క్రైమ్/లీగల్

రోకలిబండతో భార్యను కొట్టిచంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూన్ 7: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... కె కోటేశ్వరరావు అనే వ్యక్తి గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తన భార్య రమ్యకృష్ణతో కలిసి చేబ్రోలులో గత కొంతకాలంగా అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున కోటేశ్వరరావు, అతని భార్య రమ్యకృష్ణను రోకలిబండతో తలపై కొట్టి హత్యచేశాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. తరచూ కోటేశ్వరరావు భార్య రామకృష్ణను వేధించేవాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు చేబ్రోలు ఎస్‌ఐ వి బాబురావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.