క్రైమ్/లీగల్

రేణిగుంట రైల్వే స్టేషన్లో ఎర్ర స్మగ్లర్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 26: రాత్రివేళల్లో రైతులుగా వ్యవహరిస్తూ, పగటి పూట ఎర్రచందనం చెట్లను నరికే తొమ్మిది మంది స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టు కున్నారు. రాత్రివేళల్లో పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నట్లు నటిస్తూ, పగటిపూట ఎర్రచందనం దుంగలనునరికి అక్రమంగారవాణా చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ ఆర్ ఐ భాస్కర్ బృందం గురువారం సాయంత్రం చీకటీగలకోన ప్రాంతంలో 15 మంది స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆప్రాంతాన్ని, రోడ్డు మార్గాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు దిగ్బంధనం చేశారు. దీంతో స్మగ్లర్లు ఎర్రగుట్ట ప్రాంతం వైపు పారిపోయారు. స్మగ్లర్లు ఎంతకీ రాకపోవడంతో శుక్రవారం కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు చాకచక్యంగా రేణిగుంటకు చేరుకున్నారు. వారి ఆలోచనలను ముందుగానే పసిగట్టిన పోలీసులు శుక్రవారం అర్థరాత్రి తరువాత కూంబింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా వారి పాదముద్రలను గుర్తించారు. వారి పాదముద్రలు ఏపీ అగ్రికల్చర్ ఫారం వైపు వెళ్ళి ఉండటం గమనించి అక్కడి టాస్క్ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తంచేశారు. ఆ సమయంలో కొంతమంది పొలాల్లో కూర్చుని ఉండటం గుర్తించి వారిని ప్రశ్నించారు. తమిళ యాసలో తెలుగులో మాట్లాడిన వారు తాము పొలాల్లో పనిచేసే కూలీలమని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది ముగ్గురే ఉండటంతో స్మగ్లర్లు వారిపైకి రాళ్లు విసురుతూ అక్కడి నుంచి పారిపోయారు. 15మంది స్మగ్లర్లు ఉన్నా కానిస్టేబుల్ మోహన్‌బాబు వారిని వెంటాడాడు. ఈ సందర్భంగా నీటి వంక వద్ద దట్టమైన పొదల్లో దాచివున్న 15 దుంగలను గుర్తించారు. అటు తరువాత అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ సిబ్బంది శనివారం తెల్లవారు జామున రేణిగుంట రైల్వే స్టేషన్లో తమిళనాడు నుంచి వచ్చే రైళ్లల్లో 9మంది స్మగ్లర్లు వస్తున్నట్లుసమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఫ్లాట్‌ఫాంలు తనిఖీ చేస్తుండగా వేర్వేరు ప్లాట్‌ఫాంలపై 9 మంది ఎర్రస్మగ్లర్లను అదుపులోకి తీసుకుని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ దాడులను ఐజీ కాంతారావు, డి ఎస్పీ రవిశంకర్ పర్యవేక్షించారు.