డైలీ సీరియల్

కుడి, ఎడమభాగాలే! (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరుడు సౌమ్యంగా ‘‘నాయనా! కలవరపడకు. నింపాదిగా సృష్టించు. నీకు మేలు జరుగుతుంది.’’ అని నన్ను ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు.
నేను మళ్ళీ ప్రయత్నం చేసాను. కానీ ఫలితం కనిపించలేదు. అప్పుడు దుఃఖితుడనై ఉన్న నా కనుబొమ్మల మధ్యనుండి మహేశ్వరాంశతో రుద్రుడు ఉద్భవించాడు. ఆ రూపం ‘అర్ధనారీశ్వర’ రూపం. తన వామాంకాన ఉపస్థితయై ఉన్న ప్రకృతి స్వరూపిణిని వేరు చేసిన రుద్రుడు,
‘‘నాయనా! ఈ రెండు రూపాలూ శివశక్తి రూపాలు, నీ సృష్టి శీఘ్రంగా సాగేందుకు ఈ రెండు రూపాలనూ అనగా స్ర్తీ పురుష రూపాలను గుర్తుంచుకుని, వీటి ఆధారంగా సృష్టి జరుపు. నీవు సృష్టించిన స్ర్తీ పురుషులు తమ సంగమం చేత సృష్టిని మరింత పెంపొందిస్తారు.’’ అని చెప్పి అదృశ్యమయిపోయాడు. ఆయన శక్తి కూడా మాయమై ఆయనతో వెళ్ళిపోయింది. నారదా! నాకు క్రొత్త శక్తి సంప్రాప్తించినట్లు అనిపించి ఈసారి ఉత్సాహంగా ఆయన ఆదేశం మేరకు మొదట నా శరీరపు వివిధ అంగాలనుండీ తొమ్మిది మంది ఉపబ్రహ్మలనూ, నా మానస పుత్రుడిగా నిన్నూ సృజించాను. ఆ తరువాత నా శరీరం కుడి, ఎడమ భాగాలనుండి స్వాయంభువ మనువూ, శతరూప అనే దంపతులను వెలువరించాను.
స్ర్తీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగించేటందుకై నేను మన్మథుడనే సుందరుడిని సృష్టించి, ఆయనకు ఆ కార్యంలో సహకరించేందుకు వసంతుడనే వాడిని నియమించాను. మన్మథుడు నేను తనకొసగిన చెఱుకు వింటికి ‘హర్షణ, రోషణ, మోహన, శోషణ, మారణ’ మనే పేర్లు గల ఐదు పుష్ప బాణాలను సంధించి స్ర్తీ పురుషులపై ప్రయోగించి వారి మధ్య ఆకర్షణలను కలిగించగా, దానిని తన ఆహ్లాదకరమైన వాతావరణంతో మరింత బలపరుస్తాడు వసంతుడు. ఆ ఆకర్షణ వలన కలిగే వ్యామోహ వశాన మైథునమనే ప్రక్రియ జరిగి సృష్టి వృద్ధి పొందుతుంది.
నారదా! స్వాయంభువ మనువూ శతరూపా దంపతులకి ఆకూతీ, ప్రసూతీ, దేవహూతి అనే కన్యలూ, ఉత్తానాపాదుడూ, ప్రియవ్రతుడనే పుత్రులూ జన్మించారు. వీరిలో ప్రసూతిని ఉపబ్రహ్మ అయిన దక్షుడు వివాహం చేసుకోగా వారికి అరవై నాలుగు మంది పుత్రికలు కలిగారు.
దక్ష ప్రజాపతి సంతానంలోని పద మువ్వురు కన్యలు ఉపబ్రహ్మ అయిన మరీచి యొక్క పుత్రుడైన కశ్యపుడనే ప్రజాపతిని వరించి వివాహమాడగా వారిలో అదితికి దేవతలూ, దితికి దానవులూ, కద్రువ, వినత ఆదిగా గల భార్యల వలన సర్పాలూ, పక్షులూ మొదలైన జంతుజాలమూ జన్మించి సృష్టి శీఘ్రంగా వృద్ధి చెందసాగింది.’’ అని బ్రహ్మ నారదుడికి వివరించిన సృష్టి వివరాలు వివరించిన సూత మహర్షి అందులో భాగంగా,
‘‘తన ప్రియ పుత్రిక అయిన సతీదేవిని దక్ష ప్రజపతి తానెంతో భక్తితో పూజించేవాడూ, త్రిమూర్తులకే అధిపతీ అయిన ఈశ్వరుడికి కన్యాదానం చేసి అంతటి స్వామికి మామగారయ్యే భాగ్యాన్ని పొందాడు.’’ అని శౌనకాది మహర్షులకి తెలిపారు.
5
నందీశ్వరుడు తెలిపిన ‘‘శివ లింగోద్భవము’’ (విద్యేశ్వర సంహిత)
శివాజ్ఞానుసారం శివచరితాన్ని, శివతత్వాన్ని సనత్కుమారునికి ఉపదేశించిన పరమగురువు నందీశ్వరుడు. అయితే ఈ వివరాలు సృష్ట్యాదిలోనివి కాక దేవతలందరూ సృష్టించ బడిన తరువాత జరిగినది కనుక బ్రహ్మ నారద సంవాద ఘట్ట కాలానికి అనంతరం జరిగినదిగా మనం గుర్తించాలి. కాల గమనంలో ఎన్నో ప్రళయాలు సంభవించి మళ్ళీ మళ్ళీ సృష్టి జరిగినప్పుడల్లా, జరిగిన పురాణగాథలే పునః పునః కొద్ది కొద్ది వ్యత్యాసాలతో సంభవిస్తాయని దృష్టలుగా దర్శించీ, వేదాలలో వినీ ఆకళింపు చేసుకున్న ఋషి సత్తములు మనకు తెలుపుతున్నారు. నూరు దివ్య వత్సరాలు గడిచాక క్రొత్త బ్రహ్మ ఉదయించటం పరబ్రహ్మ లీలలు పునరావృత్తం అవటం జరుగుతుంది. కనుక క్రొద్దిపాటి వ్యత్యాసాలు ఇతి హాసాలలో గోచరిస్తాయి. కానీ మూల గాథలో మార్పు ఉండదు.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె