క్రైమ్/లీగల్

గుర్తు తెలియని కారు ఢీ - వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, మార్చి 21: మండల పరిధిలోని ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐతేపల్లికి చెందిన సుబ్బయ్య (70) జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని కారు అతివేగంగా అదుపుతప్పి వచ్చి ఢీకొని వెళ్లిపోవడంతో ఆయన కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్కూల్ వ్యాన్ ఢీకొని బాలుడు మృతి
బి.కొత్తకోట, మార్చి 21: పట్టణంలోని రంగసముద్రం రోడ్డులో నివసిస్తున్న లోకేష్ కుమారుడు హర్షిత్ (5)ను బుధవారం రోడ్డు దాటుతున్న సమయంలో రాఘవన్ స్కూల్‌కు చెందిన వ్యాను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బాలుడి మృతితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.