క్రైమ్/లీగల్

అతి కిరాతకం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, మే 26: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మహిళ రెండు చేతుల మణికట్టు, మెడ కోసేసిన అతికిరాతక ఘటన ప్రజలను భయకంపితులను చేసింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భార్యపై మత్తు స్ప్రే కొట్టి ఈ ఉదంతానికి పాల్పడ్డారు. తేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె కేకలు వేసింది. ఇంట్లో తనతోపాటు ఉండాల్సిన భర్త కనిపించలేదు. భార్యపై దాడి చేసి భర్తను కిడ్నాప్ చేశారా.. లేదా భర్తే భార్యను అంతమొందించాలనుకున్నాడా అనేది పోలీసులకు సవాల్ మారింది. పిఠాపురం బైపాసురోడ్డులో గోపాల్‌బాబా ఆశ్రమం ఎదురుగా ఐశ్వర్య గార్డెన్స్ కాలనీలో నివాసముంటున్న ముమ్మిడి సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు (12), కుమార్తె(14) ఉన్నారు. రైల్వే ఉద్యోగిగా ఒడిస్సా రాష్ట్రం బిలాస్‌పూర్ వద్ద సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం స్వగ్రామం పిఠాపురం మండలం ఎఫ్‌కె పాలెం. సుబ్బలక్ష్మిది కూడా పిఠాపురం మండలంలోని కొండెవరం గ్రామం. బిలాస్‌పూర్‌లో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం పిఠాపురంలో భవనం నిర్మించుకుని పిల్లలతో ఉంటున్నారు. రెండు వారాలకు ఒకసారి ఇంటికి వస్తూ భార్య, పిల్లలను చూసి మరలా బిలాస్‌పూర్ వెడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలిద్దరినీ బిలాస్‌పూర్ పంపించాడు. శుక్రవారం సుబ్బలక్ష్మి భర్తతో కలిసి అమ్మగారిల్లైన కొండెవరం వెళ్లింది. రాత్రి అక్కడే భోజనం చేసి 9 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తరువాత టీవీ చూసిన కొద్దిసేపు సుబ్బలక్ష్మి నిద్రకు ఉపక్రమించింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో, తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటూ కేకలు వేసింది. చేతులు రెండు మణికట్టుల వద్ద, మెడ వద్ద తీవ్రంగా తెగి ఉండటం గమనించి ఆందోళనకు గురైంది. చీకటి సమయం కావడంతో ఆమె కేకలు ఎవ్వరూ వినిపించుకోలేదు. మరోపక్క పక్కన ఉండాల్సిన భర్త కనిపించలేదు. రాత్రంతా నరకం చూసింది. తెల్లవారుజామున అయిదు గంటలు దాటిన తరువాత సుబ్బలక్ష్మి కేకలు ఆమె ఇంటి వెనుక ఉంటున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి వినిపించాయి. పరుగెత్తుకుని వెళ్లి రక్తపు మరకలతో ఉన్న సుబ్బలక్ష్మిని చూసి ఇరుగుపొరుగును పిలిచి 108కి, పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలికి ప్రథమచికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సర్పవరం సీఐ రాంబాబు, పిఠాపురం ఎస్సై శోభన్‌కుమార్, కృష్ణమాచారి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్, జాగిలాలతో ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
భర్త ఏమైనట్టు..?
సుబ్బలక్ష్మి భర్త సుబ్రహ్మణ్యం సెలవు వచ్చినప్పుడల్లా పిఠాపురం వచ్చిపోతుంటాడు. నిద్ర లేచేసరికి రక్తపు మడుగులో ఉన్న తనకు అంతా అయోమయం అనిపించిందని, అయితే నిద్రించిన కొద్దిసేపటికే తనపై ఏదో మత్తుజల్లినట్లు అనిపించి గాఢ నిద్ర పట్టిందని సుబ్బలక్ష్మి పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. ఒకవేళ దొంగతనానికి దుండగులు వస్తే దాడి చేసి దోచుకుని వెళ్లిపోతారు. ఆమె భర్తపైనా దాడి చేసి అక్కడే వదిలి వెళ్లిపోతారు. కాని సుబ్బలక్ష్మి మెడలో బంగారం అలానే ఉంది. ఆమెతో రాత్రి ఇంట్లో ఉండాల్సిన భర్త కనిపించలేదు. భర్తను కిడ్నాప్ చేసే అవసరం ఏముంది. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, వచ్చింది దుండగులేనా.. లేక వేరే ఇతర కారణాలతో భర్తే ఈ ఉదంతానికి ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఉలిక్కి పడ్డ పిఠాపురం
అసలే జిల్లాలో మానసిక రోగులపై ఎక్కడిక్కడ దాడులు, సైకోలు సంచరిస్తున్నారంటూ వస్తున్న పుకార్లతో జనం బిక్కు బిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మహిళ రెండు చేతుల మణికట్టుల వద్ద, మెడ వద్ద అతికిరాతకంగా కోసి చంపేందుకు యత్నించడంతో పిఠాపురం వాసులు ఉలిక్కిపడ్డారు. ఘటన శుక్రవారం రాత్రే జరిగినా బాధితురాలు నివాసముంటున్న ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉండటంతో ఘటన వివరాలు ఉదయం వరకూ ఎవరికీ తెలియలేదు. శనివారం తెల్లవారుజామున సుబ్బలక్ష్మి కేకలు బయటకు వినిపించే వరకూ విషయం ఇంటి కింద పోర్షన్లో ఉంటున్న వారికి కూడా తెలియలేదు. ఆనోటా ఈనోటా దావానంలా ఈఘటన వివరాలు వ్యాపించడంతో జనం హడలిపోయారు. పిఠాపురం చరిత్రలో మునుపెన్నడూ ఇటువంటి ఘటన జరగకపోవడం, ఇలా అతికిరాతకంగా పాల్పడటం వెనుక ఎవరైనా ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందా, సైకోల పనా అనే అనుమానాలతో జనం ఆందోళనకు గురయ్యారు. ఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు సాధ్యమైనంత తొందరగా కేసు ఛేదించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.