క్రైమ్/లీగల్

ఈత సరదా.. నిండు ప్రాణం తీసింది !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 26: తాండూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బషిరాబాద్ మండల కేంద్రం జయంతి కాలనీలో నివాసం ఉంటున్న అంగన్ వాడీ కార్యకర్త మొగులమ్మ రెండవ కూతురు నిషిత (18)లు శనివారం సరదగా ఈతకు వెళ్లీ మృత్యువాత పడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మృతురాలు కుటుంబీకులు, బషిరాబాద్ పోలీసుల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి... బషిరాబాద్ మండల కేంద్రంలోని జయంతి కాలనీ లో నివాసం ఉంటున్న అంగన్ వాడీ కార్యకర్త మొగులమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అక్క నిఖిత, మరో యువకుడు శ్రీకాంత్‌తో కలిసి సమీపంలోని కాగ్నా నదిలో ఈతకు వెళ్లీంది. కాగ్నా నది పరివాహాకంలో హల్కోడ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద వారు ఈత కొట్టడానికి నీళ్లలోకి దిగారు. అక్క నిఖిత యువకుడు బ్రిడ్జి పరిసరాలో ఉండగా నిషిత మాత్రం నీటిలోకి ముందుగా దిగింది. అక్కడ నీటిలో లోతు ఎక్కువగా ఉందన్న విషయం తెలియక విద్యార్థిని నిషిత నీటిలో మునిగి తల్లడిల్లుతుంది. అది గమనించిన ఆమె అక్క నిఖిత శ్రీకాంత్‌లు అరుపులు వేయటంతో సమీపంలో ఉన్న వారు వచ్చి నిషితను కాపాడే యత్నం చేసి నీటిలోంచి బయటకు తీశారు. దాంతో నిషిత కొన ఊపిరీతో కొట్టు మిట్టాడుతోంది. అక్కడున్న వారు ఆమెను బషిరాబాద్ పీహెచ్‌సీకి తరలించి చికిత్సలకు ఉపక్రమించగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పిహెచ్‌సి డాక్టర్లు తెలపటంతో బషిరాబాద్‌లో ఓక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ నిషిత తేరుకోక పోవటంతో వెంటనే తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే నిషిత మరణించినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు నిర్థారించారు. దీంతో బషిరాబాద్ మండల కేంద్రంలోని జయంతి కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. నిషిత తండ్రి కృష్ణా ఇటివలే మృతి చెందాడు. ఆ కుటుంబ సభ్యుల రోదనలు అరణ్య రోదనలుగా మారాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే తండ్రి కూతుళ్లు మృతి చెందటం అందరిని కలచి వేసింది. తల్లి మొగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బషిరాబాద్ ఎస్సై లక్ష్మయ్య వెల్లడించారు.