డైలీ సీరియల్

ఆది అంతం లేనిదే పరబ్రహ్మం( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ విష్ణువులిరువురికీ వారి శిరస్సులపై తన కరాలనుంచి మంత్రదీక్షను ప్రసాదించాడు.
బ్రహ్మ విష్ణువులు ఆ మహాదేవుడిని మనసారా స్తుతించారు.
‘‘సకల,నిష్కల రూపాలు రెండూ కలిగి పంచకృత్యాలూ నిర్వహించే ఆత్మ స్వరూపుడివీ, సద్గురువువీ, కల్యాణ ప్రదుడివీ అయిన మీకు పదే పదే వందనాలర్పిస్తున్నాము. సర్వాత్ములూ, ప్రణవలింగ స్వరూపులూ, ప్రణవ స్వరూపులూ, శక్తి స్వరూపులూ అయిన మీకు మా భక్తి పూర్వక నమస్కారములు, దయ ఉంచి మమ్మల్ని మా కార్య నిర్వహణల్లో సామర్థ్యం కలిగి ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’’ అని వినుతించిన వారిని దీవించి, పరమేశ్వరుడు అంతర్థానమయాడు. అని నందీశ్వరుడు సనత్కుమారునికి బోధించిన లింగోద్భవాన్నీ శివ తత్వాన్నీ శౌనకాది మహర్షులకు వివరించారు సూత మహర్షి.
6
సాక్షాత్తూ ‘శివావతారుడై’న నందీశ్వరుని ద్వారా శివచరితాన్ని విన్న మరో భాగ్యవంతుడు మహా భక్త మార్కండేయుడు.
మార్కండేయ మీమాంస
శౌనకాది మునుల అభ్యర్థనపై బదరికావనంలోని దీర్ఘ సత్రయాగ సమయాన విశ్రాంతి వేళలలో, సూత మహర్షి, తాను వ్యాస మునీంద్రుల ముఖతః విన్న శివపురాణాన్ని వివరిస్తూ నందీశ్వరావతారాన్ని వివరించారు. సనత్కుమారునికే కాక మహా భక్తుడైన మార్కండేయుడికి కూడా ఒకప్పుడు, నందీశ్వరుడు గురువయ్యారని తెలిపి ‘‘ముని శ్రేష్టులారా! ఒకానొకప్పుడు పరమ శివుడి మహా భక్తుడైన మార్కండేయ మహర్షి తన ఆశ్రమాన శివధ్యానం చేస్తున్నారు.
‘‘నమః శివాయ శాంతాయ సత్వాయ ప్రమథాయచ
రజో జుషేధ ఘోరాయ నమస్త్భ్యుం తమోజుషే!’’
‘‘పరమశివా! సత్వగుణము కలిగి శాంతుడివీ, రజో గుణము వలన ఉద్రిక్త స్వరూపుడివీ, తమోగుణం వలన భీకర స్వరూపుడివీగా భాసించే నీకు వందనములు’’ అంటూ శివుడి నని వినుతిస్తున్న మార్కండేయ మహర్షి హృదయంలో హఠాత్తుగా ఏదో తెలియని వ్యాకులత మొదలయ్యింది. ‘తాను జన్మంచినది పరమేశ్వర వరప్రసాదిగా! చిరంజీవత్వం పొందినదీ ఆయన కృప వలననే! కానీ ఆ పరమశివ మహత్త్వం మాత్రం ఇప్పటికీ తనకి సంపూర్ణంగా అవగాహన కాలేదు. ఆ సచ్చిదానందుని అనంత చరిత్రలో, అద్భుత లీలలలో తనకి తెలిసినది అతి స్వల్ప భాగం మాత్రమే! ఆయన పరతత్వాన్ని తనకి సవివరంగా తెలుపగల వారెవరు?!’ అని మార్కండేయ మహర్షి ఆవేదన చెందసాగాడు’’ అంటున్న సూతుని పలుకులని తన్మయులై ఆకర్షిస్తున్నారు శౌనకాది మహర్షులు.
మార్కండేయుడు బ్రహ్మను దర్శించుట
సూత మహర్షి ఇలా కొనసాగించారు.
‘‘శౌనకాది మునులారా!
పరమశివుడి పరతత్వాన్ని గూర్చి సంపూర్ణంగా తెలుసుకునేందుకై మార్కండేయుడు తన చిరకాల తపశ్శక్తితో ముందుగా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని దర్శించాడు. వాణీ హిరణ్య గర్భులాయనను సాదరంగా స్వాగతించి ఆయన రాకకు కారణం తెలుసుకోగోరారు.
మార్కండేయుడు తన వ్యాకులతను వివరించి, ‘‘పితామహా! నేను అనాదిగా సేవిస్తున్న ఆ పరమేశ్వరుని చరితాన్నీ, తత్వాన్నీ త్రిమూర్తులలో ఒకరైన మీ ముఖతః వినాలని అభిలషిస్తున్నాను’’ అన్నాడు వినయంగా.
అది విని బ్రహ్మ సర్వతులిరువురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బ్రహ్మదేవుడు నిట్టూర్చి ‘‘నాయనా! నేను భూ బ్రహ్మాండపు త్రిమూర్తులలో ఒకడినన్న మాట నిజమే! కానీ ఈశ్వరుడు అలా కాదు. ఆయన అంతకు మించిన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన మహేశ్వర, సదాశివ, ఈశ్వర, ఏకాదశ రుద్ర స్వరూపాలు మిళితుడైన పరబ్రహ్మ అని నా పూర్వీకుడూ, మొట్టమొదటి బ్రహ్మ అయిన పంచముఖ బ్రహ్మ గ్రహించేసరికి ఆయన ముఖాల్లో మధ్యదానిని పోగొట్టుకుని చతుర్ముఖుడయిపోయాడు. అలా మొదలయిన చతుర్ముఖ బ్రహ్మల పరంపరలో నేను ఎన్నో వాడినో నాకే తెలియదు. అందుకని ప్రస్తుతపు బ్రహ్మనయిన నాకు ఆయన గురించి తెలిసినది అతి స్వల్పం. నీవు ఈశ్వరుడి ప్రియమిత్రుడైన నా తండ్రి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళితే ఆయననీకు సవిస్తరంగా ఆ పరమేశ్వర చిద్విలాసం వివరించగలడని నా ఉద్దేశ్యం.’’ అన్నాడు
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె