క్రైమ్/లీగల్

ఉద్యమకారులపై కేసును కొట్టివేసిన న్యాయస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 26: మలివిడత తెలంగాణ ఉద్యమం సమయంలో పలువురు ఉద్యమకారులపై నమోదైన క్రిమినల్ కేసును శనివారం నిజామాబాద్ ప్రత్యేక ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రామలింగం కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న 2010వ సంవత్సరంలో అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలంగాణ కోరుతూ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అర్బన్ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ పోటీ చేశారు. దీనిని నిరసిస్తూ పలువురు తెలంగాణవాదులు అప్పట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీ.శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన చాటారు. తెలంగాణ కోసం పదవిని త్యజించిన యెండలపై పోటీని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, వారిపై డీఎస్ ఇంటిని ముట్టడించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 21మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఇదివరకే తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించగా, తాజాగా శనివారం సైతం తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా మరో ఐదుగురిపై కేసును కొట్టివేస్తూ నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రామలింగం తీర్పు వెలువరించారు. వరంగల్‌కు చెందిన ఎత్తొండ భాస్కర్, వేల్పుల భాస్కర్, నవీన్, పోడెటి ప్రశాంత్, నిజామాబాద్‌కు చెందిన దాసులపై నేరం రుజువు కానందున కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణవాదులు కోర్టు బయట హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.