డైలీ సీరియల్
అహంకారమే నాశనానికి హేతువు( శివ పురాణం )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నీవు భూలోక సృష్టి కార్యము చేయవలసిన వాడివి. నీచే సృజించబడ జగత్తును రక్షించే కార్యక్రమము నాది.’’ అన్నాడు.
కానీ ఆ మాటలకి నా అహం దెబ్బ తిన్నది. ‘‘నేను నీ కుమారుడినని ఎలా నమ్మను?! నేను పుట్టినప్పుడు నీవు కనుపించలేదు. పద్మంలో స్వయం సంభవుడిగా జన్మించాను. కనుక ఆది పురుషుడిని నేనే! నీ అసత్యాలు నేను విశ్వసించను’ అని గర్వంగా పలికాను.
ఆయనెంత శాంతంగా నచ్చచెప్పాలని చూసినా నేను వినిపించుకోక వితండ వాదం చేయసాను.
అప్పుడు శాంతమూర్తీ, సత్వ గుణ సంపన్నుడూ అయిన శ్రీమన్నారాయణుడు తన ఆవిర్భావం పిదప తనకు దర్శనమిచ్చిన ఆ పరమేశ్వరుడైన మహేశ్వరుడిని మా తగవు తీర్చమని ప్రార్థించాడు.
లింగోద్భవం
అప్పుడు స్వయంభువుగా ఆ మహేశ్వరుడు మామధ్య (అగ్ని లింగ) రూపంలో ఆవిర్భవించాడు. మేము నివ్వెరపడి ఆ అనల లింగాన్ని చూస్తూండగానే ఆ లింగం అంతకంతకూ కంటి కాననంతగా పెరిగి పోయింది. అంతమే లేని అగ్ని స్తంభంలా అగుపించసాగింది.
‘‘బ్రహ్మ విష్ణువులారా! ఈ నా లింగ స్వరూపపు ఆది ఒకరూ, అంతము ఒకరు కనుగొని రండి. ముందుగా ఎవరు విజయవంతులై తిరిగి వస్తారో వారే ఆది పురుషుడు’ అన్న పలుకులు ఆ లింగంలోనుండి వినిపించాయి. వెంటనే విష్ణుమూర్తి శే్వత వరాహ రూపం ధరించి నీళ్ళను తన దంతాలతో తొలుస్తూ లింగపు అంతాన్ని కనుగొనటానికి క్రిందికీ, నేను హంసగా మారి లింగపు ఆదిని కనుక్కోటానికి పైకీ పయనించాము.
నారదా! వేయి సంవత్సరాలు శోధించినా మేమిద్దరమూ మా పరిశోధనలలో కృతకృత్యులము కాలేకపోయాము. శివలింగము అంతకంతకూ పైకీ, క్రిందికీ కూడా పెరిగిపోసాగింది’’ అన్నాడు బ్రహ్మ.
4
శివ లింగపు విశ్వరూపం
వ్యాస విరచిత స్కాంద పురాణంలో సూతులవారిచే ఇలా తెలుపబడింది.
‘‘చూస్తూండగానే ఆ అఖండ అనల జ్యోతిర్లింగం పాతాళం కన్నా క్రిందికీ, స్వర్గానికన్నా ఎత్తుకీ ఎదిగిపోయింది. అప్పుడు శివుని ఆజ్ఞపై విష్ణువు తనలోని శక్తిని వెలువరించి పానపట్టంగా మలచగా శివుడు పైనుండీ, క్రింది నుండీ లింగాన్ని కుదించి ఆ పాన పట్టంపై నిలిపాడు. అందుకే శివలింగం ‘అర్ధనారీశ్వర’ స్వరూపంగానూ, ‘హరిహర’ స్వరూపంగానూ కూడా భావింప బడుతోంది.’’ అని తెలిపారు సూత మహర్షి.
బ్రహ్మ నారద సంవాదంలో బ్రహ్మదేవుడిలా కొనసాగించాడు. ‘‘నారదా! ఆ అద్భుత లింగపు ఆద్యంతాలు కనుక్కోలేక మేము మొట్టమొదట లింగాన్ని దర్శించిన చోటికి వచ్చాము. విష్ణువు లింగానికి నమస్కరించుకుని,
‘‘దేవా! నీ అంతం ఎక్కడుందో నేను కనుక్కోలేక పోయాను.’’ అన్నాడు.
నేను మాత్రం అహంకారాన్ని వదలక నేనే ఆది పురుషుడినని పట్టుబట్టాను. విష్ణుమూర్తి సహనంతో ఆ మహాదేవుడిని స్మరిస్తూ,
‘‘ఓంకార స్వరూపుడా! మాకు మా కర్తవ్యాలను వివరించు.’’ అని ప్రార్థించాడు.
అప్పుడొక అద్భుతం జరిగింది.
అదృశ్యంగా తాను ఎంత చెప్పినా ప్రయోజనం లేదని తలచిన ఈశ్వరుడిక జాగు చేయదలచక, ‘ఓంకార’ శబ్ద తరంగాలు ఆ ప్రదేశమంతటా ప్రతిధ్వనిస్తూండగా తన నిర్మల స్ఫటిక ధవళ వర్ణ దేహాన మాముందు పంచవదనుడిగా తన సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశాన నామధేయాలు కలిగిన ఐదు ముఖాలతో కోటి సూర్య కాంతులతో సాక్షాత్కరించాడు.
అయితే నారదా, నాకూ పంచ వదనాలు ఉన్నందున నేనప్పుడెంతో తమోగుణంతో వ్యవహరించాను.
పంచముఖ బ్రహ్మకు
ఈశ్వర ప్రబోధం
ఆ పరమ తేజోమూర్తి ఎంతో శాంతంగా,
‘‘నాయనా విరించీ! విష్ణుమూర్తి పలికేది ముమ్మాటికీ సత్యం. నీవు జన్మించిన పద్మానికి ఆధారభూతమైన నాళము విష్ణు నాభి నుండి ఉద్భవించినందున ఆయన నీ జననానికి కారకుడైన నీ తండ్రి. నీటిలో సంభవించిన ఆయన ఎంతో జ్ఞాన సంపన్నుడు అయినందున శ్రీమన్నారాయణుడనే నామంతో కూడా ప్రసిద్ధి నందుతాడు. ‘నారము’ అనగా నీరు మరియు జ్ఞానము అని అర్థాలు. నా వద్ద ‘నమశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రోపదేశం పొంది, ఆ దీక్ష వలన వేదరాశిలో నిక్షిప్తమైన సారాన్నంతా ఆయన ఆకళింపు చేసుకున్నాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములనబడే పంచతన్మాత్రల గురించీ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ మనో బుద్ధి చిత్త అహంకారాలనబడే అంతఃకరణల గురించీ క్షుణ్ణమయిన అవగాహన కలవాడు నీ తండ్రి....
ఇంకా ఉంది