డైలీ సీరియల్

హద్దు దాటితే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ తండ్రిని నీవు ఆశ్రయించి, వేదజ్ఞానం పొంది, సృష్టి కార్యం ప్రారంభించు’’ అని ఎంతో చక్కగా ఉపదేశించాడు.
కానీ అదంతా చెవిటి వాని ముందు ఊదిన శంఖం చందమైంది. నేను నా అహంకారాన్ని వదలక ఆయన మాయావి అనీ, నన్ను అనుకరించి ఐదు ముఖాలు సృష్టించుకున్నాడనీ, నేను ఉద్భవించినప్పుడు ఆయన అగుపించలేదు కనుక ఆయనే నా ఆజ్ఞానుసారం వర్తించవలసిన వాడనీ, ఇంకా చాలా వెటకార, అహంకార సంభాషణ కూడా చేసాను. మహేశ్వరుడు అప్పటికీ కోపగించుకోక వేదాలను పిలిచాడు. తృటిలో నాలుగు వేదాలూ అక్కడ సాక్షాత్కరించాయి.
‘‘వేదములారా! మీరెవరిని పరబ్రహ్మ స్వరూపుడిగా పూజిస్తున్నారో తెలుపండి.’’ అని అడిగాడు పరమేశ్వరుడు.
వేదాలాయనకు నమ్రంగా నమస్కరించి ఇలా సమాధానం ఇచ్చాయి.
‘‘పరంజ్యోతివీ, పరబ్రహ్మ స్వరూపానివీ నీవే పరమేశ్వరా!’’ అన్నది ఋగ్వేదము.
‘‘ప్రపంచమంతా శివస్వరూపమే! అన్యమైనది ఏదీ లేదు.’’ అన్నది యజుర్వేదము..
‘‘సకల కర్మలనూ ప్రేరేపించేవాడినీ, కర్మఫల ప్రదాయకుడివీ కూడా నీవే!’’ అని సామవేదం అనగా
‘‘సమస్త దుఃఖ నివారకుడివీ, మంగళప్రదుడివీ నీవే సాంబశివా!’’ అని నిర్ధారించింది అధర్వణ వేదం.చివరగా వేదాలన్నీ కలసి ఘంటాపదంగా,
‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండాలూ ఈయన సృష్టించినవే!
పరాపశ్యంతీ మధ్యమా వైఖరీ రూపుడూ, భుక్తి ముక్తి శక్తి ప్రదాయకుడూ కూడా ఈ పరమేశ్వర పరబ్రహ్మ స్వరూపుడే! అని ఘోషించాయి.
అప్పటికైనా నేను సత్యాన్ని అవగతం చేసుకుంటానని ఆశించిన ఈశ్వరుడు, నేను మూర్ఖంగా
‘‘నేనిదంతా నమ్మను. ఇది నీ అభూత కల్పన. బ్రహ్మనయిన నేనే పరబ్రహ్మను కూడా!’’ అని భీష్మించటంతో పరమ క్రుద్ధుడయాడు.
అంతే!
సహనం కోల్పోయిన ఈశ్వరుడు ఉగ్రరూపం దాల్చి రుద్రుడయ్యాడు. ఆ రౌద్ర రూపాన ఆయన చేసిన హుంకార నాదం నుండి నేత్రత్రయంతో, త్రిశూలాది ఆయుధాలన్నీ ధరించి దశదిశలూ కంపించే విధాన ఢమరుకాన్ని మ్రోగిస్తూ భీకరాకారుడూ మహూన్నత కాయుడూ అయిన ‘కాలభైరవుడు’ ఆవిర్భవించాడు.్భమ్యాకాశాలు దద్దరిల్లేట్లు విలయతాండవం చేసాడు. తరువాత శివుడి వంక తిరిగి, ‘‘ప్రభూ ఏమి ఆజ్ఞ!?’ అని ప్రశ్నించాడు.
‘‘వేద వాక్కులని సైతం విశ్వసించని ఈ బ్రహ్మ ‘నడిమి శిరస్సు’ను వెనువెంటనే ఖండించు’’ అని ఈశ్వరుడు ఆనతీయగా, కాలభైరవుడు అలవోకగా తన కుడి చేతి చిటికెన వ్రేలి గోటితో నా మధ్య శిరస్సును మీటాడు. అంతే! అది కాస్తా పుటుక్కున తెగి అనంతదూరం గాలిలో ఎగిరి వెళ్ళిఉత్తర దిశలో పడింది. (అది పడిన చోటు బదరీ క్షేత్రంలోని బ్రహ్మ కపాల ప్రదేశం.) నారదా! ఈ విధంగా చతుర్ముఖుడిని అయిన నేను గర్వాహంకారాలు నశించి, పరమేశ్వరుడినీ, విష్ణుమూర్తినీ క్షమించమని దీనంగా ప్రార్థించాను. ‘‘దేవదేవా! మహదేవా! ఇప్పుడు నాకు జ్ఞానోదయమయింది.
తండ్రీ! నారాయణా! ఇప్పుడు నా అపరాధాన్ని మన్నించు’’ అని వేడుకున్న నన్ను ఆదరంగా అక్కున చేర్చుకున్నాడు నా తండ్రి నారాయణుడు. మహేశ్వరుడు కూడా నన్ను ఆశీర్వదించి, ‘‘నాయనా! నీవిక నీ తండ్రి సహాయంతో సృష్టికి ఉపక్రమించు, నేను నా లింగాకారములో అన్ని ప్రదేశాల్లోనూ వెలసి ఉంటాను. నీకు వలసిన సమయాన సాయపడుతూ ఉంటాను. నీవు సృజించిన జగత్తును రక్షించే కార్యక్రమం విష్ణువూ, కల్పాంతాన నా కాలాగ్ని రుద్ర రూపాన దాన్ని లయం చేసే కార్యాన్ని నేనూ చేపడుతాము. శుభమస్తు!’ అని అంతర్థానం కావటానికి సిద్ధపడుతూండగా నేనూ, నా తండ్రి అయిన నారాయణుడూ అయనను ఆ అగ్ని లింగపు నిజతత్త్వాన్ని చూపమని వినయంగా వేడుకున్నాము.
శివలింగ అద్భుత తత్వము
బ్రహ్మ పరవశుడై ఇలా చెప్పసాగాడు.
‘‘నాయనా నారదా! పరమేశ్వరుడు మా ప్రార్థనను మన్నించాడు. మేమిరువురం చూస్తూండగానే దివ్య కాంతి పుంజాల నడుమ ఆ పరమలింగం నుండి మూడు అక్షరాలు వెలువడ్డాయి. ‘అ’ ‘ఉ’ ‘మ’ అనే ఆ మూడక్షరాలూ మా త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకలని పరమేశ్వరుడు మాకు తెలుపుతూండగానే ఆ మూడక్షరాలూ కలసిపోయి ‘ఓం’ అనే ఏకాక్షరంగా రూపొందాయి.

ఇంకా ఉంది