క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూన్ 7: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 27మందిపై పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసిపి జె సదానిరంజన్ తెలిపారు. గురువారం స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎం ఉషశ్రీ ఎదుట హాజరుపర్చగా 27మందిలో ఐదుగురికి జైలుశిక్షతో పాటు మరో 22మందికి 60,500రూపాయల జరిమానా విదించడం జరిగిందన్నారు. జైలుశిక్ష పడిన ఐదుగురిలో 100ఎంఎల్ నుంచి 150ఎంఎల్ లోపు ఫలితం వచ్చిన ముగ్గురికి రెండురోజులు జైలుశిక్ష, 150ఎంఎల్ నుండి 250ఎంఎల్ లోపు రిపోర్టు వచ్చిన ఇద్దరికి మూడురోజుల జైలుశిక్షతో పాటు వెయ్యిరూపాయల జరిమానా విదించడం జరిగిందన్నారు. మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు జిల్లా జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితూ రోడ్డుపైకి వచ్చి ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తే జైలుశిక్ష, మరియు జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.