డైలీ సీరియల్

పార్థివ లింగపూజతో ప్రకృతి పులకింత (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగమ్మ అందులోకి ప్రవేశించింది.
అనసూయ సంతోషించి, ‘‘అమ్మా!నేను మళ్ళీ వచ్చేవరకూ నీవిక్కడనే ఉండు తల్లీ!’’ అని ప్రార్థించగా, ఆమె చేసిన తపస్సులోని ఒక మాస ఫలాన్ని తనకు ధారపోస్తే అలాగే ఉంటానన్నది గంగమ్మ తల్లి.
అనసూయ అలాగే చేసి నీటితో కమండలాన్ని నింపుకుని వచ్చి భర్తకు సమర్పించింది. అమృత ప్రాయంగా ఉన్న ఆ జలాన్ని గ్రోలిన అత్రి మహర్షి,
‘‘దేవీ! క్షామం ఇంకా సమసినట్లు లేదు. నీకింత తీయని నీరు ఎక్కడ లభ్యమయింది?’’ అని ప్రశ్నించాడు. ఆయనకు జరిగినది విన్నవించి ఆ మడుగు వద్దకు తీసుకు వెళ్ళింది అనసూయ. ఆ చిన్ని మడుగులో క్రొద్దిగా ఉన్న ఆ నీటిని గంగా భవానిగా సేవించి, ఆ దంపతు లిరువురూ,
‘‘తల్లీ! నీవు నిరంతరము ఇంకా లోతులకి వెళ్ళి ఈ మడుగులో వసించి ఈ ప్రదేశాన కరువు కాటకాలు తొల గించు.’’ అని ప్రార్థించారు.
అంతే! అక్కడ పరమేశ్వరునితో సహా గంగమ్మ తల్లి దర్శన మిచ్చింది. ‘‘అమ్మా! మీ కోరిక తప్పక తీరుస్తాను. కానీ నీవు చేసిన పార్థివ లింగ పూజలోని తపః ఫలములో నాకు ఒక ఏడాది ఫలం ఇవ్వ వలసి ఉంటుంది’’ అన్నది గంగమ్మ.
వెంటనే తన ఏడేళ్ళ తపో దీక్షా ఫలంలో ఒక సంవత్సర ఫలమామెకు అర్పించింది అనసూయమ్మ. అందరూ చూస్తూండగానే ఆ అగర్తము పెద్దదై తీయని జలంతో నిండిపోయింది.
భార్య పార్థివ పూజా మహత్యం వలన తమకు పరమేశ్వర దర్శన కలగడం అత్రి మహర్షి కెంతో ఆనందా న్నిచ్చింది. తన ఇష్టదైవాన్ని తనివి తీరా స్తుతించాడు.
పరమేశ్వరుడు ఆనందించి, ‘‘నాయనా! క్షామ సమయంలో ప్రజలందరూ ఈ ప్రదేశం వదలి వెళ్ళిపోయినా, తపో నిమగ్నుడి వైన నిన్ను సేవించు కుంటూ, ఏకాకినిగా ఉంటూనే పరమ ఏకాగ్రతతో, భక్తితో నన్ను పూజించిన నీ సతి అనసూయా దేవి పాతివ్రత్యం మహత్యం గంగా భవానినీ, నన్నూ ఇక్కడికి రప్పించింది. ఇకపై ఈమె నిర్మించిన ఈ లింగములో నేను ‘అత్రీశ్వరుడ’నే నామధేయంతో విరాజిల్లి జనులందరికి సకలాభీష్టాలనూ, ముక్తినీ ప్రసాదిస్తాను. గంగ యొక్క నిర్మల ఉదకంతో నన్ను అభిషేకించిన వారు తప్పక నా అనుగ్రహానికి పాత్రులౌతారు’’ అని ఆశీర్వదించి గంగతో పాటూ అదృశయుడయాడు.
‘‘శౌనకాది పుణ్య మునులారా! అనసూయ పాతి వ్రత్యంతో ఆచరించిన ‘పార్థివ లింగ పూజనం ఎంత ఫలప్రదమయినదో అర్థం అయింది కద! కలియుగంలో ఈ పూజ మోక్షదాయకం.’’ అని వివరించారు సూతమహర్షి.
కాలభైరవోపాఖ్యానము (శతరుద్ర సంహిత)
‘‘శౌనకాదులారా! కాలభైరవ చరిత్రను గురించి అడి గారు కదూ! వినండి. శివలింగోద్భవం జరిగిన తరువాత, శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ శిరస్సుని ఖండించిన కాల భైరవుడిని, వేదాలలో ప్రతిపాదించబడిన బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకున్నది. అది ఎర్రని వస్త్రాలతో, నిక్క బొడుచుకున్న వెంట్రుకలతో, నోటినుండి రెండు ప్రక్కలా బయటికి వచ్చిన కత్తుల వంటి దంతాలతో, అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో వికృతమై ఉండి, నల్లని నీడలా వెన్నాడుతూ కాలభైరవుడిని భయభీతుడిని చేసింది. దానికి తోడు అతను ఖండించిన బ్రహ్మ కపాలం అప్పటికే అతని చేతికి జిగురులా అంటుకుపోయింది. దాని నుండి అతడిని విడిపించటం ఎవరి తరమూ కాలేదు.
కాల భైరవుడు ఆ కపాల, బ్రహ్మ హత్యాపాతకాల నుండి తనను కాపాడమని ఈశ్వరుడిని ప్రార్థించాడు.
ఈశ్వరుడు దివ్య దృష్టితో పరిశీలించి,
‘‘్భరవా! ఈ పాతకం వేదశాసనానుసారం సంభవిం చినది కనుక వేదాలు నిర్ణయిం చిన పద్ధతిలోనే అది నిన్ను వదులుతుంది. నీవు వివిధ పుణ్య క్షేత్రాలూ దర్శించి చివరకు కాశీపురికి చేరు. అక్కడికి చేరగానే నీకు కాపాలికాన్నుండి విముక్తి లభిస్తుంది. కాశీ గంగలో స్నానం చేసి శుద్ధుడవవుతూనే బ్రహ్మ హత్యా పాతకమూ తొలగిపోతుం ది.తరువాత నిన్ను నేను కాశీపురానికి క్షేత్ర పాలకుడిగా అభిషేకిస్తాను.’’ అని కాలభైర వుడిని ఊరడించి,
‘‘ఓరుూ బ్రహ్మ హత్యా పాతకమా! కాలభైరవుడు కాశీ గంగా స్నానం చేయగానే నీవతన్ని వదలివేయాలి. ఇది నా ఆజ్ఞ!’’ అని దాన్ని ఆదేశించాడు మహేశ్వరుడు.
కాలభైరవుడు తీర్థయాత్రలకి బయలు దేరాడు.
బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకున్న కాలభైరవుడి దేహం పచ్చ కర్పూరపు రంగు నుండి మారిపోతూ క్రమంగా నల్లగా, వికృతంగా తయారయింది.. పాతక ప్రభావం వలన అతని బుద్ధి మందగించి, మెడనిండా కపాల హారాలు వేసుకుని కపాలం అంటుకున్న చేతితో భిక్షని అడుక్కుంటూ కాపాలికుడై చరించసాగాడు. అతడిని ఆ వేషాన చూసి బెదిరిపోయి ఎవరూ భిక్ష కూడా వేయకపోవడంతో అతడు కృశించి పోయి, అతి దైన్య స్థితిలో విష్ణుమూర్తిని శరణుజొచ్చాడు.
విష్ణుమూర్తి దివ్య దృష్టితో పరికించి, ‘‘నాయనా! నీవిక కాశీపురికి వెళ్ళి గంగా స్నానమాచరించి ఈశ్వరుడిని పూజించి శుద్ధుడివి కావాలి. ఆ తరువాత నేను నీకు శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె