డైలీ సీరియల్

సర్వం ఈశ్వరమయం( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇరువురికీ బేధము లేదు. బ్రహ్మదేవా! ముందు ముందు నీ వదనం నుండి నా అంశతో రుద్రుడు ప్రభవిస్తాడు. లోక సంహార నిర్వహణకై నేనే రుద్రుడిగా ప్రకటితవౌతాను కనుక అతను నేనే! గుణాల రీత్యా బ్రహ్మవైన నీవు లోపలా, వెలుపలా కూడా రజోగుణము కలిగి వుంటావు. రుద్రుడు అంతర్గతంగా సత్వ గుణం కలిగిన వాడుగానూ అయితే తన లయ అనే కృత్య నిర్వహణకై అతడు బహిర్గతంగా తమోగుణుడిగానూ అగుపిస్తాడు. విష్ణువు లోక వ్యవహార నిర్వాహకుడు కాబట్టి బయటికి సత్వగుణమునూ, కొన్ని సార్లు అంతరంగాన తమోగుణమునూ కలిగి ఉండవలసి వస్తుంది. నా మూర్తులైన మీరు ఈ గుణాలు కలిగి ఉన్నా పరమేశ్వర తత్వంలో నేను నిర్గుణుడినే!’’ అని వివరించిన మహేశ్వరుడు పరమేశ్వరీ దేవి అంశలయిన లక్ష్మీ సరస్వతులను మాకిచ్చి నా తండ్రినీ, నన్నూ వారిని కళత్రాలుగా చేపట్టమనీ, ఆ తరువాత నన్ను సృష్టికార్యం ఆరంభించమనీ ఆదేశించి అంతర్హితుడయ్యాడు. అప్పటి మా ఆనందం వర్ణనాతీతము నారదా!
లక్ష్మి నారాయణుని పత్నీ, సరస్వతి నా పత్నీకాగా మేము శక్తి సంపన్నులమైనాము.
ఆ పరమేశ్వరుడు నా ఆయుష్షు వంద దివ్య సంవత్సరాలుగానూ, ఆ కాలం నా తండ్రికి ఒక్క రోజుగానూ, విష్ణువు ఆయుః కాలమంతా రుద్రుడికి ఒక్క రోజుగానూ నిర్ణయించాడు. దేవమానంలోని నా ఒక్కరోజు ప్రమాణం భూలోకంలో రెండు కల్పాల కాలం. ఒక్కొక్క కల్పంలోనూ పధ్నాలుగు మన్వంతరాలు ఉంటాయి. ఒక్కొక్క మన్వంతరంలోనూ నాలుగు యుగాలూ పద్దెనిమిది సార్లు అనగా అన్ని మన్వంతరాలూ కలిసి రమారమి డెభ్భై రెండు యుగాల కాలం నడుస్తాయి. అంటే పధ్నాలుగు మన్వంతరాల కాలమైన వేయి యుగాలూ నాకొక పగలు, మళ్ళీ అంతేకాలం రాత్రిగా నా దినం రెండు వేల యుగాలు కాగా అటువంటి మూడు వందలా అరవై రోజులు నాకొక సంవత్సరముగానూ, అటువంటి వంద సంవత్సరాలు నా ఆయువుగానూ పరమేశ్వరుడు నిర్ధారించాడు. ఆ తరువాత మరో క్రొత్త బ్రహ్మ ఉదయిస్తాడు. మా విష్ణు బ్రహ్మ రుద్రులము కూడా శాశ్వతులము కాము. కాల గర్భంలో మేమూ కలసిపోవలసిందే! నారదా! పరమేశ్వరుడొక్కడే శాశ్వతుడు. అటు తరువాత పరమేశ్వరుడాదేశించిన విధంగా నేను బ్రహ్మపురినీ, నా తండ్రి క్షీర సాగరాన్నీ నెలవులుగా చేసుకున్నాం. సృష్టి రచన ఆరంభమయింది’’ అన్నాడు బ్రహ్మ’’ అంటూ బ్రహ్మ నారద సంవాదాన్ని వివరించారు సూత మహర్షి.
‘‘శౌనకాదిమునులారా!
స్వయంగా మహేశ్వరుడే
‘‘మమైవ హృదయే విష్ణు ర్విష్ణోశ్చ హృదయే హ్యహం
మదాజ్ఞయా భవేద్విష్ణో సత్యం సత్యం, న సంశయః’’
అని పలికాడు కనుక విష్ణువు ఆయన హృదయము, ఆయన ఆజ్ఞా పాలకుడు. మహేశ్వరుని అంశుడయిన ఈశ్వరుడికీ, విష్ణువుకీ, ఈశ్వరాంశుడైన రుద్రునికీ బేధము లేదు.
శివ లింగమునకు గల వేదిక లేక అర్ఘా సాక్షాత్తూ మహాదేవి స్వరూపము’’ అని తెలిపారు సూత మహర్షి.
బ్రహ్మ-నారద సంవాదములో బ్రహ్మ నారదునికి పంచముఖ బ్రహ్మ చతుర్ముఖుడయిన ఉదంతం వివరించిన తరువాత, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి గురించి తెలుపసాగాడని చెప్పి ఆ విషయాలు మునులకి విపులీకరించసాగారు సూతమహర్షి.
చతుర్ముఖ బ్రహ్మ సృష్టి
‘‘పుణ్య పురుషులారా!
బ్రహ్మ నారదుడికిలా తెలుపసాగాడు.
‘‘నాయనా నారదా! సృష్టాదిలో పద్మంలో పంచముఖుడిగా ఉద్భవించిన నేను మహేశ్వరుడి అంశుడయిన కాలభైరవునిచేత మధ్య వదనం శ్రీండించబడి చతుర్ముఖుడినయిపోయాను. అప్పుడు నేను తనువు చాలించి ఒక అండం అటు రాగా దానిలో ప్రవేశించి తపస్సులో మునిగిపోయాను. వేయి సంవత్సరాల తరువాత అందులోనుండి క్రొత్త దేహంతో, చతుర్ముఖాలతో పరిశుద్ధుడనై బయటకు వచ్చి మహేశ్వరుడు నాకు పనచిన సృష్టి కార్యం చేయటానికి ఉపక్రమించాను. ఎన్నో జీవరాశులను సృజించి మానవులను సృష్టించే ప్రయత్నం చేయసాగాను. మొట్ట మొదటిసారి నాలో నుండి సనక సనందన, సనాతన, సనత్సుజాతులనే నలుగురు మహా యోగులైన పుత్రులు ఆవిర్భవించారు. కానీ వారు నేను చేయమన్న సృష్టికార్యానికి ఎంత మాత్రమూ అంగీకరించక తపస్సుకై వెడలిపోయారు.
నేను తిరిగి మనుజ సృష్టికి ఉపక్రమించాను కానీ అది సవ్వంగా సాగలేదు సరికదా భీకర వికృతాకారులెందరో ఉద్భవించసాగారు. నాచే సృజించబడిన ఆ గణాలు ననే్న భయ పెట్టగా నేను పరమేశ్వర ధ్యానం ఆరంభించాను. అంతే! ఆ కరుణామయుడు పంచవదనుడిగా నాకు సాక్షాత్కరించాడు. ఆయన సద్యోజాత వదనం శే్వత వర్ణంలోనూ, వామదేవ వదనం రక్తవర్ణంలోనూ, తత్పురుష వదనం పీత వర్ణంలోనూ,, అఘోర వదనం నలుపు రంగులో విభూతి మయంగానూ, ఈశాన వదనం శుద్ధ స్ఫటికం వలెనూ ఉన్నాయి.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె