేసినా, అందులో నుండి ఉద్భవించిన అమృతాన్ని విష్ణువు దేవతలకు మాత్రమే దక్కేటట్లు చేసిన వైనాన్ని భృగువు ద్వారా విన్న జలంధరుడికి ఆగ్రహం కలిగింది. అంతేకాక ఆ సమయాన అసురుడైన రాహువు అమృతాన్ని సేవించగా అది గమనించిన విష్ణుమూర్తి అతడి తలను ఖండించిన సంగతి కూడా అతడిని ఉద్రిక్త పరచింది. సముద్రంలో నుండి వెలువడిన సంపదలో చాలా భాగం ఇంద్రుడికి దక్కటంతో దానిలో తమ వంతు ఇచ్చేయమని ఇంద్రుడికి వర్తమానం పంపాడు జలంధరుడు.
ఇంద్రుడు తాను దుర్వాస శాపంతో తన ఐశ్వర్యాన్ని కోల్పోయి విష్ణుమూర్తి సహాయంతో సాగర మథనం చేసి తిరిగి సంపాదించుకున్న తన పూర్వపు సంపద కనుక దానిని ఇవ్వ నిరాకరించటంతో జలంధరుడి అహం దెబ్బ తిని దేవదానవ సంగ్రామం మొదలయింది. అతడు పార్వతిని మోహించి నందుకు శివుడు కూడా అదే సమయాన అతడిని శిక్షించదలచాడు. అయితే జలంధరుడి భార్య అయిన బృంద పాతివ్రత్య మహిమ వలన అతడిని చంపటం సాధ్య పడలేదు. అది గ్రహించిన విష్ణుమూర్తి ఆమె శీలాన్ని మోసంతో హరించగా శివుడతనిని సంహరించాడు..
నిజానికి జలంధరుడు శివాంశుడే! ఒకప్పుడు శివుడి తేజస్సు, సాగరంలో గంగ కలిసే ‘గంగాసాగర్’ అనే స్థలానికిచేరి అక్కడ జలంధరుడిగా రూపు దిద్దుకుంది. బృంద కాలనేమి అనే రాక్షసుడి కూతురయినా దేవీ వర ప్రసాదాన ఆమె అంశతో జన్మించింది. జలంధరుడి మరణ అనంతరం బృంద, ‘బృందావని’గా మారి పోయింది. జలం ధరుడి అంతిమ కోరికపై అతని నివాసమైన సాగరాన, క్షీర సాగర మథనం జరిగిన చోట మహాలక్ష్మితో పాటూ తాను వసిస్తానని విష్ణుమూర్తి అతనికి వరమిచ్చాడు. అందుకు ఇంకో కారణమూ ఉంది. సాగరాన జన్మించిన అతడిని, తాను సాగర పుత్రి కనుక మహాలక్ష్మి తన సోదరుడిగా భావించేది. లక్ష్మీదేవికి జలంధర వధ ఇష్టం లేకపోయినా లోక కల్యాణార్థం ఆ వధ శివుడు జరుపగా, అతడు కోరిన విధానంలో జలంధరుడిని అనుగ్రహించాడు విష్ణుమూర్తి.
జలంధర వధ ఉదంతం శివకేశవుల మిత్రత్వాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. అలాగే శివ కేశవుల మైత్రిని తెలియ బరిచే మరో ఉదంతం శంఖ చూడ వధ.
శంఖచూడ వధ
పూర్వం సుదాముడనే మహా కృష్ణ భక్తుడు గోలోకాన శ్రీకృష్ణునితో అతి సన్నిహితంగా మసలే భాగ్యాన్ని పొందాడు. అలాగే రాధాదేవికి ఒక ఇష్ట సఖి ఉండేది. ఆమె కృష్ణుడిని వలచి తన తలపులలో ఆరాధిస్తూ ఉండేది. ఆమె భక్తికి మురిసిన కృష్ణుడు ఆమెతో శృంగారంలో రమిస్తూండగా రాధ వచ్చి ఆమెపై కోపించి ఆమెను భూలోకాన జన్మించమని శపించింది. కృష్ణుడిని ఎన్నో విధాల దూషించింది. ఆ ధూషణలు సహించలేని సుదాముడు రాధకు నచ్చచెప్పబోగా, ఆమె అతడిపై కూడా కోపించి అతడిని రాక్షస జన్మ ఎత్తమని శపించింది.
ఆ శాపవశాన వారిరువురూ శంఖ చూడుడిగానూ, తులసిగానూ జన్మించి ఒకరినొకరు పరిణయమాడారు.
- ఇంకావుంది...